
భువనేశ్వర్: సాధారణంగా మనలో చాలా మంది చిన్న బల్లిని చూస్తేనే అరిచి గోల గోల చేస్తుంటారు. అలాంటిది పామును చూస్తే ఇంకేమైనా ఉందా! పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఓ మహిళ మాత్రం ఐదడగుల పామును సునాయాసంగా చేత్తో పట్టుకుని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉండే స్వరూప భట్నాగర్ బయటకు వెళ్దామని ఇంటి తలుపు తీసింది. సరిగ్గా అప్పుడే అనుకోని అతిథి ఇంటికి రావడాన్ని చూసి షాక్‌కు గురైంది. వెంటనే లోపలికి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది. ఇంతకీ ఆ అతిథి ఏవరోకాదు.. 5 అడుగుల నాగుపాము. దాని భయంతో ఇంట్లోనే ఉండిపోయిన ఆమె ఆ సర్పం అక్కడ నుంచి వెళ్లిపోయిందా? లేదా? అని కిటికిలో నుంచి తొంగి చూసింది. ఆ నాగుపాము బయట పార్కింగ్ చేసిన ఒక స్కూటీపై ఎక్కి పడగ విప్పింది. ఇది గమనించిన స్వరూపభట్నాగర్ వెంటనే, స్నేక్ క్యాచర్ సుబేందు మల్లిక్‌కు సమాచారం అందించింది.
పాములను పట్టుకొవడంలో మంచి ఎక్స్‌పర్ట్ అయిన సుబేంద్ క్షణాల్లో అక్కడకు చేరుకుంది. బుసలు కొడుతున్న నాగుపామును ఒక కర్ర సహయంతో పట్టుకుని అటవీ ప్రదేశంలో వదిలేసింది. సాధారణంగా పాములు ఆహరం కోసం బయట సంచరిస్తాయని, ఆ క్రమంలోనే ఇక్కడకు వచ్చి ఉంటుందని చెప్పింది. గత కొన్నిరోజులుగా ఆ పాముకు ఆహారం కరువైనట్లు కనిపిస్తోందని, దానివల్ల కొంత నీరసంగా ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment