
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. తాజాగా సరూర్‌నగర్ గ్రీన్ పార్క్ కాలనీలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న క్రమంలో తపోవన్ కాలనీ వద్ద రోడ్డు పై వరద నీటిలో బైక్ మొరాయించింది. కాగా స్కూటీపై వెనక ఉన్న వ్యక్తి బైక్ దిగి నెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు సరూర్‌నగర్ చెరువు నీటిలో అతడు పడిపోయాడు. వ్యక్తిని గమనించిన స్థానికులు కాపేడే లోపు లోపలికి కొట్టుకుపోవడంతో సరూర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. కాగా తప్పిపోయిన వ్యక్తి ఆచూకి కోసం జీహెచ్ఎంసీ రెస్క్యూ టీమ్, పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment