![Bike Thieves Stealing Scooty In Chandanagar - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/7/Bike-Thieve.jpg.webp?itok=705KBlUh)
స్కూటీ చోరీ చేస్తున్న దొంగ
సాక్షి, హైదరాబాద్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కింగ్ చేసి పక్కకు వెళ్లి వచ్చే లోపు బండిని అదృశ్యం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చందానగర్‌లోని ఫాస్ట్‌స్టెప్ షాపు ముందు జరిగింది. వివరాలు.. శుక్రవారం సాయంత్రం షాపింగ్ కోసం వచ్చిన మహిళ తన ద్విచక్ర వాహనాన్ని చందానగర్ లోని ఫాస్ట్‌స్టెప్ షాపు ముందు నిలిపి లోపలి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి స్కూటీ కనపడలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. తన స్కూటీ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని తీసుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. అనంతరం పుటేజీ ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment