OMG! Fancy registration number for scooty gets Rs 1 crore bid - Sakshi
Sakshi News home page

లక్ష రూపాయల స్కూటీకి కోటి రూపాయల నంబర్‌!

Published Fri, Feb 17 2023 9:57 AM | Last Updated on Fri, Feb 17 2023 10:20 AM

Crore Rupee Worth Number For Scooty - Sakshi

( ఫైల్‌ ఫోటో )

ఖరీదైన కార్లకు ఖరీదైన ఫ్యాన్సీ నంబర్లు కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ లక్ష రూపాయలు విలువ చేసే స్కూటీకి ఫ్యాన్సీ నంబర్‌ కోసం కోటి రూపాయలకుపైగా వెచ్చించడం గురించి ఎప్పుడైనా విన్నారా..?  ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా జిల్లా కోట్‌ఖాయ్‌ పట్టణంలో రవాణా శాఖ HP-99-9999 నంబర్‌ను ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచింది. దీని కనీస ధరను రూ. 1000గా నిర్ణయించింది.

ఈ నంబరును దక్కించుకునేందుకు మొత్తం 26 మంది బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. అందులో రూ.1.12 కోట్లకు పైగా ఆన్‌లైన్ బిడ్ రావడం అధికారులను ఆశ్చర్యపరిచింది. ఓ ఫ్యాన్సీ నంబర్‌కు ఇంత మొత్తం కోట్‌ చేయడం ఆ రాష్ట్రంలో  ఇదే తొలిసారి. అయితే భారీ మొత్తంలో కోట్‌ చేసిన ఆ వ్యక్తి వివరాలు తెలియరాలేదు. బిడ్లు ముగించి నంబర్‌ను కేటాయించిన తర్వాతే వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. 

అయితే దీనిపై సిమ్లా డీసీ ఆదిత్య నేగి స్పందిస్తూ HP-99-9999 నంబర్‌ కోసం అత్యధికంగా రూ. 1,12,15,500 కోట్ చేశారని, సదరు వ్యక్తి ఈ నంబర్‌ను కొనుగోలు చేస్తున్నది ద్విచక్ర వాహనం కోసమా లేదా నాలుగు చక్రాల వాహనం కోసమా అన్నది తెలియలేదని వివరించారు.

(ఇదీ చదవండి: యూపీఐకి క్రెడిట్‌ కార్డుల అనుసంధానం.. ఫస్ట్‌ టైమ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement