
ఇంటర్వ్యూ లేకుండా ‘జీక్యూ’ జాబ్ కొట్టాడు!
బెంగళూరు: ఇంటర్వ్యూ కూడా లేకుండా రెజ్యూమెతోనే ఏకంగా జాబ్ కొడితే ఎలా ఉంటుంది? బెంగళూరుకు చెందిన సుముఖ్ మెహతా విషయంలో అదే జరిగింది. లండన్ కేంద్రంగా పనిచేసే ‘జీక్యూ’ మేగజీన్ ఉద్యోగాల భర్తీ కోసం ఔత్సాహికుల నుంచి తొలుత రెజ్యూమెలను ఆహ్వానించింది. వాటిని వడపోసి ఎంపికైన వారిని ఇంటర్య్వూకు పిలవాలనుకుంది.
సుముఖ్ తన రెజ్యూమె కూడా అందరిలా ఉంటే కిక్కు ఏం ఉంటుంది అనుకున్నాడో ఏమో? తన రెజ్యూమెను ఏకంగా జీక్యూ మేగజీన్ లాగానే డిజైన్ చేసి పంపాడు. ఇంకేముంది దాన్ని చూసిన మేగజీన్ ఎడిటర్ డైలన్ జోన్స్ అతని సృజనాత్మకతకు ఫిదా అయిపోయి ఇంటర్వ్యూ కూడా లేకుండానే లండన్‌లోని హెడ్డాఫీసులో కొలువిచ్చాడు.