Updates..
►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య అవసరం, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక చింతనతో సమాజసేవ చేయాలి. సత్యసాయి బాబా సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం. విద్య, వైద్యం, తాగునీరు, ఆధ్యాత్మికత విస్తరణకు బాబా బాగా కృషి చేశారు అని అన్నారు.
►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
►పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.
►పుట్టపర్తి సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్
►బాబా మహాసమాధికి నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్
►సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి, గవర్నర్.
►పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
►రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్
►సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి వచ్చిన రాష్ట్రపతి, గవర్నర్
►సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
►రాష్ట్రపతికి స్వాగతం పలికిన మంత్రి ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్
►భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కలెక్టర్ అరుణ్‌బాబు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 1.05 గంటలకు ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు.
►మధ్యాహ్నం 3.05 గంటలకు సాయికుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 3.35 గంటలకు స్నాతకోత్సవంలో భాగంగా 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment