
మాట్లాడుతున్న తిరుపాల్‌నాయక్ కుటుంబీకులు
పుట్టపర్తి అర్బన్(శ్రీ సత్యసాయి జిల్లా): మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చీప్ ట్రిక్స్‌కు తెరలేపారు. శుక్రవారం కొత్తచెరువు మండలం బండ్లపల్లికి చెందిన సర్పంచ్ గీతాబాయి మామ తిరుపాల్‌నాయక్ వీధిలైట్ల కోసం బండ్లపల్లికి వెళ్తుండగా...అదే సమయంలో సోమందేపల్లికి వెళ్లున్న మాజీ మంత్రి అతన్ని దారిలో ఆపాడు. బలవంతంగా టీడీపీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని టీడీపీ వాట్సాప్ గ్రూపులకు పంపారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపాల్ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి వివరించారు.
చదవండి: వైరల్ వీడియో: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి..
ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అంతేగాని పల్లె చీప్ ట్రిక్స్‌కు లోనయ్యే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ నాయకులు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీధర్‌రెడ్డిని ఎమ్మెల్యేగాను, వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో బండ్లపల్లి సర్పంచ్ గీతాబాయి, రూప్లానాయక్, తిరుపాల్ నాయక్, తలమర్ల మాజీ సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment