
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోని పేద విద్యార్థులకు బోధించడం, స్కాలర్‌షిప్‌లను అందజేయడం ద్వారా సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలని ఐఐటీ ఢిల్లీ పుర్వ విద్యార్థులకు రాష్ట్రపతి కోవింద్ సూచించారు. ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో 48వ స్నాతకోత్సవంలో కోవింద్ పాల్గొన్నారు. ప్రపంచంలోని గొప్ప వర్సిటీలు అన్నింటిలోనూ పూర్వ విద్యార్థులకు.. విద్యా సంస్థలకు మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. పూర్వ విద్యార్థులను ఆర్థిక సాయం కోణంలోనే కాకుండా.. విజ్ఞానాన్ని పంచుకోవడానికి వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment