బాధితుడికి అధికారులు పంపిన చలాన్
సాక్షి, జోగిపేట(అందోల్): ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై నిలిపిన కారుకు ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. అనంతరం చలాన్‌ను వాహనం అడ్రస్‌కు పోస్టు చేయగా, అది కారు యజమానికి కాకుండా అదే నంబర్‌తో ఉన్న స్కూటీ యజమానికి చేరిన ఘటన జోగిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జోగిపేటకు చెందిన బండారు మహేశ్ అనే వ్యక్తికి ఈనెల 14న పోస్టు ద్వారా వచ్చిన చలాన్ చూసిన మహేశ్ ఖంగుతిన్నాడు. ఈనెల 12వ తేదిన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రోడ్డుపై నిలిపిన టీఎస్ 15 ఎఫ్‌ఇ 8745 నంబరుగల ఎర్టిగా వాహనానికి పోలీసులు జరిమానా విధించారు. వాహనాన్ని పరిశీలించకుండా చలాన్‌ను స్కూటీ యజమాని అడ్రస్‌కు పోస్టు చేశారు. జరిమానా రశీదు అందుకున్న మహేశ్ వెంటనే జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించగా, చలాన్ పటాన్‌చెరు పరిధిలో వేసినందున అక్కడికే వెళ్లాలని పోలీసులు సూచించినట్లు తెలిపాడు.
ఇంతకీ కారు ఎవరిది?
ఒకే నంబరుతో రెండు వాహనాలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. స్కూటీకి కూడా ఆర్‌టీఏ అధికారులు అదే నంబర్ కేటాయించినట్లుగా ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. కారుకు కూడా అదే నంబరు ఇచ్చారా, లేక కారు యజమాని నంబర్ మార్చాడా అనే విషయం
తెలియాల్సి ఉంది.
చదవండి: ఎంత జాగ్రత్తపడ్డా.. అడ్డంగా దొరికిపోతారు.. ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి?
Comments
Please login to add a commentAdd a comment