ఏ ఉద్యోగంలో అయినా పని ఒత్తిడి మామూలే. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరులో ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌లో వర్క్ కాల్‌లో అటెండ్ అవుతూ స్కూటర్ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన తర్వాత వర్క్-లైఫ్ బ్యాలెన్స్, 70 గంటల వర్క్ వీక్ చర్చ సోషల్ మీడియాలో తిరిగి మొదలైంది.
పీక్ బెంగుళూరు అనే హ్యాండిల్‌పై ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ క్లిప్ దేశ ఐటీ రాజధాని మూసచిత్రాన్ని చూపించింది. ఇక్కడ టెక్ నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో తమ ల్యాప్‌టాప్‌లపై పనిలో నిమగ్నమై ఉండటం సర్వసాధారణమే. అయితే ఈ ఉద్యోగి మాత్రం ఓ వైపు స్కూటర్ నడుపుతూ.. మరోవైపు ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని వర్క్ కాల్ అటెండ్ అవుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజనులు పలు విధాలుగా స్పందించారు. "బ్రో ఐటీ కంపెనీలో ఉండాలంటే పని చేస్తూనే ఉండాలి. వారానికి 70 గంటల సమయం కూడా సరిపోదు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "క్లయింట్ కాల్, మరణం ఎప్పుడైనా రావచ్చు" అని మరో యూజర్ చమత్కారంగా రాసుకొచ్చారు. "ఈ రోజుల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువే. అయినా ఇలా మాత్రం చేయొద్దు" అని ఇంకొక యూజర్ హితవు పలికారు.
Bengaluru is not for beginners 😂
— Peak Bengaluru (@peakbengaluru) March 23, 2024
(🎥: @nikil_89) pic.twitter.com/mgtchMDryW
Comments
Please login to add a commentAdd a comment