Bengaluru Man
-
Viral Video: స్కూటీ నడుపుతూ వర్క్ కాల్.. ఈ ఐటీ ఉద్యోగి కష్టం చూడండి..
ఏ ఉద్యోగంలో అయినా పని ఒత్తిడి మామూలే. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరులో ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌లో వర్క్ కాల్లో అటెండ్ అవుతూ స్కూటర్ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన తర్వాత వర్క్-లైఫ్ బ్యాలెన్స్, 70 గంటల వర్క్ వీక్ చర్చ సోషల్ మీడియాలో తిరిగి మొదలైంది. పీక్ బెంగుళూరు అనే హ్యాండిల్‌పై ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ క్లిప్ దేశ ఐటీ రాజధాని మూసచిత్రాన్ని చూపించింది. ఇక్కడ టెక్ నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో తమ ల్యాప్‌టాప్‌లపై పనిలో నిమగ్నమై ఉండటం సర్వసాధారణమే. అయితే ఈ ఉద్యోగి మాత్రం ఓ వైపు స్కూటర్ నడుపుతూ.. మరోవైపు ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని వర్క్ కాల్ అటెండ్ అవుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజనులు పలు విధాలుగా స్పందించారు. "బ్రో ఐటీ కంపెనీలో ఉండాలంటే పని చేస్తూనే ఉండాలి. వారానికి 70 గంటల సమయం కూడా సరిపోదు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "క్లయింట్ కాల్, మరణం ఎప్పుడైనా రావచ్చు" అని మరో యూజర్ చమత్కారంగా రాసుకొచ్చారు. "ఈ రోజుల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువే. అయినా ఇలా మాత్రం చేయొద్దు" అని ఇంకొక యూజర్ హితవు పలికారు. Bengaluru is not for beginners 😂 (🎥: @nikil_89) pic.twitter.com/mgtchMDryW — Peak Bengaluru (@peakbengaluru) March 23, 2024 -
ఎప్పుడూ ల్యాప్‌టాపేనా?.. స్కూటర్‌పైన వెళ్తూ కూడా అవసరమా!!
కర్ణాటక: బెంగళూరు ఫ్లై ఓవర్ మీద స్కూటర్లో వెళ్తూ ల్యాప్‌టాప్ చూస్తున్న వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. హర్షమిత్సింగ్ అనే వ్యక్తి ఫోటో తీసి పోస్ట్ చేయడంతో నెటిజన్లు తలోరకంగా స్పందించారు. పని లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే తప్పదని కొందరు, నగరరోడ్లపై ఇలాంటి రిస్క్ చేయడం శ్రేయస్కరం కాదని మరికొందరు పేర్కొన్నారు. -
నిజానిజాల కోసం 23 ఏటీఎంలు తిరిగాడు!
నల్లధనంపై పోరాటం కోసమంటూ.. దేశంలో మార్పు కోసమంటూ ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవైపు ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు కష్టాలు పడుతుండగా.. మరోవైపు మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. క్యూలో నిలబడి నిలబడి ప్రజలు కొంతమంది ప్రాణాలు విడుస్తుండగా.. ఏకంగా పార్లమెంటులోని ఏటీఎంలోనూ డబ్బులు అయిపోయి.. ఔవటాఫ్ సర్వీస్ మోడ్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన టిను చెరియర్ అబ్రహం సొంతంగా నిజానిజాలు తెలుసుకోవడానికి బయలుదేరాడు. నగరంలోని ఏటీఎంలు నిజంగా పనిచేయడం లేదా? లేక మీడియానే కావాలని కథనాలు వండి వారుస్తున్నదా? అన్నది చెరియన్ సందేహం. అందుకే మీడియా కథనాల్లోని నిజానిజాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు అతను బెంగళూరులోని 23 ఏటీఎంలను సందర్శించాడు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇలా దాదాపు నగరంలోని అన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంలను చెక్ చేశాడు. మీడియా కథనాలు ఏమో కానీ అతనికి నిజాలు ప్రత్యక్షంగా చూసి బిత్తరపోయినంత పని అయింది. అతను తిరిగిన ఏటీఎంలన్నీ మూతబడి ఉన్నాయి. గతంలో ఎన్నడూ మూతపడి ఎరుగని ఏటీఎంలు సైతం ఇప్పుడు మూతపడ్డాయని అతను వరుస ట్వీట్లలో తెలిపాడు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన నగదు కష్టాలను ఈ ట్వీట్లు చాటుతున్నాయని, పరిస్థితిని ఇప్పటికైనా మార్చాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
ఇంటర్వ్యూ లేకుండా ‘జీక్యూ’ జాబ్ కొట్టాడు!
బెంగళూరు: ఇంటర్వ్యూ కూడా లేకుండా రెజ్యూమెతోనే ఏకంగా జాబ్ కొడితే ఎలా ఉంటుంది? బెంగళూరుకు చెందిన సుముఖ్ మెహతా విషయంలో అదే జరిగింది. లండన్ కేంద్రంగా పనిచేసే ‘జీక్యూ’ మేగజీన్ ఉద్యోగాల భర్తీ కోసం ఔత్సాహికుల నుంచి తొలుత రెజ్యూమెలను ఆహ్వానించింది. వాటిని వడపోసి ఎంపికైన వారిని ఇంటర్య్వూకు పిలవాలనుకుంది. సుముఖ్ తన రెజ్యూమె కూడా అందరిలా ఉంటే కిక్కు ఏం ఉంటుంది అనుకున్నాడో ఏమో? తన రెజ్యూమెను ఏకంగా జీక్యూ మేగజీన్ లాగానే డిజైన్ చేసి పంపాడు. ఇంకేముంది దాన్ని చూసిన మేగజీన్ ఎడిటర్ డైలన్ జోన్స్ అతని సృజనాత్మకతకు ఫిదా అయిపోయి ఇంటర్వ్యూ కూడా లేకుండానే లండన్‌లోని హెడ్డాఫీసులో కొలువిచ్చాడు.