వామ్మో.. ఇంట్లోనే నాగుపాముల గుట్ట  | 43 Cobra Rescued from House In Odisha | Sakshi
Sakshi News home page

నాగుపాముల గుట్ట 

Published Sun, Jun 28 2020 1:01 PM | Last Updated on Sun, Jun 28 2020 1:43 PM

43 Cobra Rescued from House In Odisha - Sakshi

భువనేశ్వర్ ‌: భద్రక్‌ జిల్లాలోని కొలై పంచాయతీ, రంగరాజ్‌పూర్‌ ప్రాంతంలోని బిజయ్‌ బిశ్వాల్‌ ఇంట్లో నాగుపాముల గుట్ట బయటపడింది. దాదాపు వారం రోజుల నుంచి పాముల బుసలబుసల చప్పుడు వినబడడంతో సందేహించిన కుటుంబ సభ్యులు స్నేక్‌ హెల్ప్‌ లైన్‌ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో మీర్జా అరీఫ్‌ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన స్నేక్‌ హెల్ప్‌ లైన్‌ బృందం సుమారు 6 గంటల పాటు శ్రమించి, 43 నాగుపాము పిల్లలతో పాటు ఓ తల్లి నాగుపామును పట్టుకున్నారు. వీటితో పాటు పొదగని 58 పాము గుడ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పాముపిల్లల దృష్ట్యా సంఘటన స్థలంలో కనీసంగా 3 తల్లి పాములు ఉండొచ్చని అధికారులు అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కటి మాత్రమే పట్టుబడగా, మరో 2 పెద్దపాములు ఉండొచ్చని అంతా భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement