Cheap politics
-
జగన్ మాస్ లీడర్.. చిల్లర రాజకీయాలు మానుకోవాలి
-
మా పార్టీ తరుపున గెలిచిన వాళ్లకు టీడీపీ బీ-ఫారం... డిప్యూటీ మేయర్ ఎన్నికపై కాకాణి కామెంట్స్
-
జగన్ ఎప్పుడో చెప్పారు.. చంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చేది..
-
టీడీపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు
-
టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం
-
లక్ష కోట్ల డ్రగ్స్.. ఆపరేషన్ గరుడ ఏమైంది.. చంద్రబాబు ఆర్గనైజడ్ క్రైమ్ చేయడంలో దిట్ట..
-
పవన్, బాబుపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
-
నెలకో నాటకం.. ప్రజలకు నరకం
-
సజ్జలని కావాలనే ఇరికించారు
-
బాబుకు బిగ్ షాక్... బాబు నీచ పాలనకు వీళ్ళే నిదర్శనం
-
జగన్ అంటే బాబుకు వణుకు.. మంత్రి అనితను పంపించి..
-
లడ్డూ విషయంలో బాబు నీచ రాజకీయాలు
-
Big Question: తిరుమలలో నాస్తికుడు.. నారా బాబు నీచ పనులు
-
బెడిసికొట్టిన పన్నాగం
-
తిరుపతి లడ్డుతో మత రాజకీయం..
-
అమ్మాయిల బతుకు ఫర్ సేల్
-
మరోసారి నీచ రాజకీయాలకు తెర తీసిన చంద్రబాబు
-
BIG Queation: ప్రాణాలు పోయి ప్రజలు ఏడుస్తుంటే రాజకీయమా... నీచత్వమే నారా వారి నైజమా
-
బయటపడ్డ కూటమి సర్కారు నిజస్వరూపం
-
KSR Live Show: పేదల కంచంలో ముద్ద లాక్కుని బతికే బతుకు ఓ బతుకేనా బాబు
-
మరోసారి శకుని రాజకీయాలకు తెరతీసిన చంద్రబాబు
-
అదే బాబు.. అదే మోసం
-
సాక్షాత్తూ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసు.. FIR ఎలా..?
-
చంద్రబాబు నీచ రాజకీయం బయటపెట్టిన విజయసాయి రెడ్డి
-
నా ఆఖరి శ్వాస ఉన్నంతవరకు జగన్ తోనే
-
టీడీపీపై రెచ్చిపోయిన రావెల కిషోర్ బాబు
-
తోడు దొంగల కొత్త తెలివి తేటలు
-
సీఎం జగన్ కి తగిలి..నా మీద పడింది..
-
ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగవుతుంది...
-
ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా చంద్రబాబూ..
పచ్చ పార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని వారి సర్వేల్లోనే తేలిపోయింది. జనసేన-బీజేపీలతో ప్రత్యక్షంగానూ కాంగ్రెస్‌తో పరోక్షంగానూ కమ్యూనిస్టులతో సీక్రెట్ ఒప్పందాలతోనూ బరిలో దిగినా లాభం ఉండేలా లేదని తేలిపోయింది. దింపుడు కళ్లెం ఆశలు కూడా అడుగంటేశాయని అర్ధమైపోతోంది. ఇంత ఫ్రస్ట్రేషన్లో వాలంటీర్లపై కక్షసాధింపు కోసం తాము పన్నిన పాచిక తమనే లాగి లెంపకాయ కొట్టేయడంతో దవడ వాచిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జనం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రలోనే ఉన్నారని అర్ధం అయిపోయింది. మరేం చేయాలి? ఈ కష్టాల్లోనే చంద్రబాబు నాయుడికి ఓ దిక్కుమాలిన ఐడియా వచ్చింది. దాంతో పాలక పక్షం ఓడిపోతోందంటూ ప్రచారం చేయించడానికి మౌత్ టాక్ మల్లిగాళ్లకు కిరాయి డబ్బులిచ్చి ఊళ్లపైకి వదిలారు. అయితే వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులుగా మాయదారి ముఠాలు ఊళ్లల్లో తిరుగుతున్నాయి స్టూవర్ట్‌పురం దొంగల ముఠాలకన్నా ప్రమాదకరమైన ముఠాలవి. చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం.. ఆయన రాజకీయ ప్రత్యర్ధులపై విష ప్రచారం చేయడం ఈ ముఠాల పని. దీని కోసం వీరికి కిరాయి చెల్లిస్తున్నారు. ఈ ముఠాల అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందంటే.. తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. చంద్రబాబు నాయకత్వానికి కూడా. ఈ ఎన్నికల్లో కూడా ఓడి ఇంట్లోనే ఉండాల్సి వస్తే టీడీపీ దుకాణానికి తాళాలు వేయాల్సిందే. ప్రస్తుత వాతావరణం చూస్తోంటే ఈ సారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజయమే ఖాయమని రకరకాల సర్వేలు చెబుతున్నాయి. టీడీపీకి ఈసారి మరింత ఘోర పరాభవం తప్పదని క్లారిటీ ఇస్తున్నారు అంతా. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల మనసులు మార్చడం తన వల్ల కాదని తెలిసిపోయింది. టీడీపీ గెలుస్తుందని చెప్పించుకున్నా ఎవరూ నమ్మరని అర్ధమైపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు తనకే సాధ్యమైన ఓ క్షుద్ర ఆలోచనను మెదడులోంచి బయటకు తీశారు. ఆ ఆలోచన ఏంటంటే.. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి గెలుస్తుందని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గెలవదని చెబితే ఏమైనా వర్కవుట్ అవుతుందేమో అని ఓ పుచ్చు ఐడియాను అమలు చేస్తున్నారు. జనం ఎక్కువగా తచ్చాడే కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రైళ్లల్లో కొన్ని గుంపులను పంపిస్తున్నారు చంద్రబాబు. ఈ గుంపుల పని ఏంటంటే.. మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలమే కానీ.. ఈ సారి మా పార్టీ ఓడిపోయేలా ఉంది" అని ప్రచారం చేస్తున్నారు. అంటే మౌత్ టాక్ పబ్లిసిటీ అన్నమాట. దీనికి గానూ ఈ గుంపులకు రోజుకింత అని కిరాయి ముట్టజెబుతున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచులను ఆరు బయట పెయిడ్ ఆర్టిస్టులను మేపినట్లే..ఈ మౌత్ టాక్ మల్లిగాళ్లను ఎన్నికల వరకు మేపాలని డిసైడ్ అయ్యారు. జనం రద్దీగా ఉండే చోట వీళ్లు అమాంతం వచ్చి.. వాళ్లే మాటలు కలిపి ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ రాదండి అనేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ చచ్చు ఐడియా కూడా వర్కవుట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ గుంపుల్లో ఉండే వారంతా పచ్చ కార్యకర్తలే. గతంలో ఇటువంటి కార్యకర్తలే పవన్ కల్యాణ్ కుటుంబంపైనా విషం చిమ్మారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కష్టం వచ్చినా మల్లిగాళ్లను పిలిపించి ఇటువంటి అసైన్ మెంట్లు ఇప్పిస్తారు చంద్రబాబు. మౌత్ టాక్ తోనే పాలక పక్షాన్ని దెబ్బతీయాలన్న పిచ్చి ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. అసలింతకీ ఈ అయిడియా రావడానికి కారణాలేంటి? చంద్రబాబు అంతగా ఓటమి భయంతో కుంగిపోడానికి కారణాలు ఉన్నాయి. జనం తమ వైపు లేరు. విజయం తమ వైపు లేదు. అధికారం తమకు దక్కేలా లేదు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ నాటి పూర్వ వైభవం వచ్చేలా లేదు.చంద్రబాబు, లోకేష్ లు సభలు పెడితే జనం కనపడ్డం లేదు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్ధమా అని సభలు పెడితే ఇసకేస్తే రాలని జనంతో నేల కనపడ్డం లేదు. ఈ రెండు దృశ్యాల మధ్య తేడా చూసి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అధిపతులకు కళ్లు బైర్లు కమ్మి కళ్లముందు ఏమీ కనపడ్డం లేదు. తమ ఓటమి ఖాయమని స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా తమ పార్టీ కుప్పకూలిన రోజునే చంద్రబాబుకు అర్ధం అయిపోయింది. పార్టీయే కాదు తన సొంత నియోజక వర్గంలో తనకు కూడా ఓటమి తప్పదన్న భయం చంద్రబాబు గుండెల్లో పెర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది. పేరుకి ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. కాలం కలిసొచ్చినపుడు..తమ పెంపుడు మీడియా తమకి బాకా ఊదిన రోజుల్లో ఢిల్లీలో చక్రాలు తిప్పామని చెప్పించుకున్న చంద్రబాబు ఇపుడు ఏపీలో కాదు తన సొంత నియోజక వర్గంలోనే సైకిల్ చక్రాన్ని కూడా తిప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నారు. అది సరిపోదని బిజెపి నేతలు ఛీ ఛీ అంటోన్న కాళ్లబేరాలాడి పొత్తు పెట్టుకున్నారు. తాము ముగ్గురం కలిసి బరిలో దిగినా ఒరిగేదేమీ లేదని తేలడంతో కాంగ్రెస్ తో రహస్య పొత్తు పెట్టుకున్నారు. వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయం ఉండాలని 2014 నుంచి ఏపీలో ఏ ఎన్నికలోనూ బోణీ కొట్టని కమ్యూనిస్టులతో సీక్రెట్ డీల్స్ పెట్టుకున్నారు. అయినా వర్కవుట్ అయ్యే లా లేదని.. స్వయం ప్రకటిత మేథావులను తీసుకొచ్చి వారికి ఓ దుకాణం తెరిచి ఆ దుకాణం తరపున పాలకపక్షంపై విషం చిమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఆ దుకాణం తరపునే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించారు. మండు టెండల్లో అవ్వా తాతలను మంచాలపై తీసుకెళ్లి పింఛన్లు ఇప్పించుకుంటోన్న దృశ్యాలు చూసి యావత్ ఆంధ్ర ప్రదేశ్ ... చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లతో పాటు వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి పింఛనుదార్ల పొట్ట కొట్టించిన నిమ్మగడ్డ రమేష్ పై నిప్పులు చెరుగుతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లోనే విపక్ష కూటమికి గూబ గుయ్యిమనేలా గుణపాఠం చెబుతామని అంటున్నారు. రకరకాల సర్వేలు ఏపీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం ఖాయమని తేల్చాయి. చంద్రబాబు నాయుడు సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ అదే తేలింది. రెక్కలు ముక్కలు చేసుకుని.. సిగ్గు లజ్జ వదిలేసి బిజెపి నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్నా తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేలడంతో చంద్రబాబుకు చలి జ్వరం వచ్చేసినట్లయ్యింది. ఏం చేయాలో పాలుపలోలేదు. ఎల్లో మీడియా ఇచ్చిన చచ్చు సలహాతో వాలంటీర్ల పై ఆంక్షలు విధిస్తే ఇపుడు 66 లక్షల మంది పింఛను దార్లు తనపై పీకలదాకా కోపంతో ఉన్నారని తెలిసి చంద్రబాబుకు నవ రంధ్రాల్లోంచి భయం కారిపోతోంది. అయితే కొద్ది మంది మనసుల్లో అయినా విషం చిమ్మితే ఆ మేరకు అయినా వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టచ్చన్న చిల్లర ఐడియాతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు పేద ప్రజల తెలివితేటల ముందు ఎందుకూ పనికిరావంటున్నారు రాజకీయ పండితులు. అయితే ప్రస్తుతం ఏపీలో మెజారిటీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అయిదేళ్లుగా తమ ఖాతాల్లో నేరుగా జమ అయిన సంక్షేమ పథకాల నిధులు తమ ఇళ్లల్లో తెచ్చిన వెలుగులను తమ జీవితాల్లో తెచ్చిన మార్పులను వారు మర్చిపోలేదు. తమ జీవితాలు ఇలానే హాయిగా కొనసాగాలంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి కొలువు తీరాలంటున్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర లో దారి పొడవునా లక్షలాదిగా తరలి వచ్చిన పేదలు ఈ విషయాన్నే ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టాయి. ఆ తర్వాత ఆయన బస్సుయాత్ర ఆరంభించగానే రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీస్తోన్న భీకర వేడి వాతావరణంలోనూ ఆరేళ్ల కుర్రాడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు మరోసారి జగన్ మోహన్ రెడ్డినే సీఎంని చేసుకోడానికి తామంతా సిద్ధం సిద్ధం అంటున్నారు. చంద్రబాబు నాయుడి తరపున పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరిగినట్లు.. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విజయంపై దుష్ప్రచారం చేసే ముఠాలు ఎక్కడైనా కనిపిస్తే జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు పాలక పక్ష నేతలు. -
వీధినపడ్డ అవ్వా, తాతలు ఈ పాపం చంద్రబాబుదే
-
పెన్షన్ల పంపిణీపై నీచ రాజకీయం
-
ధూళిపాళ్ల బరితెగింపు
-
డబ్బుతో రండి..అధికారంలోకి వస్తే దండుకొండి
-
సూత్రధారి కుటిలనీతి చంద్రబాబు
-
షర్మిల చదువుతున్నది ఎవరి స్క్రిప్ట్..టీడీపీ, జనసేన మధ్య ఏం జరుగుతుంది ?
-
రంగా హంతకులెవరో ఎల్లో తాతకు తెలియదా..?
-
గ్రామాల అభివృద్ధిని అడ్డుకోబోయి బోర్లాపడ్డ విపక్షాలు
-
పూర్తిగా ప్యాకేజీ స్టార్ గా మారిపోయిన పవన్ కళ్యాణ్
-
చెత్త విమర్శలు..చిల్లర చేష్టలు
-
తుపాను తాకిడి ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ టూర్లు
-
దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..!
పోయింది. పరువంతా పోయింది. తెలంగాణ గట్టు మీద వేసిన పొలిటికల్ పిల్లిగంతులను ఓటర్లు అదిరిపోయే రేంజ్లో తిప్పికొట్టారు. తెలంగాణలో పార్టీ జెండా పీకేసినా.. చంద్రబాబుకి ఫలితం దక్కలేదు. ఓట్ల వేటలో దత్తపుత్రుడికి డిపాజిట్లు దక్కలేదు. ఇక్కడేదో చేసేసి.. ఆ ప్రభావంతో ఏపీలో ఏదేదో చేసేద్దామని పన్నిన కుట్రలు ఈవీఏంల సాక్షిగా కుళ్లు కంపు కొట్టేశాయి. ఇప్పుడు ఇక ఏపీ వంతు. ఎవరికి ఎవరు ఏం అవుతారు ? ఎవరు ఎవరితో కలుస్తారు ? పార్టీలు కలిసినంత మాత్రానా క్యాడర్ కలుస్తుందా ? టీడీపీ, జనసేన, మధ్యలో బీజేపీ. ఈ గజిబిజి గందరగోళానికి తెర పడేదెప్పుడు ? తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేస్తే.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద లైట్ వెలగాలి. చంద్రబాబు గీసిన స్కెచ్ సారంశం అదే. అందులో భాగంగానే దత్తపుత్రుడ్ని కూడా రంగంలోకి దింపి.. బీజేపీతో పొత్తు సరాగాలు ఆలపించేలా చేసింది చంద్రబాబే అని రాజకీయ వర్గాల్లో టాక్. ఏపీ అదిరిపోయేలా తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేయాలని చంద్రబాబు తలిస్తే.. బాబుకి, దత్తపుత్రుడికి తలతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. సీమాంధ్ర ఓటర్లంతా మావాళ్లే అని తెగచెప్పే విజనరీకి కనువిప్పు కలిగిస్తూ గ్రేటర్ అంతా బీఆర్ఎస్కి జై కొట్టింది. ఇక పవన్కళ్యాణ్కొచ్చిన కష్టమైతే పగొళ్లకి కూడా రాకూడదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవైపు డిపాజిట్లు పోయి బోరుమంటుంటే...మరోవైపు బర్రెలక్క పాటి విలువ లేదు ప్యాకేజీ స్టార్‌కి అంటూ మొదలైన పొలికలు జనసేనకి జ్వరం వచ్చేలా చేశాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్‌లు. సరే... ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇక ఏపీ వైపు చూద్దామనుకునే లోపు...కథ మరో మలుపు తిరిగిందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెల్చుకున్న హిందీ బెల్ట్‌లోని మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఊపు చూస్తుంటే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీని సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే బీజేపీకి దగ్గర కావడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అవలంభించిన వైఖరితో.. బీజేపీ మరింతగా దూరం పెడుతోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా పార్టీ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు మళ్లించే చచ్చు వ్యూహానికి చంద్రబాబు పదును పెట్టారో.. ఇటు బీజేపీ కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పటి దాకా జనసేనతోనే పొత్తు అంటూ వచ్చిన బీజేపీ.. ఇప్పుడు "టీడీపీ కాంగ్రెస్‌తోనూ, ఇండియా కూటమిలోనూ ఉండొచ్చు. ఆ పార్టీతో మాకు సంబంధం ఏంటని" ఎదురు ప్రశ్నిస్తోంది. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయ్యాక...ఇక ఆల్ ఈజ్ వెల్ అన్న భావనలోనే చంద్రబాబు వెళ్లిపోయారు. అటు పురంధేశ్వరి కూడా టీడీపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్టీ క్యాడర్ని ఆశ్చర్యపరిచారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని వెనకేసుకురావడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్‌కి జాతీయ స్థాయి నేతల అపాయింట్మెంట్ ఇప్పించడం కోసం విశ్వప్రయత్నాలు చేయడం. ఇలా చాలానే చేశారు. చివరకు మీరు...మాకు అధ్యక్షురాలా ? టీడీపీకా అంటూ బీజేపీ నేతలు బహిరంగంగా పురంధేశ్వరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. క్లుప్తంగా చెప్పాలంటే...పురంధేశ్వరి కూడా టీడీపీని బీజేపీకి దగ్గర చేయలేకపోయింది. తెలంగాణ ఎన్నికల తర్వాత టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందేమో అనే దాకా బీజేపీ నేతలొచ్చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య సాగుతోన్న వార్ ఎపిసోడ్స్ ఇటు చంద్రబాబులో, అటు పవన్‌కళ్యాణ్‌లో టెన్షన్ పెంచేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల తర్వాత చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. రోలు మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఈ భేటీని అభివర్ణిస్తున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీ ఎత్తుగడలు తెలంగాణలో చిత్తు అయ్యాయి. ఈ తరుణంలో డిపాజిట్లు కోల్పోయిన పవన్ తన కష్టాలు చెప్పుకుంటే...ఆయన ఓదార్చేదేం ఉంటుంది ? ఈ విషయం పక్కన పెడితే...ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ఏపీలో...క్షేత్రస్థాయిలో క్యాడర్ నుంచి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. క్యాడర్ కన్నా, పార్టీ కన్నా టీడీపీనే మిన్న అన్న సంకేతాలను పంపిన దత్తపుత్రుడు తీరుతో.. జనసైనికులు షాక్ అవుతున్నారట. జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా...పట్టుమని పదిమంది లీడర్లు లేరు. క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేదు. పార్టీని బలోపేతం చేయడం పై కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు. కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు, చంద్ర బాబుకి అవసరం అయినప్పుడు స్పందిస్తూ వచ్చారు పవన్‌కళ్యాణ్. బలమైన రాజకీయ నిర్మాణం లేకపోయినా...ఈ పదేళ్లు జనసేనని క్షేత్రస్థాయిలో మోస్తూ వచ్చిన వాళ్లంతా...తాము టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేయాలన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి చేసే రాజకీయానికి ఇటు క్యాడర్ నుంచి, అటు లీడర్స్ నుంచి ఎంత వరకు మద్దతు వస్తుందన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. టీడీపీకి ఈ దుస్థితి ఏమిటో? -
పవన్ నాయకత్వం వర్ధిల్లాలి..రోడ్డెక్కిన లోకేష్..
-
చీప్ లీడర్స్...చీప్ పాలిటిక్స్
-
"మిడిల్ లో మీడియేటర్" అందిన కాడికి దోచేస్తున్నాడు
-
ఓట్లు కావాలి కానీ..పార్టీ బలపడకూడదు..అందుకేనా..?
-
టీడీపీ నిమ్మల రామానాయుడు చిల్లర రాజకీయాలు..
-
అదీ సంగతి.. లోకేష్ ముందుగానే ఫిక్స్ అయిపోయారన్నమాట..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రజలలో సానుభూతి కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన తరపున ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలు కూడా అదే తరహాలో పనిచేస్తున్నాయి. ఆయన భావోద్వేగానికి గురయ్యారంటూ అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఒక ఖాళీ కుర్చీ సన్నివేశాన్ని కూడా సృష్టించినట్లు అనిపిస్తుంది. అలాగే చంద్రబాబుకు తన తల్లి, భార్య విషం పెడతారంటూ కొందరు చేసిన ఆరోపణను కూడా సింపధీ కోసమే ప్రస్తావించినట్లు కనబడుతుంది. ✍️ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి యథా ప్రకారం సైకో వ్యాఖ్యలు చేయడం, లేనిపోని ఆరోపణలు మోపడం వంటివి చేశారు. తండ్రి చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో అరెస్టు అయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దాంతో పార్టీకి ఒక దశ,దిశ లేకుండా పోయాయని, పార్టీ కార్యకర్తలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను తయారు చేసుకోవడం లో తప్పు లేదు. కాని ఆ సందర్బంలోనే ఖాళీ కుర్చీ ఉంచవలసిన అవసరం ఉంటుందా? అన్న సందేహం వస్తుంది. అది చంద్రబాబు పట్ల గౌరవంతో చేసిందే కావచ్చు. కాని కొద్ది రోజుల క్రితం ఆయన బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ పార్టీ ఆఫీస్ లో చంద్రబాబు స్థానంలో కూర్చుని అద్యక్షత వహించారన్న ప్రచారం నేపథ్యంలో ఇలా చేసి ఉండవచ్చు. ✍️ఆ తర్వాత బాలకృష్ణకు సంబంధించిన వార్తలను తెలుగుదేశం మీడియానే బహిష్కరించింది. దాంతో ఇదేదో నందమూరి, నారా కుటుంబాల మధ్య అంతరం ఏర్పడిందా అన్న చర్చకు ఆస్కారం ఏర్పడింది. ఆ తర్వాత బాలకృష్ణను సైడ్ లైన్ చేశారు. తెలంగాణ పార్టీని చూసుకోవాలని చెప్పినట్లు ఉన్నారు. దాని సంగతేమో కాని, ఆయన హాపీగా సినిమా ఫంక్షన్లలో పాల్గొని అమ్మాయిల మీద చెణుకులు విసురుతున్నారు. అది వేరే విషయం. ✍️ఇక ఈ సమావేశం విషయానికి వస్తే లోకేష్ కూడా అధ్యక్ష స్థానంలో కూర్చోకుండా జాగ్రత్తపడ్డారని టీడీపీ వర్గాలు భావించవచ్చు. కాని గతంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావుకు ఈ పాటి గౌరవం అయినా దక్కలేదే అన్న ప్రశ్న వస్తే సమాధానం దొరకదు. ఎన్.టి.ఆర్. స్థాపించిన టీడీపీని చంద్రబాబు లాక్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కిందకు తోసేశారు. ఆయన పార్టీ గుర్తు స్వాధీనం చేసుకున్నారు. చివరికి పార్టీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలోని డబ్బును కైవసం చేసుకున్నారు. పార్టీ నుంచి బయటకు పంపినట్లు ప్రకటించారు. ✍️వైస్రాయి హోటల్ వద్ద చెప్పులు వేసి మరీ అవమానించారు. పైగా అప్పట్లో చంద్రబాబే స్వయంగా ఎన్.టి.ఆర్.కు విలువలు లేవని విమర్శలు చేశారు. అంతే తప్ప, పార్టీలో గొడవలు జరిగినా ఎన్.టి.ఆరే తమ నాయకుడని ఆయన జీవించి ఉన్నంత కాలం ఏనాడు అనలేదు. ఒక ఖాళీ కుర్చీని ఆయన కోసం వదలివేయలేదు. ఎన్.టి.ఆర్. మరణించిన తర్వాత అసలు తామే ఎన్.టి.ఆర్. వారసులమని మాత్రం ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించుకున్నారు. అయినా ఆయన కోసం ఇలా ఖాళీ కుర్చీ వదలలేదు. అంటే దీని అర్ధం ఎన్.టి.ఆర్.ను ఆయన కుమారులు, అల్లుళ్లు ఎవరూ గౌరవించలేదని అనుకోవాలా? కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఖాళీ కుర్చీ సన్నివేశాలు జరిగినా, వాటి గురించి,ఆ సందర్భాల గురించి ఇక్కడ ప్రస్తావించడం సముచితంగా ఉండదు. ✍️ఇక లోకేష్ చేస్తున్న విమర్శలను పరిశీలిద్దాం. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి లు చంద్రబాబుకు విషం పెడతారని అంటారా అని కొందరు వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. నిజమే ఎవరూ అలా అనరాదు. కాని అందుకు అవకాశం ఇచ్చింది లోకేష్, ఇతర కుటుంబ సభ్యులే కదా! చంద్రబాబును జైలులోనే ఏదో చేసేస్తారని, కుట్రలు జరుగుతున్నాయని అన్నప్పుడు అందుకు సమాధానంగా .. అయ్యా.. చంద్రబాబుకు ఇంటి నుంచే ఆహారం వస్తోంది కదా? అందులో ఏమైనా చేస్తే కుటుంబం వారే చేయాలి కదా అని పేర్కొన్నారు. ఆరోపణ చేసేటప్పుడు దానికి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఆలోచించుకోకుండా చేస్తే ఇలాగే ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ✍️లోకేష్ అయితే తన తండ్రి ఆరోగ్యంపై భావోద్వేగం చెందారని ఈనాడు పత్రిక రాసిందే. మరి అంతకుముందే ఇతర టీడీపీ నేతలు అంతా బాగుందని చెప్పారే. తండ్రి ఆరోగ్యంపై అనవసర అనుమానాలు లేవనెత్తింది ఎవరు? జైలు పై దాడి జరిగే అవకాశం ఉందని కూడా ఆయన సందేహపడ్డారు. మరో వైపు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వంటివారు జైలు గోడలు బద్దలు కొట్టి అయినా చంద్రబాబును బయటకు తీసుకు రావాలిపిస్తోందని ఎందుకు అన్నారో చెప్పాలి. అప్పుడు ఎవరి మీద డౌట్లు వస్తాయి? తన తల్లిని,భార్యను అంటారా అంటూ లోకేష్ ముఖ్యమంత్రి పై మళ్లీ దారుణమైన ఆరోపణలు చేశారు. ✍️మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్‌పై నేరుగా ఆరోపణలు చేస్తున్న లోకేష్‌కు అది సైకోలాగా మాట్లాడడం అని తెలియదా? తాను ఏమైనా మాట్లాడవచ్చుకాని, ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు అమ్మో అంత మాట అంటారా అంటే కుదురుతుందా? జగన్ గతంలో జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాని, టీడీపీ నేతలు కాని ఎన్ని నీచమైన విమర్శలు చేశారో బహుశా లోకేష్‌కు తెలిసి ఉండకపోవచ్చు. అప్పట్లో ఆయన రాజకీయాలలోకి రాలేదు. అమెరికాలో చదువుకుంటూ ఎంజాయ్ చేస్తున్న రోజులవి. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు టీడీపీ సృష్టించిన వదంతులు ఎన్నో ఆనాటివారందరికి తెలుసు. ✍️అంతెందుకు రెండేళ్ల క్రితం రాజంపేట పర్యటనకు వెళ్లి చంద్రబాబు ఏమన్నారో గుర్తు లేదా! జగన్ గాలిలో వస్తాడు.. గాలిలోనే పినిష్ అవుతారని అన్నప్పడు అవి సైకో మాటలు అనిపించలేదు. ఈ సంగతులు పక్కనబెడితే లోకేష్ తెలిసి అంటున్నారో, తెలియక అంటున్నారో కాని, వ్యవస్థలను జగన్ మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో ఉంచుతున్నారని, బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి జగన్‌కు అంత శక్తి ఉంటే ఇన్నేళ్లుగా టీడీపీ నుంచి ఇన్ని సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కుంటారు? కోర్టుల్లో పదుల సంఖ్యలో లాయర్లు, అంతర్జాతీయ స్థాయి లాయర్లను ఉపయోగించి కేసు కొట్టివేయించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడితే అందుకు జగన్ కారణం ఎలా అవుతారు? ✍️కేసులో చంద్రబాబు పై వచ్చిన అభియోగాలలో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జిలు భావించడం కాదా? లోకేష్ వ్యాఖ్యలు జడ్జిలను అవమానించడం కాదా? ఈ కేసులో మిగిలినవారికి ముప్పై రోజులలో బెయిల్ వచ్చిందని, తన తండ్రికి ఎందుకు రాలేదని ఆయన అంటున్నారు. నిజమే.. వారు కేసులలో విచారణకు ఎంతో కొంత సహకరించారు. తప్పులను కొన్నిటినైనా ఒప్పుకున్నారు. చంద్రబాబు అలా చేయడం లేదు కదా? అంతదాకా ఎందుకు మాజీ పి.ఎస్.పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు అమెరికా పారిపోయింది చెప్పగలిగే పరిస్థితి లోకేష్‌కు ఉందా? పైగా 17 ఎ ఉపయోగపడితే కేసులు లేకుండా పోతాయని భావించి బెయిల్ కోసం అప్లై చేయంది టీడీపీ లాయర్ల టీమ్ కాదా? ఇవన్ని వదలిపెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఏమి ఉపయోగం? తన తండ్రి నిస్వార్దపరుడని లోకేష్ ప్రచారం చేసుకోవచ్చు. చదవండి: ఆ ప్రశ్నకు ఎందుకు సమాధానం దాటేశావ్ లోకేషా? ✍️అచ్చం పార్టీ సభ్యులు వంద రూపాయలు చొప్పున కట్టిన సొమ్మే టీడీపీ ఖాతాలో ఉందని చెప్పవచ్చు. కాని దానిని ఎంత మంది నమ్ముతారు? కనీసం టీడీపీ క్యాడర్ అయినా నమ్ముతుందా? ప్రజల కోసమే తప్ప కుటుంబం కోసం చంద్రబాబు ఆలోచించలేదని లోకేష్ చెప్పడం వినడానికి బాగానే ఉంటుంది. నిజానికి కుటుంబం గురించి పట్టించుకోవడం తప్పేమీ కాదు. కాని బిల్డప్ కోసం అబద్దాలు చెప్పడమే తప్పు. లోకేష్ అమెరికాలో చదువుకోవడానికి ఎవరి నుంచి సాయం పొందింది తెలియదా? లోకేష్ రాజకీయాలలోకి రారని గతంలో ఒక సందర్భంలో చెప్పారు. కాని కనీసం ఎమ్మెల్యే కాకుండా ఎందుకు ఎమ్మెల్సీని చేశారు? ఆ తర్వాత ఏమి అనుభవం ఉందని ఆయనను మంత్రిని చేశారు? అది కూడా మూడు శాఖల మంత్రి. ✍️అంతేకాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే మొత్తం చక్రం తిప్పిందంతా లోకేష్ కాదా? ఇప్పుడేవో కథలు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వింటారా? చంద్రబాబు మాదిరి ఎదుటివారిపై వ్యక్తిగత దూషణల ద్వారా తాను కూడా రాజకీయం చేయాలని లోకేష్ భావిస్తున్నట్లుగా ఉంది.కాని ఈ రోజులలో అది అయ్యే పనికాకపోవచ్చు. ఒకవైపు చంద్రబాబు జైలులో ఉంటే, భార్య భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉండి ఆయనకు అవసరమైన ఆహార విషయాలను జాగ్రత్తగా చూసుకుంటారనుకుంటే, ఆమె కూడా రాజకీయ యాత్ర ఎందుకు చేస్తున్నారు? ఏమిటి ఆమె లక్ష్యం? సానుభూతి రాజకీయం కాదా? ఇంకో విషయం ఏమిటంటే చంద్రబాబు పక్షాన నలభై ఐదు రోజులపాటు లోకేష్ మీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తారట. అంటే అప్పటిదాకా చంద్రబాబు జైలునుంచి బయటకు రాలేరని లోకేష్ ముందుగానే ఫిక్స్ అయిపోయారా? -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అసలు చంద్రబాబు అరెస్ట్‌కి, తిరుమలకు ఏం సంబంధం?
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు విశ్వరూపం బయటపడుతుండటంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. దీంతో టీడీపీ చేస్తున్న ప్రయత్నాలతో ఆ పార్టీకి కనీస సానుభూతి కూడా రావడంలేదు. అయినా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలను ఏమార్చడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్ శృతిమించింది. తిరుమల పవిత్రతను మంటగలిపేలా టీడీపీ శ్రేణులు ప్రవర్తించారు. ఉనికి కోసం టీడీపీ చావు తెలివితేటలు ప్రదర్శిస్తోంది. పచ్చ పార్టీ నాయకులు ఎందుకు తిరుమలను లక్ష్యంగా చేసుకొని గత పది రోజులుగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనే పేరుతో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం జెండాలతో ఫోటోలు తీసి రాజకీయం చేయాలని చూస్తున్నారు?. చివరికి స్టీలు గ్లాసులతో తెలుగుదేశం పార్టీ మోత మోగించు అనే నిరసన కార్యక్రమాన్ని కూడా తిరుమలలో చేయాలని చూడడం ఏవగింపు కలిగిస్తుంది. ఈ విషయంపై హైందవులు, తిరుమల శ్రీవారి భక్తులు తెలుగుదేశం పార్టీ వైఖరిని చీదరించుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన చంద్రబాబుకి మద్దతుగా గత పది రోజులుగా ఏదో ఒక విధంగా తెలుగుదేశం జెండాను చూపిస్తూ ఫోటోలు దిగి సామాజిక ఉద్యమాల్లో సర్కులేట్ చేయడం ద్వారానో లేక తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న నిరసనలతో తిరుమలలో వివాదాస్పదం చేసి, అధికార పక్షాన్ని ఇరకాటంలోకి పెట్టాలని శతవిధాల తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహాన్ని హైందవ సంఘాలు, తిరుమల శ్రీవారి భక్తులు తిప్పి కొట్టడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. చివరికి టీడీపీ నిర్వహిస్తున్న మోతు మోగిద్దాం నిరసన కార్యక్రమానికి మద్దతుగా సీహెచ్ భగవాన్, రామ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఏకంగా విజయవాడ నుంచి తిరుమలకు వచ్చి స్టీల్ గ్లాసులతో చప్పుడు చేస్తూ మొబైల్ ద్వారా వీడియో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుకున్నారు. టీడీపీ ఎంత నీచానికి ఒడిగట్టిందో ఈ విషయంతోనే అర్థమవుతుంది. ఇదే విధంగా 2009 ఎన్నికల సమయంలో కూడా తెలుగు తమ్ముళ్లు ఇదే అత్యుత్సాహం ప్రదర్శించి చతికిల పడిన విషయం మర్చిపోతున్నారు. చదవండి: నోటీసుల్లో లోకేష్‌కు సీఐడీ ఏం చెప్పిందంటే..? -
అయ్యా పవనూ.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శవ రాజకీయానికి తెరలేపారు. మొన్నటికి మొన్న వలంటీర్ వ్యవస్థపై విషాన్ని కక్కిన పవన్.. ఇప్పుడు విశాఖలో హత్యకు గురైన వృద్ధురాలి కుటుంబాన్ని పరామర్శించిన వంకతో శవ రాజకీయాలు మొదలు పెట్టారు. వరలక్ష్మీ అనే వృద్ధురాలిని వాలంటీర్ చంపేశాడంటూ అసత్య ప్రచారం చేస్తున్న పవన్.. రాజకీయ లబ్ది కోసం ఇప్పుడు ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం చూసి అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసమే పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కుత్తుకలు కోసే దండుపాళ్యం బ్యాచ్’ అంటూ వాలంటీర్లను అభివర్ణించడం.. పవన్‌లో నిండుకుపోయిన విషానికి నిదర్శనమంటున్నారు. కాగా వరలక్ష్మిని చంపడానికి వారం రోజులు ముందే వెంకటేష్ అనే యువకున్ని వాలంటీర్‌గా తొలగించారు. విధులు సరిగా నిర్వహించడం లేదని జులై మూడో తేదీన వెంకటేట్‌పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జులై 24వ తేదీన వెంకటేష్ వాలంటీరుగా తొలగించారు. వాలంటీరుగా తొలగించిన తరువాత వరలక్ష్మికి చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సర్వర్‌గా వెంకటేష్ చేరాడు. ఈ క్రమంలో జులై 30వ తేదీ అర్ధరాత్రి నగల కోసం వరలక్ష్మిని వెంకటేశ్ హత్య చేశాడు. అయితే రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్ హత్య చేశాడంటూ పవన్ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ వల్ల 30 వేల మహిళలు అదృశ్యం అయ్యారని పవన్ దుష్ప్రచారం చేశారు. ఇంట్లో పని చేసే వ్యక్తి చంపేస్తే వలంటీర్ చంపేశారంటూ పవన్ విష ప్రచారం చేశారు. ఎంత చంద్రబాబు డైరెక్ట్ చేయించినా.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? అని పవన్ తీరును ప్రశ్నిస్తున్నారు పలువురు. వ్యవస్థలో ఒకరో, ఇద్దరో చేసిన తప్పుకు మొత్తం అందరిపై నిందలు వేయడం, విషం జిమ్మడం సరికాదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను సంఘ విద్రోహశక్తులుగా చిత్రీకరించడం సరికాదని, చుట్టున్న ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్నామని అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్నది పూర్తిగా దుష్ప్రచారమని, ఇటీవల కేంద్రం కూడా పార్లమెంటులో ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రకటన చేసిందని గుర్తు చేస్తున్నారు, చదవండి: బాలికపై చిరుత దాడి ఘటన.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అత్యవసర సమావేశం -
మళ్ళీ అవే చీప్ ట్రిక్స్
-
భీమిలిలో జనసేన చీప్ పాలిటిక్స్
-
అక్కడ ఆటలు సాగవని అర్థమైంది.. అందుకే గ్లాస్లో మునకేశాడా?
స్థిరత్వం లేని కొందరు రాజకీయ నేతలు గాలివాటుకు ప్రయాణం చేస్తుంటారు. ప్రతి ఎన్నికలకు ఒక్కో పార్టీ చొప్పున మారుతుంటారు. అలాగే నియోజకవర్గాలూ మారుతుంటారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రజలను మోసం చేసి అక్కడి నుంచి మరోచోటుకు వెళుతుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అలాంటి నాయకుడొకరు తయారయ్యారు. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా ఆ నాయకుడిలో మార్పు రాలేదు. ఆయనో మాజీ ఎమ్మెల్యే. పద్నాలుగేళ్ల రాజకీయ జీవితం. రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఐదు పార్టీలు మారారు. చాలా నియోజకవర్గాలూ మారారు. పార్టీ మారడం అనేది పెద్ద సమస్య కాదు. కాని స్థిరత్వం ఉండదని, గాలివాటుకు పోతుంటారని, ఏ పార్టీలో ఉన్నా, అవినీతి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ముద్ర వేసుకున్నారు. ప్రజలు చీదరింపులు ఎదుర్కొంటున్నారు. ఆయనే పంచకర్ల రమేష్‌బాబు. విశాఖలో షిప్పింగ్ కాంట్రాక్టులు చేసే రమేష్‌బాబు ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేసి, చిరంజీవి పేరుతో పెందుర్తి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, ప్రజలకు సేవ చేస్తాడని నమ్మారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినపుడు ఆయన కూడా హస్తం గూటికి చేరారు. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. పెందుర్తిలో చేసిందేమీలేక, అక్కడి ప్రజలకు మొఖం చూపించలేక యలమంచిలి టిక్కెట్ తీసుకుని సైకిల్ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. యలమంచిలి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నీరు, చెట్టు, చెరువు, మట్టి, కొండ అన్న తేడా లేకుండా అక్కడి ప్రకృతి సంపద అంతా దోచుకున్నారు. చదవండి: పవన్ ‘బ్రో’ సీన్‌పై మంత్రి అంబటి రియాక్షన్ దోపీడి కోసమే రాజకీయాల్లోకి వచ్చిన పంచకర్ల రమేష్‌బాబును 2019 ఎన్నికల్లో జనం చిత్తుగా ఓడించారు. రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనిపించడంతో జగన్మోహన్రెడ్డి పాలన చూసి తాను మారానంటూ వైఎస్సార్సీపీలో చేరారు. అధికార పార్టీని అడ్డుగా పెట్టుకుని దోపిడీ కొనసాగించవచ్చని భావించారు. ఫార్మా సిటీ, అరకులో భూముల కబ్జాకు సిద్ధమయ్యారు. రమేష్ బాగోతం తెలిసిన వైఎస్సార్సీపీ నాయకత్వం ఆయన్ను కట్టడి చేసింది. దీంతో ఇక్కడ తన ఆటలు సాగవని అర్థమై.. పవన్ కళ్యాణ్ జనసేన పంచన చేరారు. అనేక పార్టీలు, పలు నియోజకవర్గాలు మారిన రమేష్‌బాబును చూసి జనం ఈసడించుకుంటున్నారు. రమేష్‌ను నమ్మి గతంలో ఆయన వెంట తిరిగిన కార్యకర్తలు చాలామంది ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారు. ఒకరిద్దరు మాత్రం భూకబ్జాలు, అక్రమ మట్టి తవ్వకాలతో ఆర్థికంగా బలపడ్డారు. చదవండి: ‘వావీ వరసలు లేని.. నారాయణ.. నారాయణ’ ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు పంచకర్ల లాంటి నాయకులకు ఉత్తరాంధ్రలో చోటు ఇవ్వరాదని భావిస్తున్నారు. ఇటీవల పెందుర్తిలో ఆత్మీయ సమావేశం పేరిట పంచకర్ల కొందరు సన్నిహితుల్ని పిలవగా వారంతా ముఖం చాటేసారు. దోపిడీయే లక్ష్యంగా పార్టీలు, నియోజకవర్గాలు మారే రమేష్‌ను చూసి ఏ పార్టీ కార్యకర్తలు వస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. గ్లాస్ పార్టీ తరపున ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
టిడిపి డర్టీ పాలిటిక్స్
-
బాలుడి హత్యపై బాబు నీచ రాజకీయం..
సాక్షి, ప్రతినిధి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నీచ రాజకీయ చరిత్రలో మరో పేజీ ఇది. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా రాజకీయానికి వాడుకొనే ఆయన.. బాపట్ల జిల్లాలో జరిగిన బాలుడి హత్యనూ అందుకే వాడుకొన్నారు. రాజకీయాలకు, కులాలకు ఏమాత్రం సంబంధంలేని హత్యకు రాజకీయ రంగు పులిమారు. రెండు కుటుంబాల మధ్య వివాదాన్ని కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. బాధలో ఉన్న కుటుంబానికి సాంత్వన కలిగించేలా ప్రవర్తించాల్సిన ఆయన.. అందుకు భిన్నంగా వ్యవహరించారు. మాజీ సీఎం అయి ఉండీ,.. వారిని మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించడం అందరినీ విస్మయపరిచింది. ఘటన జరిగిన వెంటనే తన పార్టీ శ్రేణులతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. సోమవారం తానే ఆ గ్రామానికి వచ్చి పరామర్శ పేరుతో నీచ రాజకీయానికి తెరలేపారు. మృతుని సోదరికి ప్రభుత్వ ఉద్యోగం రెండు రోజుల క్రితం బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే పోలీసులను రంగంలోకి దింపింది. గంటల వ్యవధిలోనే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నాలుగో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారికి కఠిన శిక్షలు పడేలా పోలీసు అధికారులు ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. అదే రోజు సమాచారం తెలిసిన వెంటనే రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు ఆ గ్రామానికి వెళ్లారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. తక్షణ సాయం కింద లక్ష రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ సాయం బాధిత కుటుంబానికి అందకుండా అడ్డుపడ్డారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి తీసుకువచ్చే సమయంలోనూ టీడీపీ నాయకులు అడ్డుకుని రాజకీయం చేశారు. మృతదేహంతో నడిరోడ్డుపై భైఠాయించారు. మరుసటి రోజే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, ఎంపీ మోపిదేవి ఆ కుటుంబం వద్దకు వెళ్లి రూ. 10 లక్షల చెక్కు అందించారు. వారికి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు, ప్రస్తుతం వారు ఉంటున్న చోట ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుని సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి ఆ కుటుంబం కూడా అంగీకరించింది. ప్రస్తుతం సోదరి ఇంటర్మీడియట్ చదువుతుండటంతో అంగన్వాడీ ఆయా పోస్టు ఇస్తామని చెప్పారు. ఈమేరకు ప్రభుత్వం ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఒకవేళ చదువుకుంటానంటే చదువు పూర్తి అయిన తర్వాత దానికి తగ్గ ఉద్యోగం ఇస్తామని చెప్పినట్లు మృతుని సోదరి మీడియా ముందు చెప్పింది. తొలిరోజు జరిగిన ఘటనల్లో తమ తప్పు ఉంటే మన్నించాలని కూడా ఆ కుటుంబం కోరింది. కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదమన్నది సుస్పష్టం. ప్రభుత్వమూ వెంటనే స్పందించిన విషయమూ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా ప్రతి ఘటననూ రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనే చంద్రబాబు.. ఈ విషాదాన్ని కూడా అదే విధంగా కలుషితం చేసే ప్రయత్నం చేశారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. దీంతో టీడీపీ శ్రేణులు బాధిత కుటుంబం చుట్టూ చేరి, ప్రభుత్వ చర్యలను అడ్డుకోవడం ప్రారంభించాయి. ఆదివారం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌తో కూడా బాబు ఇదే అంశంపై మాట్లాడించారు. సోమవారం ఆయనే స్వయంగా పరామర్శ పేరుతో గ్రామానికి వచ్చారు. పూర్తిగా రాజకీయమే చేశారు. పోలీసులు ఆలస్యంగా స్పందించారంటూ నిందలు వేశారు. బీసీ బిడ్డకు అన్యాయం జరిగిందంటూ కుల ప్రస్తావన చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించారు. వాస్తవానికి ఈ ఘటనలో నలుగురు నిందితుల్లో ముగ్గురు ఒక సామాజిక వర్గానికి చెందిన వారైతే, నాలుగో వ్యక్తి మృతుని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఈ హత్యతో రాజకీయాలకు, కులాలకు సంబంధం లేదు. అక్కని వేధించడంపై నిలదీశాడని కక్ష పెంచుకుని వారు హత్య చేశారు. అయినా చంద్రబాబు ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. సీఎం ఇంట్లో ఆడబిడ్డలు లేరా, వారికీ ఇలా జరిగితే.. వైసీపీ ఎంపీ, మంత్రుల ఇంట్లో వాళ్లకు ఇలా జరిగితే ఊరుకుంటారా.. అంటూ నోటికొచి్చనట్లు మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆయా ఉద్యోగం చేసుకుంటావా, నీ తమ్ముడిని చంపిన వారిపై పగ తీర్చుకుంటావా అంటూ మృతుని సోదరిని రెచ్చగొట్టారు. ఇలా ఆయన గ్రామంలో ఉన్నంతసేపూ రెచ్చగొట్టేలా వ్యవహరించారు. గతంలో పల్నాడులో జరిగిన హత్య, ఇతర ఘటనలపైనా ఇదే విధంగా నీచ రాజకీయానికి ఒడిగట్టారు. ఇప్పుడూ అలానే వ్యవహరించి, తన సహజ లక్షణాన్ని బయటపెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: నేడు ‘జగనన్న ఆణిముత్యాలు’కు సత్కారం -
విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ పైనా చంద్రబాబు రాజకీయం
-
చంద్రబాబు కొత్త ట్రిక్కు.. ఆ భయంతోనేనా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటనే చేశారు. ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ జరిపి చర్య తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎంత గొప్పగా సెలవిచ్చారు!. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఏపీ పర్యటనలో ఆరోపణలు చేశారు కనుక వెంటనే విచారణ జరపాలని ఆయన అంటున్నారు. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని ఒక నానుడి ఉంది. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ఉద్దేశించి అలా అనకూడదేమోకాని, అనక తప్పని పరిస్థితిని ఆయన తెచ్చుకున్నారు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే, చంద్రబాబు వాటిని ఎటిఎం మాదిరి వాడుకుని అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. అయినా ఇంతవరకు విచారణే జరగలేదు. పోలవరం నిర్వాసితుల భూముల కుంభకోణం కాని, ప్రాజెక్టు కాంట్రాక్టుల మార్పులో వచ్చిన ఆరోపణపై కానివ్వండి.. సీబీఐ విచారణ చేయాలని ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోరితే ఇంతవరకు కేంద్రం పట్టించుకోలేదు. అది చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ అని అనుకోవాలా? దీని కంటే ముఖ్యమైనది స్వయంగా ఆయన పీఎస్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి 2 వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని అధికారిక ప్రకటన చేశారు. ఇది జరిగి అప్పుడే నాలుగేళ్లు అయింది. అయినా ఇంతవరకు ఆ ఫైల్ కదలలేదు. వైసీపీ ప్రభుత్వం అమరావతి లాండ్ స్కామ్ గురించికాని, స్కిల్ డెవలప్మెంట్ నిధుల స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్ వంటివాటిలో చంద్రబాబుపై కేసులు పెట్టింది. అంతేకాక వాటిపై సీబిఐతో విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదని రాష్ట్రం తెలిపింది. అయినా కేంద్రంలో ఉలుకులేదు.. పలుకు లేదు. అది చంద్రబాబు ఆర్ట్ అని అనుకోవాలి. అదే టైమ్ లో ఈ స్కామ్ లలో జగన్ ప్రభుత్వం విచారణ చేపట్టరాదని తెలుగుదేశం నేతలు హైకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. చివరికి సుప్రింకోర్టు వరకు వెళ్లి పోరాడి కొంత మేర విచారణకు ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇన్ని కథలు ఇక్కడ పెండింగులో ఉన్నాయి కదా! చంద్రబాబు నాయుడు ఏమని కోరాలి? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినట్లు చెబుతున్న ఏ స్కామ్ పైన అయినా విచారణ చేసుకోవచ్చని ధైర్యంగా ఎన్నడైనా చెప్పారా? పోనీ జగన్ సర్కార్ అయితే రాజకీయ లక్ష్యంతో దర్యాప్తు జరిపించే అవకాశం ఉందని అనుకుంటే ఆయనే స్వయంగా సీబిఐకో, లేక కేంద్ర హోం శాఖ కో, లేక ప్రధాన మంత్రికో లేఖ రాసి ఉండవచ్చు కదా! అప్పుడు ఆయన పేరు దేశం అంతటా మారుమోగేది కదా! ఆ పని చేయకపోగా, ఏ ఒక్క కేసు ముందుకు కదలకుండా ఎన్నో బ్రేకులు ఎందుకు వేస్తున్నారు. పైగా తన ప్రభుత్వంలోని అవినీతి పై విచారణ చేస్తే అది కక్ష అని చంద్రబాబు ఎందుకు ప్రచారం చేస్తున్నారు. అమరావతి లాండ్ స్కామ్‌లో అలైన్ మెంట్ మార్పులో క్విడ్ ప్రో కింద లింగమనేని రమేష్ నుంచి భవనాన్ని చంద్రబాబు ఉత్తపుణ్యానికి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. మరి దానిపై ఇంతవరకు సవివరమైన వివరణ ఎందుకు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఆ ఇంటిని ప్రభుత్వం జప్తు చేయాలని సంకల్పించింది. అలాగే తన వద్ద మంత్రిగా పనిచేసిన నారాయణ తన బినామీలతో ఎన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసింది సీఐడీ ఆధార సహితంగా చూపిస్తోంది కదా! దానిని అవినీతి అంటారా? అనరా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలే బయటకు వస్తాయి. కాకపోతే కుప్పం పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. చదవండి: అమిత్ షా, జేపీ నడ్డా మాటల్లో నిజమెంత? చంద్రబాబు తనకు ఎన్ని మచ్చలు ఉన్నా వాటిని ఎవరూ చూడరులే అనుకున్నట్లుగా మాట్లాడితే జనం అమాయకులా! బీజేపీ పెద్దలు జగన్ ప్రభుత్వంపై ఎక్కడైనా నిర్దిష్ట ఆరోపణలు చేశారా?లేదే. సాధారణంగా అన్ని వ్యతిరేక పక్షాల మీద చేసినట్లే విమర్శలు చేసి వెళ్లిపోయారు. ఫలానా ప్రాజెక్టులో అవినీతి అని కాని, ఫలానా స్కీమ్‌లో అవినీతి కాని ఒక్కటైనా చెప్పారా?లేదే!. ముఖ్యమంత్రి జగన్ పేదలకు ఇంతవరకు రెండులక్షల పది వేల కోట్ల మేర ఆర్దిక సాయం అందిస్తే, అందులో ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా పంపిణీ చేస్తున్నది వాస్తవం కాదా!. చంద్రబాబు టైమ్‌లో ఇసుక మాఫియా ఎలా విజృంభించింది అందరికి తెలుసు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను ఎలా హింసించింది గుర్తుకు తెచ్చుకుంటేనే ప్రజలకు వళ్లు మండుతుంది. అయినా వాటన్నిటిని జనం మర్చిపోయి ఉంటారులే అనుకునో, లేక యథాప్రకారం తన స్వభావానికి అనుగుణంగా ఈ స్టేట్ మెంట్ ఇచ్చారో తెలియదు కాని, అది చంద్రబాబుకే బూమ్ రాంగ్ అవుతుందన్న సంగతి గుర్తించాలి. ఒకవేళ నిజంగానే ఈ ప్రభుత్వంలో ఏవైనా అక్రమాలు జరిగాయని భావిస్తే, అవేమిటో చెప్పి విచారణ కోరాలి కాని, గుడ్డకాల్చి ముఖాన పడవేసినట్లు వ్యవహరిస్తే సరిపోతుందా?. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ నేతగా ఉన్న సోము వీర్రాజు ఒక ఆరోపణ చేసేవారు. ఆనాటి ప్రభుత్వ పెద్దలు, టీడీపీవారు కలిసి చెట్టు-నీరు నిధులు కాని, మరుగుదొడ్ల నిర్మాణానికి వెచ్చించాల్సిన కేంద్ర నిధులు కాని పదమూడువేల కోట్లు తినేశారని చెప్పేవారు. అంత స్పష్టంగా ఆయన ఆరోపణలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం రాయిమాదిరి మౌనంగా ఉందే తప్ప ఎన్నడైనా స్పందించిందా! ఇప్పుడు మాత్రం ప్రభుత్వంపై విచారణ చేయాలట. ఏదో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ బానిస పత్రికలకు హెడ్‌లైన్స్ ఇవ్వడానికి ఈ డిమాండ్ చేసినట్లు కనిపిస్తుంది తప్ప ఇంకొకటి కాదు. చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో! చంద్రబాబులో కనీస విజ్ఞత ఉన్నా, ఆయనకు ధైర్యం ఉన్నా తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌ల విచారణకు సిద్దమని చెప్పి లేఖ రాసి, ఆ తర్వాత ఈ ప్రభుత్వంపై ఏదైనా ఆరోపణ చేస్తే కొంతైనా అర్ధం ఉంటుంది తప్ప, లేకుంటే ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ విశ్వాసంలోకి తీసుకోరు. ఇంకో సంగతి చెప్పాలి. లక్ష మెజార్టీ సాధించాలన్న నినాదంతో చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారట. గత స్థానిక ఎన్నికలలో టీడీపీ కుప్పంలో దారుణంగా పరాజయం చెందిన నేపథ్యంలో తనకు అపజయం ఎదురుకాకుడదన్న భయంతో ఇదేదో కొత్త ట్రిక్కు ప్రయోగిస్తున్నట్లుగా ఉంది. టీడీపీ పత్రికలోనే వచ్చిన ఒక విషయం ప్రకారం స్థానిక ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఇళ్లకే పరిమితమైన టీడీపీ క్యాడర్ అనండి.. స్థానిక నేతలనండి.. వారిని కలిసి ఆత్మస్థైర్యం నింపడానికి చంద్రబాబు యత్నిస్తున్నారట. దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. ఇప్పటికే కుప్పంలో టీడీపీ క్యాడర్ కాడి పారేసిందనిపించడం లేదా! ఆ కష్టాల నుంచి బయటపడడానికి చంద్రబాబు ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు కుప్పంలో కష్ట పడుతున్నారు. లక్ష మెజార్టీ సంగతి దేముడెరుగు.. ముందు తనను గెలిపిస్తే చాలు అన్న విధంగా చంద్రబాబు యాత్ర జరుగుతోందన్న భావన కలగడం లేదా!. ఇదిలా ఉంటే చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఏదో అడ్డుపడుతోందన్న మరో అబద్దపు ఆరోపణ. నాకు తెలిసింది ఏమిటంటే ఇంతవరకు చంద్రబాబు తరపున లాండ్ కన్వర్షన్ కే దరఖాస్తు చేయలేదట. అది అయిన తర్వాత హౌస్ ప్లాన్‌కు అనుమతి వస్తుంది. ఇంత సీనియర్ నేతకు ఈ విషయం తెలియదా! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
హైడ్రామా.. నానా యాగీ.. టీడీపీ నేతల శవ రాజకీయం
ఒంగోలు అర్బన్: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తెలుగుదేశం పార్టీని బతికించుకునేందుకు ఆ పార్టీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవను అడ్డుపెట్టుకుని.. నిస్సిగ్గుగా శవ రాజకీయాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలో సవలం సుధాకర్ భార్య హనుమాయమ్మ(48) అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన సవలం కొండలరావు(బుజ్జి) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. కొన్నేళ్లుగా వీరి మధ్య భూ తగాదా ఉంది. అతను వచ్చినప్పుడల్లా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో హనుమాయమ్మ సోమవారం తన ఇంటి ముందు కూర్చుని ఉండగా.. కొండలరావు తన ట్రాక్టర్ నాగేలు అడ్డతో ఆమెను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె కింద పడటంతో వెనుక టైరుతో తొక్కించాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న టీడీపీ నేతలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి.. హనుమాయమ్మ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఒంగోలు జీజీహెచ్ వద్ద మంగళవారం హైడ్రామా నడిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ హడావుడి చేశారు. పాత కక్షలు, కుటుంబ తగాదాలతోనే సదరు మహిళను హత్య చేశారని ఆ గ్రామ ప్రజలంతా స్పష్టంగా చెబుతున్నా, రాజకీయ రంగు పులుముతూ ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై, పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. చదవండి: నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు ఆందోళన చేస్తున్న వారి వద్దకు స్వయంగా వచ్చిన ఆర్డీవో, టంగుటూరు తహశీల్దార్లు.. మానవతా దృక్పథంతో వీలైనంత మేర ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయినా టీడీపీ నేతలు వినిపించుకోకుండా నానా యాగీ చేశారు. టీడీపీ నేతల వైఖరిని కళ్లారా చూసిన వారంతా.. ఇదేం రాజకీయం అంటూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా, మహిళ మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం పూర్తయింది. మృతురాలి భర్త తన అన్న భార్యపై కూడా అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తూ.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు నీచమైన కుట్రలు
-
ఛీ..ఛీ..బాబు సభకు రూ.150
-
విశాఖలోని సీత కొండ వ్యూ పాయింట్ కు వైఎస్సార్ పేరు
-
దివాళాకోరు రాజకీయం అంటే ఇదే!. పవన్ అప్పుడు ఏం చేశారు?
మచిలీపట్నం వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం నాడు చేసిన ప్రసంగం పూర్తిగా డొల్లతనంతో వైరుద్ధ్యాల పుట్టగా సాగిపోయింది. 10 ఏళ్ల పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం వెగటు కలిగించే ఓ ప్రహసనం. ఈ పదేళ్లలో తను చేసిన పొరపాట్లు ఏమిటో, తన వైఫల్యాలకు కారణాలేమిటో కనీసమాత్రంగా కూడా చెప్పకపోగా ఓట్లు వేయనందుకు ప్రజల్ని తప్పు పట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 2014లో ‘జనసేన’ను స్థాపించి బేషరతుగా బీజేపీ, తెలుగుదేశంతో కలిసి ప్రచారం చేసి, ఆ పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దోహదపడ్డారు పవన్. 2018 మార్చి 14న ఆ రెండు పార్టీలకు ‘రాం రాం’ పలికి వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు కుదుర్చుకొని ఎన్ని కలకు వెళ్లారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వైఫల్యా లనూ, నారా లోకేష్ పాల్పడిన అవినీతినీ ప్రతి సభలో ఎండ గట్టారు. అయితే, ప్రజలు పవన్ కల్యాణ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే పోటీ చేసిన రెండుచోట్లా అవమానకరమైన రీతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో అనేక వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఆ వర్గాలు వైఎస్సార్సీపీకి చేరువై, వైఎస్ జగన్మోహన్రెడ్డికి పట్టం గట్టారు. ఈ నాలుగేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజ కీయంగా బలపడ్డాయి. దీంతో, వెనుకబడిన వర్గాలు, కాపులు తిరిగి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే పరిస్థితులు లేక పోవడంతో, కాపులను వైఎస్సార్సీపీ నుంచి వేరు చేసి వారిని తెలుగుదేశం పార్టీ వైపు నడిపించడం అనే వ్యూహంతో గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలోనే, కులాలను కలుపుతానంటూ పవన్ ఓ చిత్రమైన పల్లవిని వినిపిస్తున్నారు. కులాలను కలపడం ఏమిటి? కొన్ని కొన్ని ప్రాంతాలతో రాజకీయ పరంగానో, సామాజిక పరంగానో కొన్ని కులాల మధ్య అపోహలు ఏర్పడటం సహజం. కానీ, అవి తాత్కాలికంగానే ఉంటాయి తప్ప కులపరంగా ప్రజలు విడిపోయి ఘర్షణలు పడే పరిస్థితి ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి పరిస్థితి ఇప్పుడే కాదు గత 2 దశాబ్దాలు పైబడి ఎన్నడూ లేదు. పాలకులు అన్ని కులాల్నీ సమానంగా ఆదరించినపుడు కులాల మధ్య అంతరాలు ఏర్పడవు. జగన్ పాలనలో ‘కులాల కుంపట్లు’ లేనే లేవు. ఇది ఒక వర్గం మీడియా కావాలని చేస్తున్న దుష్ప్రచారం. కాపులు, బలిజలు తను ఎంత చెబితే అంత అన్నట్లుగా పవన్ కల్యాణ్ భావించడం విడ్డూరం. కాపులు, బలిజల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేశారు? చిరంజీవి ప్రజారాజ్యంపై కుల ముద్ర వేసిందెవరు? చిరంజీవి, అల్లు అరవింద్‌లు పార్టీ టిక్కెట్లు అమ్ముకొంటూ వేల కోట్లు సంపాదించారన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజారాజ్యం విజయావకాశాలను దెబ్బతీసిన పార్టీతో, వ్యక్తులతో పవన్ కల్యాణ్ అంటకాగితే కాపులు, బలిజలు హర్షిస్తారా? కులాల్ని కలపాలంటే ముందుగా ఎవరైతే తమది గొప్ప కులమని, తమ బ్లడ్ ప్రత్యేకమైనదంటూ నోరు జారారో... వారిచేత మిగతా కులాలకు క్షమాపణలు చెప్పించగలగాలి. అందరిలో ప్రవహించేది ఒకటే రక్తం అని వారికి గడ్డి పెట్టాలి. ఎన్టీ రామారావు గానీ, డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ తెలుగునాట కుల రాజకీయాలు చేయలేదు. వారికి కులం రంగు పులమాలని అప్పట్లో కొందరు ప్రయత్నించినా, తమ ఉన్నత వ్యక్తిత్వాలతో, అన్ని వర్గాల ప్రజల పట్ల సమాదరణతో వారు కులాలకు అతీతంగా ఉన్నతమైన నాయ కులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ కోవలోనే నేడు వైఎస్ జగన్ తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. చట్టసభల గడప ముఖం తెలియని అనేక బడుగు వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇందువల్ల, భవిష్యత్తులో ఆయన గెలుపు నల్లేరు మీద బండి ప్రయాణంలా సాగిపోతుందని గ్రహించినవారు.. తెలివిగా పవన్‌ను ముందుకు నెట్టి కులాల మధ్య కుంపట్లు రాజేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే తన గెలుపు కూడా కష్టం అని 2019 ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠంతో పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జత కట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ కారణంగానే తమ పార్టీని విస్తరించడం లేదు. సీనియర్ నేతలెవరైనా వచ్చి తమ పార్టీలో చేరతారేమోననే అనుమానంతో తనకు నచ్చిన ఓ నాయకుడికి నంబర్ 2 స్థానం కల్పించి ముందు పెట్టుకున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు టిక్కెట్లు ఇవ్వకపోయినా, వారి నుంచి పెద్దగా ప్రతిఘటన రాదు కనుక ఓ 15–20 సీట్ల మేరకు ఎన్నికల పొత్తుల్లో భాగంగా తీసుకొంటే సరి పోతుందనే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తన వ్యూహాల్ని, ప్రణాళికలను, ఎత్తుగడల్ని ప్రజలు అర్థం చేసుకొని ఎక్కడ తనను నలుగురిలో ఎండగడతారేమోననే అనుమానంతో.. ‘అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓట్లు చీల నివ్వను’ అంటూ ఓ సరికొత్త నేరేటివ్‌ను గత కొంత కాలంగా విన్పిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఓటమి చెందిన చంద్రబాబు ఈ నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ తను చేసిన తప్పుల్ని ఒప్పుకోలేదు. కించపరిచిన బీసీలు, ఎస్సీలను క్షమాపణ కోరలేదు. కాపునేత ముద్రగడ పద్మనాభాన్నీ, ఆయన కుటుంబ సభ్యులనూ అవమానించిన తీరుకు బాధనూ వ్యక్తం చేయలేదు. తమ పాలనలో రైతులకూ, వెనుకబడిన వర్గాలకూ అన్యాయం జరిగిందని ఒప్పుకోలేదు. అయినప్పటికీ.. పవన్‌కు తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే, పవన్ కల్యాణ్ మర్మం తెలియని చేగొండి హరిరామ జోగయ్య వంటి కాపు కుల ప్రముఖులు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలనీ, చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లాలనీ తమ మనసులోని మాటగా చెబుతున్నారు. కానీ, ఇప్పటికే పవన్–చంద్రబాబుల మధ్య ఎంఓయూలు కుదిరిపోయాయన్న నిజాన్ని వారు ఎప్పటికి గ్రహిస్తారు?! సినిమాలకు, రాజకీయాలకు గల తేడాను గ్రహించకుండా రాజకీయాలలో సైతం సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడానికి పరిమితం అయ్యారు పవన్. తనకు కులం, మతం, ప్రాంతం లేదంటారు. మరోవైపు కులాల ప్రస్తావన తీసుకువస్తారు. పైగా, ఆయనకు డబ్బు మీద మోజు లేదట. డబ్బు అవసరం లేదట. రోజుకు 2 కోట్లు సంపాదిస్తానని చెప్తారు. ఇంకోవైపు నెలనెలా ఈఎంఐలు కడుతున్నట్లు చెప్పారు. ఈ వైరుద్ధ్యాలు ఏమిటో ఎవరికీ అర్థం కాదు. పవన్ కల్యాణ్‌కు పెద్దగా చదువు లేదు. కానీ పుస్తకాలు బాగా చదివాననీ, ఎంతో విజ్ఞానవంతుణ్ణనీ చెప్పుకుంటారు. రాజకీయాల్లో రాణించడానికి చదువే ప్రామాణికం కాదు. కామన్సెన్స్ ముఖ్యం. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమని పవన్ చేసే హితబోధలో హేతుబద్ధత కనిపిస్తుందా? ఏ ఒక్క కులం కూడా సమూహంగా ఆలోచించదు. సమూహంగా వ్యవహరించదు. అందుకు కాపు కులస్థులు మినహాయింపేమీ కాదు. ప్రజలు తమ తమ స్థానిక స్థితిగతులను అనుసరించి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంలో నిర్ణయాలు తీసుకొంటారు. ఎవరైతే మంచి పరిపాలన అందిస్తారో వారిలో ప్రజలు కులాన్ని చూడరు. ఇది చరిత్ర చెప్పే సత్యం. పవన్ కల్యాణ్‌కు ఈ వాస్తవాలు ఎవరు చెబుతారు? ప్రజలు స్థిరమైన వ్యక్తిత్వం లేనివారిని, ఎప్పటికప్పుడు మాటలు మార్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. అందువల్ల పవన్ కల్యాణ్ గంపగుత్తగా కాపుల్నీ, బలిజల్నీ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం వేరొక పార్టీకి బదలాయించాలని చేసే ప్రయత్నాలు విఫలం కాకతప్పదు. పవన్ కల్యాణ్ చేసే దివాళాకోరు కుల రాజకీయాల్ని ఏ వర్గమూ హర్షించదు, సహించదు. సి. రామచంద్రయ్య, వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
బిగ్ క్వశ్చన్ : కరకట్ట బాబు, కల్యాణ్ బాబు కుతంత్రాలు
-
చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం?
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిష్యత్తు గురించి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం వర్గాలకు ఆందోళన కలిగించేవి. ఇంతకాలం లేస్తే మనిషిని కానట్లుగా డబాయిస్తూ రాజకీయం చేసేవారు. కానీ ఈసారి ఆయన బేలగా, తాను అసెంబ్లీకి వెళ్లాలంటే టీడీపీని అధికారంలోకి తేవాలని అన్నారు. అక్కడితో ఆగలేదు. వచ్చేసారి అధికారం రాకపోతే రాజకీయాలలో ఉండలేనని కూడా ఆయన కడుపు చించేసుకున్నారు. దీని అర్థం ఏమిటి? చదవండి: అబద్ధాలపై పేటెంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. 2024 శాసనసభ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించకపోతే జెండా పీకేయడమే అన్న అర్థం కూడా వస్తుంది. ఆయన ఆ మాట అనలేదు కాని, వచ్చేసారి ఎన్నికలలో గెలుస్తాం అని ధీమాగా చెప్పలేకపోయారు. ఇది సహజంగానే తెలుగుదేశం వర్గాలకు ఇబ్బంది కలిగించే అంశమే. తమ పార్టీ విజయావకాశాలపై వారికే నమ్మకం సడలుతుంది. జనంతో బాబు ఆటలు ఇంతకాలం చంద్రబాబు మేకపోతు గాంభీర్యంతో అయినా మాట్లాడేవారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన దానిని కూడా వదిలేశారు. ఆయన కావాలని అన్నారో, లేక తన మనసులో మాట అనుకోకుండా బయటకు వచ్చేసిందో కాని, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రం మంచి పాయింట్ అందించారు. దాంతో చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయిందని, వచ్చే ఎన్నికలలో గెలవలేనని ఆయనే చెబుతున్నారని, ఈ నేపథ్యంలో పలు అబద్దాలతో పాటు సానుభూతి డ్రామాలు ఆడుతున్నారని ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మధ్యలో తన భార్య ప్రస్తావన తేవడం, జరగని అవమానాన్ని జరిగినట్లుగా మళ్లీ పిక్చర్ ఇవ్వడం, వచ్చేసారి గెలవకపోతే రాజకీయాలలో ఉండలేనని అనడం.. అంతా సానుభూతి కోసమే అన్న విశ్లేషణలు వస్తున్నాయి. డామిట్.. నాడు కథ అడ్డం తిరిగింది.! గతంలో అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేస్తేనే రాని సానుభూతి, ఇప్పడు ఆఖరి చాన్స్ అంటే వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాపం తెలుగుదేశం మీడియాకు చెందిన ఒకరు దానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు తనకు ఆఖరి చాన్స్ ఇవ్వాలని అనలేదని, ఆయన వ్యాఖ్యలకు అర్ధం ప్రజలకు చివరి చాన్స్ ఇవ్వడం అని చెబితే అందరూ దానిపై వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సాధారణంగా వయసు మళ్లీనవారు తమ నియోజకవర్గాలలో తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నప్పుడు ఇలాంటి ప్రచారం చేస్తుంటారు. ఈ ఒక్కసారికి గెలిపిస్తే, తాను ఇక ఎన్నికలలో పోటీ చేయబోనని వారు చెబుతుంటారు. ఆ ఎన్నిక ముగియగానే మళ్లీ మామూలే. ఆ వ్యక్తి గెలిస్తే ఐదేళ్ల తర్వాత యథాప్రకారం ఈ సారి ఖాయంగా తప్పుకుంటానని, ప్రజల కోరిక మేరకు పోటీ చేస్తున్నానని అంటుంటారు. చివరికి ఓటమి ఎదురయ్యేదాక వారు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. చంద్రబాబు కూడా అలాగే ఆఖరి చాన్స్ అనడం ద్వారా ప్రత్యర్ధులకు మంచి పాయింట్ అందించినట్లయింది. చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడమేనని, అందుకే భయంతో ఇలా మాట్లాడారని వారు పేర్కొటున్నారు. ఒక్క ఛాన్స్ ఎందుకివ్వాలి? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. దీనిపై కూడా పలు వ్యాఖ్యానాలు వచ్చాయి. టీడీపీతో కలవడంపై వెనుకాడే పరిస్థితి ఏర్పడిందని, అందుకే తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేతలు ఆ విషయాన్ని నిర్థారిస్తూ, టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని, జనసేనతో కలిసే బీజేపీ వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తుందని వారు స్పష్టం చేశారు. దాంతో పవన్ కల్యాణ్ ఊబిలో పడ్డయిట్లయింది. పవన్ ఒక్క ఛాన్స్ అనడంతో చంద్రబాబు దిక్కుతోచని పరిస్థితిలో తనకు ఆఖరు చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. కానీ ఎక్కడా తాను ఏపీకి ఇంత మంచి చేశాను.. ఇంకా ఫలానా మంచి పనులు చేస్తానని చెప్పడం లేదు. పైగా ఇంత కాలం జగన్ అమలు చేసిన సంక్షేమ స్కీములను విమర్శిస్తూ మాట్లాడిన చంద్రబాబు, పవన్‌లు ఇప్పుడు మాటను పూర్తిగా మార్చి తాము ఇంకా ఎక్కువ సంక్షేమం ఇస్తామని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. కర్నూలులో మాట మడత ఏపీలో మూడు రాజధానుల వివాదం టీడీపీని ఒక కుదుపు కుదుపుతోంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలని, చంద్రబాబు అందుకు అడ్డుపడుతున్నారని న్యాయ వాదులు విమర్శిస్తున్నారు. వారు ప్రత్యక్షంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. దీనిని ఎదుర్కోవడం టీడీపీకి ఒక పెద్ద సమస్యగా ఉంది. అందుకే చంద్రబాబు ఇంకో మాట చెబుతున్నారు. తనకు అధికారం ఇస్తే, ఐదేళ్లు పాలించి, ఆ తర్వాత పగ్గాలను వేరే వారికి అప్పగిస్తానని చెప్పారు. అంతే తప్ప తన కుమారుడు లోకేష్‌కు వారసత్వం ఇస్తానని చెప్పలేకపోయారు. లోకేష్ గురించి ప్రమోట్ చేస్తే అసలుకే మోసం వస్తుందేమోనన్న అనుమానం చంద్రబాబులో ఉండవచ్చు. లేక కొడుకు లోకేష్ సామర్థ్యం గురించి పూర్తి అవగాహన ఉండడంతో అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉండవచ్చు. ఒక సారి వెనక్కి చూడు బాబు.! రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదు. గత 70 ఏళ్లలో చంద్రబాబు కన్నా పలువురు సమర్ధులు ఏపీని పాలించారు. వారి ఆధ్వర్యంలోనే ప్రకాశం బారేజీ, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు వచ్చాయి. వారెవరూ తాము లేకపోతే ఆంధ్రులు బతకలేరని చెప్పలేదు. కానీ చంద్రబాబు మాత్రం అంతా తనతోనే ఉందని భ్రమపడుతూ ప్రజలను భ్రమ పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. వర్తమాన సమాజంలో ఎప్పటికప్పుడు కొత్త నేతలు పుట్టుకొస్తారు. కానీ చంద్రబాబు మాత్రం తను అధికారంలోకి రాలేకపోతే ఏదో నష్టం జరుగుతుందని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. సీఎం జగన్ పాలనపై బురద జల్లేందుకు కష్టపడుతున్న చంద్రబాబు చివరికి ఆయన స్కీములనే అమలు చేస్తామని చెప్పే పరిస్థితిలో పడ్డారు. తద్వారా జగన్ సమర్థ పాలకుడని చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు. ఎవరి మ్యానిఫెస్టో మాయమయింది? చంద్రబాబు గత శాసనసభ సమావేశాలకు వెళ్లలేదు. అంతమాత్రాన శాసనసభ ఆగిపోలేదు. ప్రభుత్వం నడుస్తూనే ఉంది. జగన్ తాను చేస్తానని చెప్పిన పథకాలను అమలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అన్ని ఎన్నికలలో చిత్తుగా ఓడించారు. దాంతో చంద్రబాబులో భయం పట్టుకుని చివరి మాటగా ఆఖరి అవకాశం అన్న పదాన్ని ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఓటమి చెందితే ఆయనకు అవి చివరి ఎన్నికలు అవ్వచ్చేమోకాని ప్రజలకు కాదు. ఎందుకంటే ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతూనే ఉంటారు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్ మాత్రం వచ్చే ఎన్నికలలో గెలిస్తే 30 ఏళ్లు తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే మాటను ప్రజలకు చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే.. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా పని చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతీ మాటను, మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రతీ వాగ్ధానాన్ని అమలు చేసి నిజంగానే ప్రజలపై చెరగని ముద్ర వేశారు. చంద్రబాబు పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. 2014కు ముందు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని పూర్తిగా నెరవేర్చని చంద్రబాబు.. ఏకంగా తమ మ్యానిఫెస్టోనే పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసింది. ఇప్పుడు ఆఖరు అవకాశం అనడం ద్వారా చంద్రబాబు ఆత్మ రక్షణలో పడితే 175 సీట్లకు, 175 గెలుస్తామని చెప్పడం ద్వారా జగన్ అఫెన్స్ గేమ్ ఆడి తన క్యాడర్లో ఆత్మ విశ్వాసం పెంచుతున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అబద్ధాలపై పేటెంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఒక రికార్డు ఉంది. దేశంలోనే మరే నేత అంతలా అబద్దాలు ఆడలేరన్నది ఆయన రికార్డుగా చాలామంది చెబుతుంటారు. ఆయన విశిష్టత ఏమిటంటే ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్న అబద్దాన్ని అలవోకగా చెప్పడం. దానిని ప్రజలు నమ్మాలన్న ఉద్దేశంతో పదే, పదే వల్లె వేస్తుండడం. తనకు తాను గొప్పగా ఊహించుకోవడమే కాకుండా ప్రజలంతా అలాగే ఫీల్ అవుతున్నారని ఆయన భావిస్తుంటారు. అంటే తాను భ్రమపడి, ప్రజలు కూడా అదే విధంగా భ్రమపడుతున్నారని నమ్ముతుంటారు. చదవండి: ఆ మీటింగ్ తర్వాత పవన్‌లో నీరసమెందుకు? గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇరవైమూడు స్థానాలకే పరిమితం అయిపోయినా, అది తన తప్పుల వల్ల కాదని, ప్రజలే తప్పు చేశారని ఆయన అనుకుంటారు. తాజాగా కర్నూలు జిల్లాలో చేసిన పర్యటనలో ఎన్ని అబద్దాలు చెప్పారో పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తాను ఫిట్ గా ఉన్నానని చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వయసు రీత్యా ఆయన ఎలా ఉన్నా అసత్యాలు బొంకడంలో మాత్రం ఫిట్‌గా ఉన్నానని పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. చంద్రబాబు చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు, వాటిలోని అబద్దాలు ఏమిటో చూద్దాం. ►బాబు అబద్దం-1 నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరూ నన్ను అవమానించే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో నన్ను, నా సతీమణిని అవమానించారు ►అసలు వాస్తవం చంద్రబాబును ఆయన సొంత మామ ఎన్టీ రామారావే దారుణంగా అవమానిస్తూ వీడియోనే విడుదల చేశారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి ఆయనను చంద్రబాబు అవమానిస్తే, తన అల్లుడు నీచమైన వ్యక్తి అని, ఔరంగజేబు కంటే ఘోరమైన వ్యక్తి అని పలురకాలుగా ఎన్టీఆర్ దూషించారు. ఇక తాజా అంశానికి వస్తే.. ఈ టరమ్‌లో చంద్రబాబును, ఆయన భార్యను ఎవరూ అసెంబ్లీలో అవమానించలేదు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఒక ఎమ్మెల్యే కుటుంబాన్ని టీడీపీ నేతలు అవమానిస్తే, దానికి బదులుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిని అసెంబ్లీలో వైసీపీకి ఆపాదించి చంద్రబాబు బయటకు వెళ్లారు. అసెంబ్లీలో కానీ, ఈ ఆరోపణ చేసిన వెంటనే కాని ఆయన రోదించలేదు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిన నాలుగు గంటల తర్వాత కెమెరాల ముందు మీడియా సమక్షంలో రోదించినట్లు వ్యవహరించి అభాసుపాలయ్యారు. తన రాజకీయం కోసం భార్యను కూడా రోడ్డుకు ఎక్కించారన్న విమర్శకు గురి అయ్యారు. దీనివల్ల సానుభూతి రావాలన్నది ఆయన ఆశ. ►బాబు అబద్దం-2 రాష్ట్రంలో లక్షల రేషన్ కార్డులు తొలగించారు.. పేదవాళ్ల పొట్టగొట్డడంలో జగన్మోహాన్రెడ్డి దిట్ట ►అసలు వాస్తవం ఏపీలో లక్షల రేషన్ కార్డులు తొలగించింది లేదు. పేదవాళ్ల పొట్టగొట్టింది లేదు. పేదలకోసం అనేక స్కీమ్‌లను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తుంటే ఆయన ఎలా పొట్ట గొట్టినట్లు అవుతుందో చంద్రబాబు చెప్పకుండా తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. బురద జల్లడం, ఆ తర్వాత మీరే కడుక్కోమని చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ►బాబు అబద్దం-3 నేను అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎత్తివేస్తానని ప్రచారం చేస్తున్నారు. నేను ఇంతకన్నా మెరుగైన సంక్షేమ పథకాలను ఇస్తా ►అసలు వాస్తవం గత మూడున్నర ఏళ్లుగా ఏపీలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తీవ్రంగా విమర్శించి, పేదలకు ఆర్థిక సాయం చేయడాన్ని పంచడంగా ప్రచారం చేసి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తప్పు పట్టిన చంద్రబాబు, తెలుగుదేశం మీడియా వారు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. తాను ఇంకా మెరుగైన సంక్షేమ స్కీములు ఇస్తానని చెబుతున్నారే తప్ప అవేమిటో చెప్పలేకపోతున్నారు. ►బాబు అబద్దం-4 పవన్ కల్యాణ్ సభకు స్థలం ఇచ్చారని ఇప్పటంలో ఇళ్లు పడగొట్టారు ►అసలు వాస్తవం రోడ్డు వెడల్పు చేయడానికి ఆక్రమణలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను వెనక్కి తీసుకుంటే అక్రమం అంటున్నారు. అసలు అక్కడ ఇళ్లే పడగొట్టలేదు. ప్రహరి గోడలు తొలగిస్తే ఇళ్లను పడగొట్టినట్లు ప్రచారం చేస్తున్నారు ►బాబు అబద్దం-5 పవన్ కల్యాణ్ విశాఖ వెళితే పెద్ద సీన్ చేశారు ►అసలు వాస్తవం జనసేన కార్యకర్తలు కొందరు విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి చేస్తే, వారిని అదుపులోకి తీసుకున్నారు. పవన్ కల్యాణ్ పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ కూడా నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. అసలు విషయాలు చెప్పకుండా జనసేన వారిని అరెస్టు చేశారని, పవన్ కార్యక్రమం తనంతట మానుకుంటే దానిని వైసీపీకి చంద్రబాబు అంటగడుతున్నారు. ►బాబు అబద్దం-6 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన డ్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శం అని ప్రధాని మోదీ విశాఖలో అన్నారు ►అసలు వాస్తవం ప్రధాని మోదీ ఎక్కడా చంద్రబాబు పేరే ఎత్తలేదు. పైగా డ్వాక్రా సంఘాలు కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవి. ►బాబు అబద్దం-7 ఏపీకి నేను అధికారంలో ఉన్నప్పుడు 16లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చా. వాటిలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాం ►అసలు వాస్తవం చంద్రబాబు టైమ్‌లో వచ్చిందే ఏభై వేల కోట్ల లోపు పెట్టుబడులు. నిజంగా ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే అవి ఎక్కడెక్కడ ఇచ్చారో చెప్పాలిగా. విశాఖ పారిశ్రామిక సదస్సుల పేరుతో బోగస్ ఒప్పందాలు చేసుకుని ప్రజలను మోసం చేసే యత్నం చేశారు. ►బాబు అబద్దం-8 రాజకీయాలలో నీతి, నిజాయితీకి మారుపేరు విజయభాస్కరరెడ్డి ►అసలు వాస్తవం విజయభాస్కరరెడ్డికి నిజాయితీ పరుడు అన్న పేరు ఉన్న మాట నిజమే. కానీ చంద్రబాబు మాత్రం కోట్ల ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో దారుణమైన అవినీతి ఆరోపణలు చేసేవారు. ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణలపై కోట్ల భగ్గుమన్నారు. పాణ్యం ఉప ఎన్నిక ప్రచారంలో, కర్నూలు లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలను కోట్ల కుమారుడు సూర్యప్రకాశరెడ్డి, కోడలు సుజాత మర్చి పోయి ఉండవచ్చు కానీ ప్రజలు మర్చిపోతారా! ఇలా రకరకాల అసత్యాలను వల్లె వేస్తూ చంద్రబాబు ప్రచారం సాగిస్తున్నారు. వీటిని జనం నమ్మకపోవచ్చు. అది వేరే విషయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సీనియర్ నాయకుడిగా తన బాధ్యత అని ఆయన అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఏ రకంగా అపహాస్యం పాలైంది అందరికి తెలుసు. తన పార్టీని గెలిపించకపోతే తాను అసెంబ్లీకి వెళ్లలేనని ఆయన వాపోతున్నారు. ఇది ఆయన అసలు బాధ. జగన్‌కు పాలన చేతకాదని చెబుతున్న ఆయన ఈ మూడున్నర ఏళ్లలో రాష్ట్రంలో జగన్ తీసుకువచ్చిన కొత్త వ్యవస్థలు, అమలు చేసిన స్కీములను మాత్రం విమర్శించలేకపోతున్నారు. పైగా తాను జగన్‌ను మించి సంక్షేమ స్కీములు అందిస్తానని అన్నారు. దీనిని బట్టే జగన్ పాలనను ఆయన కూడా తనకు తెలియకుండా అభినందించినట్లయింది. ఈ మూడు సంవత్సరాలలో జరిగిన అన్ని ఎన్నికలలో టీడీపీ దారుణంగా ఓడిపోయిన సంగతిని మర్చిపోయినట్లు నటిస్తూ అధికారం వచ్చేస్తుందని టీడీపీ వారిని మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అబద్దాలపై పేటెంట్ హక్కు ఒక్క చంద్రబాబుకే ఉంటుందేమో! -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మహిళలపై కర్కశంగా కంకర పోశారు..
శ్రీకాకుళం: మండలంలోని హరిపురంలో స్థల వివాదం ముదిరి సోమవారం ఇద్దరు మహిళలపై కంకర(గులకరాళ్లతో కూడిన మట్టి) పోసే వరకూ వెళ్లింది. రామారావు, ప్రకాశరావు, ఆనందరావులతో సమీప బంధువులైన కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలకు ఓ ఇంటి స్థలం విషయమై ఎప్పటి నుంచో వివాదం ఉంది. వీరి మధ్య ఊరి పెద్దలు కూడా రాజీ కుదర్చలేకపోయారు. హరిపురంలో స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో ఎవరికి వారే పట్టుదలకు పోయారు. ఈ తరుణంలో సోమవారం వివాదం మరింత ముదిరింది. రామారావు, ఆనందరావు, ప్రకాశరావులు ట్రాక్టర్లతో వివాద స్థలంలో కంకర వేస్తుండగా.. దాలమ్మ, సావిత్రి అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ల వెనుక ఉన్న వీరిద్దరిపై అమాంతం మట్టిని కుమ్మరించేశారు. నడుంలోతు వరకు కూరుకపోవడంతో వారు పెద్దగా రోదించారు. వీరి కేకలు విన్న చుట్టు పక్కల వారు పారలతో కంకరను తీసి మహిళలను బయటకు లాగారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. కుటుంబాల మధ్య గొడవను వైఎస్సార్సీపీకి అంటగట్టిన లోకేష్.. రెండు కుటుంబాల మధ్య నడుస్తున్న వివాదమిది. టీడీపీ హయాంలో కూడా ఇది కొనసాగింది. 2017, 2019లో ఆ ప్రభుత్వం హయాంలోనే బాధిత మహిళలు నిరాహార దీక్షలు చేశారు. అప్పుడు అధికారులు, గ్రామ పెద్దలు కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. అయినా గొడవలు ఆగలేదు. కోర్టు వరకు చేరింది. ప్రస్తుతం కోర్టులో ఈ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య కొనసాగుతున్న గొడవల్లో భాగంగా ఒక వర్గం వారు మరో వర్గంపై మట్టిపోశారు. కానీ దీనిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. వ్యక్తుల మధ్య జరిగిన గొడవను వైఎస్సార్సీపీకి అంటగడుతోంది. ముఖ్యంగా పార్టీ నాయకుడు నారా లోకేష్ ట్వీట్లతో పార్టీల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ గొడవకు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం ఏమిటని స్థానికులు అనుకుంటున్నా.. లోకేష్ మాత్రం ముఖ్యమంత్రి జగన్‌కు లింకు పెట్టి ట్వీట్లతో రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ బందోబస్తు నిమిత్తం విశాఖలో ఉండడంతో కేసు తీవ్రత దృష్ట్యా, వజ్రపుకొత్తూరు ఎస్ఐ మధు, కాశీబుగ్గ సీఐ శంకరావులు హుటాహుటీన అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు ఇంతలా స్పందించినా లోకేష్ తప్పుడు ట్వీట్లు చేయడం హాస్యాస్పందంగా ఉంది. ఎక్కడ వివాదం జరుగుతుందా.. ఎక్కడ గొడవ జరుగుతుందా.. దాన్ని వైఎస్సార్సీపీకి అంటగడదామనే ఆరాటంతో లోకేష్ తాపత్రయ పడుతున్నారు. ప్రతీది రాజకీయం చేసి వైఎస్సార్సీపీపై నెట్టి పార్టీ పరంగా లబ్ధి పొందడానికి ప్రయతి్నస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్నీవదులుకోకూడదన్న లక్ష్యంతో లోకేష్ పనిచేస్తున్నట్టుగా తాజా ఘటనపై స్పందించిన తీరు స్పష్టం చేస్తుంది. -
పాతవారికే ‘కొత్త’ కలరింగ్!.. కళా వారి రాజకీయ మాయా కళ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పైఫొటోలో రౌండప్ చేసిన వ్యక్తి పేరు కూనబిల్లి దామోదరరావు. ఈయన లావేరు మండలం కొత్త కుంకాం మాజీ సర్పంచ్. టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆరు నెలల కిందట టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొత్త కుంకాంలో నిర్వహించిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో ఊరంతా తిరిగారు. టీడీపీ కరపత్రాలు కూడా గ్రామస్తులకు పంచిపెట్టారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేదికపైన కూర్చొన్నారు. ఆయన పక్కనే నిల్చొని కలిశెట్టి అప్పలనాయుడు ప్రసంగం కూడా చేశారు. ఇప్పుడు అదే వ్యక్తికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు సోమవారం సాయంత్రం టీడీపీ కండువా వేసి ఆయనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారని ప్రచారం చేశారు. ఆ ఫొటోను మీడియాకు, సామాజిక మాధ్యమాలకు వదిలారు. దీంతో చూసిన వారంతా అవాక్కయ్యారు. టీడీపీ నాయకుడు వైఎస్సార్సీపీ నుంచి చేరడమేంటని అంతా ఆశ్చర్యపోయారు. మిగతా రాజకీయ పక్షాలకు చెందిన వారిని పక్కన పెడితే సాక్షాత్తు టీడీపీకి చెందిన వారే తప్పు పడుతున్నారు. మన పార్టీ నాయకుడికి కండువా వేసి, మన పారీ్టలోకి చేరడమేంటని కళా వెంకటరావు తీరుపై పెదవి విరుస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు కండువాలు వేసి, వారంతా వైఎస్సార్సీపీ వారని చెప్పడం సిగ్గుగా లేదా అని ఆక్షేపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులున్న వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో ఓ రేంజ్లో కళాను కడిగేస్తున్నారు. ... ఇలా చేయడం కళా వెంకటరావుకు కొత్తేమీ కాదు. అధిష్టానం వద్ద తన బలం పెరిగిందని చెప్పుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఏప్రిల్‌లో లావేరు మండలం పట్నాయునిపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలను రణస్థలం మండలం వీఎన్‌పురానికి తీసుకొచ్చి టీడీపీ కండువాలు చేసి, వారంతా వైఎస్సార్సీపీకి చెందిన వారని ఫొటోలు తీసి మీడియాకు వదిలారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ కండువాలు వేసి చేరికలేమిటని సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లే నివ్వెరపోయారు. సెప్టెంబర్‌లో కూడా ఇదే తరహా డ్రామా వేశా రు. పాలఖండ్యాం పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన 25 వైఎస్సార్సీపీ కుటుంబాలు టీడీపీలో చేరినట్టుగా, వారందరికీ కండువాలు వేసి ఫొటోకు ఫోజులిచ్చి మీడియాకు ఇచ్చారు. కానీ, వాస్తవానికి వారంతా మెట్టవలస గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరులు. వాస్తవం తెలుసుకున్న జనం ఛీకొట్టారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి.. చేరారని చూపించిన వారిలో ఒక్కరైనా వైఎస్సార్సీపీ కార్యకర్త ఉన్నారని నిరూపించాలంటూ సవాల్ విసిరారు. దానికి కళా వెంకటరావు తోక ముడిచి సైలెంట్ అయిపోయారు. చీప్ పాలిట్రిక్స్.. కళా వెంకటరావు ఇలా వింత పోకడకు దిగుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తనకు బలం లేకపోయినప్పటికీ, ఉన్న కేడర్‌ను తనను పట్టించుకోన ప్పటికీ తనకు పట్టు ఉందని, తన వెంట కేడర్ ఉందని చెప్పుకోవడానికి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. కళా వైభవం పోయిందని, ఆయనకంత సీన్ లేదని కార్యకర్తలు సైతం తేలికగా తీసుకుని పట్టించుకోవడం మానేశారు. ఆయనకు ప్రత్యామ్నాయమైన కలిశెట్టి అప్పలనాయుడును తమ నాయకుడిగా గుర్తిస్తున్నారే తప్ప కళా వెంకటరావును ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పెళ్లి ఇతరత్రా శుభ కార్యక్రమాల ఆహా్వనం కోసం వచ్చిన వారితో ఫొటోలు తీసుకుని, వారు కూడా తన బలగమని చెప్పుకునే స్థాయికి కళా దిగజారిపోయారు. చావు పరామర్శకు వెళ్లి, అక్కడ టీడీపీ వాళ్లకే కండువాలు వేసి వైఎస్సార్సీపీ నుంచి చేరినట్టుగా చిత్రీకరించిన సందర్భం కూడా ఉంది. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్ అయింది కూడా. చదవండి: భావనపాడు కలపై.. అచ్చెన్న కుయుక్తులు! -
టీడీపీ శవ రాజకీయం.. తాము బతికే ఉన్నామంటూ ప్రేమజంట వీడియో.. చివరికి అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారలేమి.. ప్రజల మద్దతు లేకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఎలాగైనా అధికారపార్టీ వైఎస్సార్సీపీపై నిందలుమోపి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని నానాయాగీ చేస్తున్నారు. ఇలాంటిదే శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. ఆరు రోజుల క్రితం కేవీబీపురం మండలంలో దొరికిన ఓ మహిళ మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని శవరాజకీయాలకు తెరలేపారు. చదవండి: వామ్మో చినబాబు.. ఫ్రస్టేషన్ ఎక్కువైపోయింది..! ఎప్పుడో జనవరిలో ఊరు విడిచివెళ్లిన ఓ ప్రేమికురాలిదే ఆ శవమంటూ రాద్ధాంతం సృష్టించారు. ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తిట్ల దండకం అందుకున్నారు. వరుసగా ఆందోళనలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో ఆదివారం తాము బతికే ఉన్నామంటూ సదరు ప్రేమజంట వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టీడీపీ అసలు రంగు బయటపడింది. కావాలనే పనిగట్టుకుని రాద్ధాంతం చేసినట్టు తేటతెల్లమైంది. టీడీపీ మరింత అభాసుపాలైంది. బతికి ఉన్న వాళ్లను కూడా చంపేశారంటూ ఒక శవాన్ని తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి టీడీపీ, జనసేన నాయకులు ఆందోళనకు దిగి, ఘోరమైన రీతిలో అభాసుపాలయ్యారు. ఈ సంఘటన శ్రీకాళహస్తిలో కలకలంరేపుతోంది. అసలేం జరిగిందంటే స్థానికుల కథనం మేరకు, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలంలోని రామాపురానికి చెందిన బత్తెమ్మ అలియాస్ లలితను తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు గ్రామానికి చెందిన ఠాగూర్బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరు శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె చంద్రిత అమ్మమ్మ గ్రామమైన రామాపురానికి అప్పుడప్పుడూ వెళ్లి వచ్చేది. రామాపురం అరుంధతివాడకు చెందిన చంద్రశేఖర్ (గ్రామ వలంటీర్)తో పరిచయమేర్పడింది. ఇతనికి ఇదివరకే పెళ్లై ఒక బిడ్డకూడా ఉన్నాడు. 2021లో చంద్రశేఖర్, చంద్రిత గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదు రోజుల్లోనే ఆ జంటను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించిన రోజునే చంద్రశేఖర్‌ను వలంటీర్ ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే చంద్రితను వారి బంధువుల గ్రామమైన దొరవారి సత్రంలో ఉంచారు. అక్కడే మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. నిశ్చితార్థం అయిన కొద్ది రోజులకు ఆ యువకుడు చంద్రితకు సెల్‌ఫోన్ తీసి ఇచ్చాడు. దీంతో ఆ సెల్‌ఫోన్ ద్వారా ప్రియుడు చంద్రశేఖర్‌కు అప్పుడప్పుడూ ఫోన్ చేసేది. 2022 జనవరి 11న మళ్లీ ఊరు విడిచి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన రోజు మళ్లీ పోలీసులకు ఇరువురు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. ఈ నెల 20న కేవీబీపురం మండల పరిధిలోని తెలుగుగంగకాలువలో ఓ యువతి మృతదేహం లభించింది. ఆ మృతదేహం చంద్రితదే అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేశారు. ఆ యువతిని వైఎస్సార్సీపీ వారే హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని ప్రచారం చేశారు. అందులో భాగంగా టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి అండ్‌కో చంద్రిత తల్లిదండ్రులను ప్రలోభపెట్టి రాజకీయాలకు వాడుకున్నారు. దీంతో టీడీపీ ప్రలోభాలకు లొంగిన చంద్రిత తల్లిదండ్రులు వైఎస్సార్సీపీపై నిందలు వేశారు. వారం రోజులుగా ఈ శవరాజకీయాలతో ఉద్రిక్త వాతావరణానికి తెరలేపారు. ఇదే అదనుగా ఎల్లో మీడియా కూడా రెచ్చిపోయింది. అయితే పోలీసులు పుట్టుమచ్చలు చెప్పమని కోరగా, వారు చెప్పిన పుట్టుమచ్చలకు మృతదేహానికి ఉండే పుట్టుమచ్చలకు పొంతన లేకపోవడంతో డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. నేను బతికే ఉన్నా ఈ తంతు ఇలా సాగుతుండగా, వెళ్లిపోయిన ప్రేమ జంట తమను ఎవరూ చంపలేదని, తాము బతికే ఉన్నామంటూ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయ్యింది. తొందరలోనే గ్రామానికి చేరుకుంటామని వారు వీడియో ద్వారా తెలిపారు. దీంతో వాస్తవాలు తెలుసుకోకుండా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న టీడీపీ, జనసేన నాయకులు తెల్లమొహం వేసుకుని అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. టీడీపీ నాటకానికి తెరపడింది గత వారం రోజులుగా టీడీపీ నాయకులు ఆడుతున్న నాటకానికి తెరపడిందని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నియోజకవర్గ ఇన్చార్జి గాదిపాకుల కిరణ్ అన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ప్రజాదరణ మెండుగా ఉండడంతో, బొజ్జల సు«దీర్‌రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారన్నారు. అయితే కాలువలో దొరికిన యువతి శవం ఎవరిదో, అందులో టీడీపీ పాత్ర ఏమిటో పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని తేల్చాలని అన్నారు. వారం రోజులుగా వైఎస్సార్ సీపీపై చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ధర్మం గెలిచింది చంద్రిత తల్లిదండ్రులకు రూ.5లక్షలు ఇచ్చి ప్రలోభపెట్టానని బొజ్జల సుదీర్‌రెడ్డి ఆరోపించారు. అయితే చంద్రిత బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు తల్లిదండ్రుల చేత చెప్పించడం అత్యంత దుర్మార్గం. రెండు రోజులు ముందు టీడీపీ నేత సంపత్ ఆత్మహత్య చేసుకుంటే, వైఎస్సార్సీపీ నాయకులే చంపేశారంటూ ప్రచారం చేశారు. అయితే పోలీసులు వెంటనే స్పందించి అతని చావుకు కారణమైన వారిని అరెస్టు చేశారు. అయినా ఆగకుండా యాదవ సంఘంతో సంప్రదించి ఆదివారం ఉదయం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. స్కిట్ కళాశాల పతనానికి టీడీపీ కారణమైతే మూసేశారంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరికి ధర్మం గెలిచింది. ఇప్పటికైనా టీడీపీ నాయకులు ప్రజల సమస్యలపై పోరాడాలి. – అంజూరు తారక శ్రీనివాసులు, చైర్మన్, శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి -
గన్ షాట్ : కరకట్టలో కల్యాణం
-
అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్ కల్యాణ్‌కు అర్థమవుతుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి రాజకీయం చేస్తున్నారో ఆయన పార్టీ వారికే అర్థం కాదు. పార్టీ క్యాడర్‌కు కాకపోతే, ఆయనకైనా అర్థం అవుతుందా అన్న అనుమానం వస్తుంటుంది. కాకపోతే ఒక సినీ నటుడు కనుక, ఆయన ఏమి మాట్లాడినా మీడియా కవరేజి వస్తుంటుంది. అదే ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ అని చెప్పాలి. దానికి తోడు టీడీపీ మీడియా ఆయనకు అండగా ఉంటుంది. వారం, పది రోజులకోసారి ఆయన ఏదో ఒక విషయంపై స్పందిస్తుంటారు. దానిపై వైసీపీ మంత్రులు, నేతలు రియాక్ట్ అవుతుంటారు. ఆ రకంగా ఆయన రాజకీయంగా జనంలో ఉన్నట్లు సంతృప్తి చెందవచ్చు. అంతకు మించి ఆయన చేస్తున్న ట్వీట్లకు గాని, అప్పడప్పుడు మంగళగిరి వెళ్లి చేసే ప్రసంగాలకు కాని పెద్ద విలువ ఉండడం లేదు. చదవండి: ఈ మూడేళ్లలో ఎన్నడైనా ఆ విషయాలను పవన్ చెప్పారా? ఆయన తన సొంత ఆలోచనలతో ఇవేవి చేయకపోవడం వల్లే ఈ దుస్థితిలో ఉన్నారని అనుకోవచ్చు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు చూడండి.. విశాఖలో గర్జన సభను విమర్శిస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ అసలు ఆ విషయంలో విశాఖపట్నాన్ని ఎందుకు రాజధానిగా వద్దనుకుంటున్నది మాత్రం ఆయన వివరించినట్లు కనిపించలేదు. కేవలం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై ఎప్పటిమాదిరి చేసే రొడ్డకొట్టుడు విమర్శలు తప్ప సృజనాత్మక, నిర్మాణాత్మకత, కొత్తదనం కొరవడ్డాయి. దేనికి గర్జనలు? మూడు రాజధానులతో అభివృద్ది జరుగుతుందా? ఒక హైకోర్టు, కొన్ని ఆఫీస్‌లు ఆయా చోట్ల పెడితే అభివృద్దా అని ఆయన ప్రశ్నించారు. ఇది ఆయనకు వచ్చిన సందేహమో,లేక ఎవరైనా అడగమంటే అడిగారో తెలియదు. కాని ఇదే పవన్ కల్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం అన్ని ఆఫీస్ లు ఒక్క అమరావతిలోనే ఎందుకు పెడతారని ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా?. ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ‘మద్య నిషేధం’ ద్వారా ఏటా రూ.22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? ‘మద్య నిషేధ’ ఆదాయం హామీగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చినందుకా?. రుషి కొండను విధ్వంసం చేసి భవనం నిర్మిస్తున్నందుకా? మత్సకారులు వలసలు వెళుతున్నందుకా? దసపల్లా భూములను కొల్లగొడుతున్నందుకా.. అంటూ ఏవేవో ట్వీట్లు పెట్టారు. వీటిలో ఎదైనా ఒక్కటైనా కొత్త విషయం ఉందా? రోజూ తెలుగుదేశం పార్టీవారు చేస్తున్న విమర్శలనే ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం మీడియా ముఖ్యంగా ఈనాడు రోజూ రాసే ఏడుపుగొట్టు వార్తల ఆధారంగానే ఈ ట్వీట్లు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. మూడు రాజధానులతో రాష్ట్రం ఎందుకు అధోగతి పాలవుతుందో వివరించాలి కదా? అది నిజమే అయితే గతంలో ఆయనే కర్నూలు వెళ్లి, విశాఖ వెళ్లి అవి రాజధానులు కావాలని ఎందుకు అన్నారు?. అసెంబ్లీలో ప్రభుత్వ భూమి ముప్పై వేల ఎకరాలు ఉండాలన్న జగన్ వ్యాఖ్యలను ఎందుకు వక్రీకరిస్తున్నారు? అయినా విశాఖపట్నం రాజధాని అంటే గొప్ప సంగతి అవుతుందా? లేక అమరావతిలోని నాలుగు పల్లెటూళ్లు రాజధాని అంటే గొప్ప విషయం అవుతుందా? అసలు ఎందుకు విశాఖను వ్యతిరేకిస్తున్నది వారికైనా తెలుసా? ఎమ్మెల్యేలు, ఎంపీల బలం ఉంటే అది రాజకీయంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. రాష్ట్రానికి ఆర్థిక బలం చేకూరడానికి అనేక ఇతర ప్యాక్టర్లు పనిచేస్తాయి. రెండేళ్ల పాటు కరోనా సమస్యను ఎదుర్కున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపలేదు. స్కూళ్లు బాగు చేయడం ఆగలేదు. ఆస్పత్రులను మెరుగుపర్చడం నిలపలేదు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటును ఆపేయలేదు. సుమారు ముప్పైపైగా స్కీంలను ఈ ప్రభుత్వం అమలు చేసిన విషయం పవన్ కల్యాణ్‌కు తెలియకపోతే రాజకీయంగా ఆయన జ్ఞానం అలా ఉందని అనుకోవాలి. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కొద్ది రోజుల క్రితం ఉన్నవి, లేనివి కలిపి అప్పులపై ఒక సోది ప్రకటన చేశారు. దానిని ఖండిస్తూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక పెద్ద ప్రకటనే విడుదల చేశారు. నిత్యం అసత్యాలతో జనాన్ని ప్రభావితం చేయడానికి తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా పనిచేస్తున్నాయి. వారికి కొనసాగింపుగానే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు తప్ప ఒక్కటి కూడా అర్ధవంతంగా లేదు. నిజంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అప్పులు చేయవలసిన అవసరం లేదని పవన్ కల్యాణ్ భావిస్తే, అందుకు ఆధార సహితంగా ప్రకటన చేసి ఉండవచ్చు. మధ్య నిషేధంపై ఆయన విమర్శ చేయవచ్చు. కాని తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పగలరా? మత్స్యకారులు గుజరాత్ తదితర రాష్ట్రాల తీర ప్రాంతాలకు వలస వెళ్లడం ఇప్పుడే కొత్తగా జరుగుతోందా? ఇంతకాలం ఎందుకు ఫిషింగ్ హార్జర్లు నిర్మించలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక కదా, నాలుగు కొత్త ఓడరేవులు, పది ఫిషింగ్ హార్జర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నది?. రుషికొండపై గతంలో కూడా భవనాలు ఉన్నాయి కదా.. అయినా టీడీపీ మీడియా దుష్ప్రచారం చేస్తోంది కనుక, దానికి భాజాభజాయింపు చేయడానికి పవన్ కల్యాణ్ కూడా ట్వీట్లు చేశారు. దసపల్ల భూముల గురించి అంతే. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అంటారా? వద్దని అంటారా? అన్నిటిలోను వేలు పెట్టి ఏదో ఒకటి కెలకాలన్న ఆలోచన తప్ప, తన పార్టీ అభివృద్దికి ఏమి చేయాలన్న సంకల్పం ఆయనలో కనిపించదు. పవన్ ఏకరువు పెట్టిన వైఫల్యాలలో వాస్తవాలు ఉన్నాయని అనుకుందాం. మరి వీటిని సరి చేయడానికి ఏమి చేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి కదా?. స్కూళ్లనాడు-నేడు నిలిపివేయమంటారా? అమ్మ ఒడి స్కీమ్ ఎత్తివేయమంటారా?. మద్య నిషేధం విషయంలో పవన్‌కు స్పష్టత ఉన్నదా? విశాఖ కార్యనిర్వాహక రాజధాని కావాలని అక్కడి ప్రజల ఆకాంక్ష. అందుకోసం అక్కడ గర్జన కార్యక్రమం జరుగుతుంటే పవన్‌కు వచ్చిన నొప్పి ఏమిటి. తనను విశాఖలో భాగమైన గాజువాక నుంచి ఘోరంగా ఓడించారన్న దుగ్దతో విశాఖను రాజధానిగా వద్దని ఆయన చెబుతున్నారా? ఒకవేళ జగన్ వైజాగ్‌ను విశాఖను రాజధాని చేయగలిగితే, దానిని మార్చివేసి అమరావతి పల్లెటూళ్లకే రాజధానిని తీసుకు వెళతామని పవన్ చెప్పగలరా? పోనీ పవన్ అమరావతిలో లక్షల కోట్లు వ్యయం చేసి, అక్కడివారికి మాత్రమే రియల్ ఎస్టేట్ ప్రయోజనం కల్పించాలని డిమాండ్ చేస్తారా? రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా కోటీశ్వరులకు, టీడీపీ వారికి మాత్రమే ఆర్దిక ప్రయోజనం కలగాలని పవన్ కూడా డిమాండ్ చేస్తారా? లేక తనకు అన్ని విధాల ఉపయోగపడే లింగమనేని రమేష్ వంటివారికి రియల్ ఎస్టేట్ ద్వారా ఆర్దిక ప్రయోజనం కలిగించాలని బహిరంగంగా కోరగలరా?. నిజంగానే రైతులు ఎవరైనా ఈ ప్రక్రియలో ఎక్కడైనా నష్టపోతే వారికి సాయం చేయడం తప్పుకాదు. పాదయాత్రలకే లక్షలు, కోట్లు ఖర్చు చేయగలిగిన స్థితిమంతులకు తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు మద్దతు ఇచ్చాయంటే వాటి స్వభావమే అంత అని సరిపెట్టుకోవచ్చు. కాని పేదల పక్షపాతిగా చెప్పుకునే సీపీఐ వంటి పక్షాలు కూడా టీడీపీకి తోక పార్టీలుగా మారి ఆ పాదయాత్రకు మద్దతు ఇవ్వడం కాలమహిమ కాక మరేమిటి అవుతుంది. పవన్ వ్యాఖ్యలపై మంత్రులు జోగి రమేష్, రోజా వంటివారు బాగానే స్పందించారు. బహిరంగ చర్చకు రావాలని రమేష్ అంటే, ఉత్తరాంధ్రలో గతంలో వలసలు ఉన్నప్పుడు పవన్ ఏమి చేశారని రోజా అడిగారు. మరో మంత్రి అంబటి రాంబాబు అయితే ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకు గర్జన అర్థం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ రకంగా వైసీపీ నుంచి పవన్ స్పందన పొందగలిగారు. బహుశా 2024 వరకు పవన్ వ్యాఖ్యలకు ఎంతో కొంత స్పందించవలసి ఉంటుందేమో!. తదుపరి ఏదో ఒకటి తేలిపోతుంది. స్థూలంగా చెప్పాలంటే ఇన్నేళ్ల రాజకీయం తర్వాత కూడా పవన్ కల్యాణ్ స్వయం ప్రకాశితం కాకపోవడమే జనసేన విషాదం అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
కుప్పంలో అసలు ఏం జరిగింది?.. చంద్రబాబు హై డ్రామా ఆ భయంతోనేనా..?
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నిజ స్వరూపం బయట పెట్టుకున్నారు. కుప్పంలో తెలుగుదేశం గూండాల దాడులకు అనుగుణంగా చంద్రబాబు వీరంగం ఆడారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎలా కాపురాలు చేస్తారో చూస్తానని బెదిరించారు. పార్టీ శ్రేణులను శాంతియుతంగా ఉండాలని తాను చెప్పలేనని పార్టీ నేతలు యోధుల్లా ధైర్యంగా తయారవ్వాలని బాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సహా మంత్రులను ఉద్దేశించి ఖబడ్దార్ దమ్ముంటే కుప్పం రండి తేల్చుకుందాం అంటూ తొడగొట్టారు. రాజకీయాల్లో అర్ధ శతాబ్ధిగా ఉన్న నాయకుడు ఇటువంటి నేలబారు రౌడీ భాష మాట్లాడ్డంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ‘కుప్పంలో టీడీపీ అరాచకం.. చంద్రబాబే ప్రథమ ముద్దాయి’ కుప్పం నియోజక వర్గం తన చేజారిపోతోందేమోనన్న భయంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. స్థానిక సంస్థల్లో కుప్పం ప్రజలు తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకూ ఎదురుగాలి తప్పదని కంగారు పడుతోన్న వేళ కుప్పం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించడంతో చంద్రబాబు వెన్నులో చలిమొదలైంది. ఈనేపథ్యంలోనే కుప్పంలో టీడీపీ శ్రేణుల చేత గూండాగిరీ చేయించిన చంద్రబాబు వారికి వత్తాసుగా తాను కూడా వీరంగం ఆడేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రిపైనా, పోలీసులపైనా నోటికొచ్చింది అనేశారు. సీనియర్ పొలిటీషయన్ అని చెప్పుకునే చంద్రబాబు భాష చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. ముఖ్యమంత్రీ ఖబడ్దార్.. ఏయ్ డీజీపీ జాగ్రత్త.. ఎస్పీ...ఏమనుకుంటున్నావ్? తమాషాగా ఉందా?. కుప్పంలో కాపురాలు చేస్తారా? చెయ్యండి చూద్దాం. పోలీసుల కతలు రెండు నిముషాల్లో తేల్చేస్తా. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. అందరి అంతు చూస్తాం. ఇవీ నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్ర మూటకట్టురకున్న పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి నేలబారు మాటలు. టీడీపీ కార్యకర్తలకూ కోపం వస్తుంది. ఓ స్థాయి దాటితే ఆ కోపాన్ని నేను కూడా కంట్రోల్ చేయలేను. కార్యకర్తలను పిరికిగా ఉండమని చెప్పలేను ప్రతీ కార్యకర్తా ఒక యోధుడిలా తయారు కావాలి. యువత ముందుకు రావాలి. ఇవీ హుందాగా మెలగాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఈ చౌకబారు రౌడీ భాష అంతా కూడా చంద్రబాబు నాయుడి సొంత నియోజక వర్గం అయిన కుప్పంలోనివే. విషయం ఏంటంటే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అందుకే స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించారు. మరో పక్క జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా కుప్పం నియోజక వర్గంలోనూ అభివృద్ధి కార్యక్రమాలకు నడుం బిగించింది. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించి కుప్పం తలరాత మార్చారు జగన్మోహన్ రెడ్డి. నిన్న కాక మొన్ననే కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం 66 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఆ అభివృద్ధి పథకాలు పూర్తి అయితే కుప్పం ప్రజలు తనని అటకెక్కించేస్తారని కంగారు పడుతున్నారు చంద్రబాబు. ఇప్పటికే తాను సొంతంగా నిర్వహించుకున్న సర్వేలో కుప్పం నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం చాలా కష్టమని తేలినట్లు సమాచారం. ఆయన ఆ టెన్షన్లో ఉంటే.. మరో వైపు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంలో భాగంగా కుప్పం నియోజక వర్గంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇక కుప్పం కూడా తనకు మిగలదన్న భయం చంద్రబాబు నాయుడికి కొద్ది రోజులుగా నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుప్పంలో తరుచుగా పర్యటిస్తోన్న చంద్రబాబు బుధవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు వీధి గూండాల్లా ఊరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లపై దాడులకు దిగారు. అడ్డొచ్చిన వారిని చితక బాదారు. రాళ్ల దాడి చేశారు. మొత్తం మీద రచ్చ రచ్చ చేశారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడి సమక్షంలోనే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తోంటే చంద్రబాబు నాయుడు వారించలేదు. తమాషా చూశారు. ఈ సమయంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. టీడీపీ గూండాయిజానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. తమ పార్టీ శ్రేణుల దాడులను చూస్తూ గడిపిన చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడులు చేశారని గగ్గోలు పెట్టారు. కుప్పంలో ఎన్నడైనా రౌడీయిజం చూశామా? ఎన్నడైనా ఇలాంటి దాడులు చూశామా? అంటూ బుగ్గలు నొక్కుకుంటూ చంద్రబాబు హై డ్రామా నడిపారు. టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయి దాడులు చేస్తోంటే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో చంద్రబాబు కోపం అంతా పోలీసులపై పడింది. పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు చంద్రబాబు. మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? నేను తలచుకుంటే మీ ఇంటిని కొట్టలేనా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతాయని పరోక్షంగా హెచ్చరించారు. ‘మీ ఇళ్లు కూలిస్తే .. మీ కుటుంబ సభ్యులను నడి రోడ్డుపై అవమానిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ‘ అంటూ తన స్థాయి మరిచి హెచ్చరించారు. ఈ పోలీసులకన్నా బ్రిటిష్ వాళ్లే నయం అంటూ చంద్రబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు కొవ్వెక్కిపోయిందన్నారు చంద్రబాబు. రానున్న రోజుల్లో నేను వీధుల్లోకి వస్తా ఎవరొస్తారో చూస్తా అంటూ వీధి రౌడీలా సవాల్ చేశారు. మా కార్యకర్తల జోలికి వస్తే మీ ఇంటికి వస్తా వేలమందిని వేసుకుని వస్తా మీ అంతు చూస్తా అంటూ బాలయ్య సినిమా టైప్ డైలాగ్ వదిలారు చంద్రబాబు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారిని పరోక్షంగా రెచ్చగొట్టారు చంద్రబాబు. ‘ మీకూ కోపం వస్తుంది. దాన్ని నేను కూడా కంట్రోల్ చేయలేను. ఆ విషయాన్ని పోలీసులు గుర్తుంచుకుంటే వారికే మంచిది అని హెచ్చరిక స్వరంతో అన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ప్రభుత్వ సలహాదారులంతా దమ్ముంటే కుప్పానికి రండి అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. అందరి అంతూ తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. అందరికీ కాలం చెల్లిందంటూ దిగజారుడు భాష ప్రయోగించారు. అసలు కుప్పంలో మీరంతా కాపురాలు ఎలా చేస్తారో నేనూ చూస్తా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలను హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తోంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్ధం అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన వాడిన భాష చూస్తోంటే ఆయనకు మతి స్థిమితం తప్పలేదు కదా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఆయన పరుష పదజాలాన్ని చూస్తోంటే ఆయన ఎంతకైనా దిగజారగలరని అర్ధం అవుతోందని వారంటున్నారు. రౌడీయిజం చేసింది తెలుగుదేశమే. హింసాయుత ఘటనలతో బీభత్సం సృష్టించింది ఎల్లో గూండాలే. వారిని రెచ్చగొట్టి వైఎస్సార్ కాంగ్రెస్‌పై దాడులు చేయించింది చంద్రబాబే. అన్నీ వారే చేసి కుప్పంలో ఏదో జరిగిపోతోందన్నట్లు హై డ్రామా ఆడుతోందీ చంద్రబాబే అంటున్నారు పాలక పక్ష నేతలు. తన స్థాయికి కానీ తన హోదాకు కానీ తగని విధంగా చిల్లరగా వ్యవహరించడం చంద్రబాబుకు కొత్త కాదంటున్నారు వారు. గతంలోనూ చంద్రబాబు నాయుడు ఇలాంటి దిగజారుడు రాజకీయాలే చేసి ప్రజల నుండి నిరాకరణకు గురయ్యారని అందుకే ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్వకుండా మరింత పాతాళానికి దిగజారుతున్నారని వారు దుయ్యబడుతున్నారు. చదవండి: చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని -
బాధితుల పరామర్శ కార్యక్రమం నిండా పచ్చ జెండాలు
-
చంద్రబాబు గోల్డెన్ ఛాన్స్ ఎందుకు వదులుకున్నారో!
మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలోను, తెరచాటు రాజకీయాలు చేయడంలోను తెలుగుదేశం పార్టీది అందెవేసిన చెయ్యి అని చెప్పాలి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి వచ్చిన గొప్ప అవకాశాన్ని చేజేతులారా వదులుకోవడం బహుశా తెలుగుదేశం అభిమానులకు తీవ్ర ఆవేదనకు గురి చేస్తుండవచ్చు. మహానాడు తర్వాత ఇక వార్ ఒన్ సైడ్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అంటే దాని అర్థం ఇక వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయిందని, తెలుగుదేశం గెలవడమే ఆలస్యమని చెప్పడమే కాదు. దానికి తాన అంటే తందానా అని ఆ వర్గం మీడియా భజన చేయడమే కదా! ఆ సవాల్‌ను నిజం చేసుకునే అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు వదులుకుంటున్నారు? నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీ చేయకుండా వదలుకోవలసిన అవసరం ఏమి వచ్చింది? చదవండి: ఈనాడు’ కట్టుకథలు: నీళ్లిచ్చిన వారిమీదే... రామోజీ రాళ్లు! ఒకవైపు వైసీపీ దమ్ముంటే టీడీపీ అక్కడ పోటీచేసి సత్తా చూపెట్టాలని చాలెంజ్ చేస్తున్నా టీడీపీ వెనక్కి తగ్డడాన్ని ఎలా చూడాలి? నిజమే. ఆత్మకూరు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి అయిన మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. వైసీపీ తరపున ఆయన సోదరుడు విక్రం రెడ్డి పోటీ చేస్తున్నారు. అక్కడ బీజేపీ కూడా రంగంలో ఉంటామంటూ తన అభ్యర్దిని నిలిపింది. మరి అలాంటప్పుడు టీడీపీ కూడా పోటీ చేసి విజయం సాధిస్తే నిజంగానే వార్ ఒన్ సైడ్ అయిందని ప్రచారం చేసుకోవచ్చు కదా! ఆ మాట అంటే తాము ఎక్కడైనా సిటింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే పోటీ చేయబోమన్న నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. మరణించిన శాసనసభ్యుడి కుటుంబంలో వారు పోటీ చేయాలని తెలివిగా జోడించారు. వాస్తవానికి ఏ పార్టీ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ పార్టీకే ఆ సీటు ఇచ్చి వేయాలన్నది ఒక అభిప్రాయం. అయినా ఆ కుటుంబం నుంచి ఎవరైనా పోటీచేస్తే తాము పోటీచేయబోమన్న టీడీపీ బద్వేల్లో ఎందుకు పరోక్షంగా బీజేపీకి సహకరించింది. తమ పార్టీ స్థానిక నేతలనే ఎందుకు బీజేపీ ఏజెంట్లుగా కూర్చోబెట్టడానికి ముందుకు వచ్చింది. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన కొందరు నేతలు సూచించిన విధంగా బద్వేలులో టీడీపీ ఎందుకు వ్యవహరించింది? వీటికి సమాధానం దొరకదు. ఎందుకంటే ఇక్కడే టీడీపీ తెరచాటు రాజకీయాలు చేసే విషయం బహిర్గతం అవుతుంటుంది. చిత్తశుద్ధితో టీడీపీ ఉప ఎన్నికలో పోటీచేయకపోతే అభినందించవచ్చు. ఆత్మకూరులో అసలు పరిస్థితి ఏమిటో చంద్రబాబుకు తెలుసు కనుక ఆయన టీడీపీని రంగంలో దించ లేదని అనుకోవాలి. పోటీచేసి అతి పెద్ద తేడాతో ఓడిపోతే దాని ప్రభావం వచ్చే శాసనసభ ఎన్నికలపై పడుతుందన్నది వారి భయం. కాకపోతే అదేదో మేకపాటి కుటుంబంపై సానుభూతి కోసం అన్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఒకవేళ తమకు గెలిచే అవకాశం ఉందని సర్వేలలో తెలిస్తే చంద్రబాబు వదలేవారా? ఏదో ఒక సాకు చూపి పోటీ చేయకుండా ఉంటారా? ఈ ఉప ఎన్నికలో గెలిస్తే రెచ్చిపోయి రాష్ట్రం అంతటా తిరిగే అవకాశాన్ని ఆయన చేజేతులారా వదలుకుంటారా? గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా టిడిపి సిటింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా మరణిస్తే అక్కడ తన అభ్యర్ధిని రంగంలో దించలేదు. ఆ సంప్రదాయాన్ని నిజాయితీగా పాటించింది. ఉదాహరణకు గత టరమ్‌లో నందిగామ, తిరుపతిలలో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేలు మరణిస్తే వైసీపీ ఆ ఉప ఎన్నికల జోలికి వెళ్లలేదు. చాటు మాటు వ్యవహారాలు నడపలేదు. అందువల్లే ఆ రెండు చోట్ల టీడీపీ భారీ మెజార్టీతో గెలిచింది. తిరుపతిలో అయితే టీడీపీకి లక్షాపాతికవేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. కాని తదుపరి సాధారణ ఎన్నికలలో వైసీపీ ఈ రెండు సీట్లను కైవసం చేసుకుంది. అది వేరే సంగతి. అప్పట్లో నంద్యాల సిటింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైసీపీకి చెందినవారు కాగా, ఆయనను టీడీపీ ప్రలోభ పెట్టి పార్టీలోకి తీసుకు వెళ్లింది. దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆ సీటు తమది కనుక తామే పోటీచేస్తామని వైసీపీ ప్రకటించింది. కాని చంద్రబాబు దానికి సమ్మతించకుండా భూమ అన్న కుమారుడిని పోటీలో పెట్టారు. అంతేకాక విపరీతంగా శ్రమించి, ధన వ్యయం చేస్తే సుమారు 25 వేల ఓట్ల ఆధిక్యతతో టీడీపీ గెలిచింది. ఆనాటి ప్రతిపక్ష నేత జగన్ దీనిని సవాల్‌గా తీసుకుని ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. అయినా ఆయన కుంగిపోలేదు.. అందువల్లే ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో సుమారు 45 వేల ఓట్ల ఆధిక్యతతో వైసీపీ గెలిచింది. 2019లో వైసిపి అదికారంలోకి వచ్చాక తిరుపతి లోక్ సభ, బద్వేల్ శాసనసభకు ఉప ఎన్నికలు జరిగాయి. తిరుపతిలో టీడీపీ పోటీచేసింది. కాని మూడు లక్షల తేడాతో ఓడిపోయింది. ఆ అనుభవంతో బద్వేలులో రంగంలోకి దిగలేదు. కాకపోతే పరోక్షంగా బీజేపీ, జనసేన అభ్యర్దికి సహకరించి , వైసీపీ మెజార్టీ తగ్గించే యత్నం చేసింది. అక్కడే నిజాయితీ లోపించిందని తెలిసిపోతుంది. అలాకాకుండా నిబద్దతతో వ్యవహరించి ఉంటే అప్పుడు సిటింగ్ ఎమ్మెల్యే మరణానికి సానుభూతిగా టీడీపీ సింటిమెంట్‌ను గౌరవించిందిలే అనుకునే అవకాశం ఉండేది. బీజేపీ ఎక్కడైనా పోటీచేస్తామని, అది తమ విధానమని ప్రకటించి ఆ ప్రకారం చేస్తోంది. జనసేన కూడా తొలుత తాము బద్వేలులో పోటీచేయబోమని చెప్పి, ఆ తర్వాత బీజేపీకి మద్దతు ప్రకటించి మాట తప్పింది. ఉప ఎన్నికలలో ఆయా పరిస్థితులను బట్టి పోటీచేయడం, పోటీ చేయకపోవడం ఆ రాజకీయ పార్టీల ఇష్టం. కాని రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదలుకోదు. అందులోను అదికార పక్షం సవాల్ విసిరినప్పుడు సెంటిమెంట్‌తో సంబంధం లేకుండా పోటీలో దిగవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. తెలంగాణలోని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉండేవారు. కాని వారి మధ్య పొరపొచ్చాలు రావడంతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి అధికార టిఆర్ఎస్కు సవాల్ విసిరారు. అందులో పాతికవేల మెజార్టీతో ఆయన గెలవడంతో బీజేపీకి కొంత ఊపు వచ్చింది. అంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు వెయ్యికి పైగా ఓట్ల తేడా తో గెలిచి సంచలనం సృష్టించారు. ఇప్పుడే కాదు..1993లో ఉమ్మడి ఏపీలో నెల్లూరు జిల్లా కోవూరుకు కాంగ్రెస్ పక్షాన ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి మరణం కారణంగా ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో శ్రీనివాసులు రెడ్డి కుమారుడు ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. మరో నియోజకవర్గం కైకలూరు సీటుకు కాంగ్రెస్ నేత కనుమూరి బాపిరాజు రాజీనామా చేస్తే జరిగిన ఉప ఎన్నికలో కూడా టీడీపీ విజయం సాధించింది. దీంతో 1994 శాసనసభ ఎన్నిలకు ముందు ఈ పలితాలను ట్రయల్‌గా భావించారు. 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంపై వ్యతిరేకత కావచ్చు. ఇతర కారణాలు కావచ్చు.. ఇలా ఉప ఎన్నికలో ప్రతిపక్షం గెలిస్తే వారికి కొత్త ఉత్సాహం వస్తుంది. కాని ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అలా సవాల్ చేయలేకపోతున్నారు. అధికార వైసీపీనే సెంటిమెంట్‌తో సంబంధం లేకుండా పోటీచేసి గెలవండని చాలెంజ్ చేసిన తర్వాత టీడీపీకి సెంటిమెంట్‌తో పని ఏమి ఉంటుంది? అయినా టీడీపీ వెనక్కి తగ్గుతోందంటే ఓటమి భయంతోనే అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు సెంటిమెంట్ గురించి చెబుతున్న టీడీపీ గతంలో కూడా అలాగే చేసిందా? ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలోని చేవెళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న పి.ఇంద్రారెడ్డి మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి సబితా ఇంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నం జరిగినా ఆమె అంగీకరించలేదు. ఆమె కాంగ్రెస్‌లోనే ఉండి పోటీచేయగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ సెంటిమెంట్ ను పట్టించుకోకుండానే పోటీ పెట్టింది. సబితే గెలిచారు. అలాగే అప్పట్లో హోం మంత్రిగా ఉన్న మాధవరెడ్డి ఆకస్మిక మరణంతో భువనగిరికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య ఉమా మాధవరెడ్డి పోటీచేస్తే, కాంగ్రెస్ కూడా తన అభ్యర్దిని నిలిపింది. కాని ఓడిపోయింది. అది వేరే విషయం. తెలంగాణ ఉద్యమం యాక్టివ్‌గా ఉన్న రోజులలో 2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ కూడా పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కాంగ్రెస్‌తో పాటు టీడీపీ కూడా పోటీచేసింది. చంద్రబాబు పేరుకు పోటీ పెట్టారు కాని, ఆయన అక్కడకు ప్రచారానికి కూడా వెళ్లలేదు. దానిని డైవర్ట్ చేయడానికి బాబ్లి ప్రాజెక్టుకు నిరసన అంటూ ఒక పోటీ కార్యక్రమాన్ని పెట్టి కథ నడిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సిటింగ్ ఎమ్మెల్యే కోర్టు తీర్పు కారణంగా సీటును వదలుకోవలసి వచ్చింది. అప్పటికే మరణించిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.ఆర్. రెండో భార్య లక్ష్మీపార్వతి సొంత పార్టీ పక్షాన పోటీచేస్తే, ఆమెను ఓడించడానికి చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ విశేష కృషి చేసింది. కాని ఆశ్చర్యంగా లక్ష్మీపార్వతి గెలిచింది. అప్పుడు ఎన్.టి.ఆర్. ఇష్టపడ్డ వ్యక్తి కదా అని ఆ సీటును లక్ష్మీపార్వతికి వదలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు చంద్రబాబు తన రాజకీయ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఆయన సెంటిమెంట్లు, విలువల గురించి పట్టించుకుంటారంటే నమ్మడం కష్టమే. అయినా మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో టీడీపీ తన బలాన్ని రుజువు చేసుకోవాలి కదా? అందులోను వైసీపీ ప్రభుత్వం అన్నిటిలోను విఫలం అయందని, జగన్‌ను అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ సారి తాము అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్న చంద్రబాబు ఆత్మకూరు సీటును వదలుకోవడం ఆత్మహత్య సదృశ్యం కాదా! ఆయా సందర్భాలలో దమ్ముంటే ఎన్నికలు పెట్టండని చంద్రబాబు సవాలు విసురుతుంటారు. అదేదో కుప్పంతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు రాజీనామా చేసి అధికార పక్షాన్ని రంగంలో దించవచ్చు కదా అంటే ఆ పని చేయరు. కనీసం ఇప్పుడు ఆత్మకూరులో పోటీచేసి టీడీపీ క్యాడర్లో జోష్ నింపుతారనుకుంటే పోటీకే వెనుకాడారు. టీడీపీ మీడియా ఒకటి గోవిందా.. గోవిందా అంటూ జగన్‌కు వ్యతిరేకంగా పాటలు ప్రచారం చేస్తోంది. సరిగ్గా గోవిందా అన్న నినాదం ఆత్మకూరులో టీడీపీకి వర్తిస్తుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
చీప్ పాలి‘ట్రిక్స్’కు తెరలేపిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి అర్బన్(శ్రీ సత్యసాయి జిల్లా): మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చీప్ ట్రిక్స్‌కు తెరలేపారు. శుక్రవారం కొత్తచెరువు మండలం బండ్లపల్లికి చెందిన సర్పంచ్ గీతాబాయి మామ తిరుపాల్‌నాయక్ వీధిలైట్ల కోసం బండ్లపల్లికి వెళ్తుండగా...అదే సమయంలో సోమందేపల్లికి వెళ్లున్న మాజీ మంత్రి అతన్ని దారిలో ఆపాడు. బలవంతంగా టీడీపీ కండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని టీడీపీ వాట్సాప్ గ్రూపులకు పంపారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపాల్ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి వివరించారు. చదవండి: వైరల్ వీడియో: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి, సీఎం జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అంతేగాని పల్లె చీప్ ట్రిక్స్‌కు లోనయ్యే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ నాయకులు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీధర్‌రెడ్డిని ఎమ్మెల్యేగాను, వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో బండ్లపల్లి సర్పంచ్ గీతాబాయి, రూప్లానాయక్, తిరుపాల్ నాయక్, తలమర్ల మాజీ సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు ఉన్నారు. -
చంద్రబాబు దిగజారుడు చేష్టలపై కేఎస్ఆర్ కామెంట్
-
శవ రాజకీయాల్లో చంద్రబాబు సిద్ధహస్తుడు: మేరుగు నాగార్జున
-
టీడీపీ శవ రాజకీయం
-
ChandrababuNaidu: మరోసారి బయటపడ్డ చంద్రబాబు నీచరాజకీయాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు నీచరాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. మాచర్లలో పాతకక్ష్యలతో జరిగిన ఓ హత్యను చంద్రబాబు అండ్ టీమ్ తమకు అనుకూలంగా మార్చుకునే పనిచేశారు. మాచర్లలో జరిగిన హత్యకు రాజకీయరంగు పులిమి రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అచ్చెంనాయుడు, ఆ పార్టీ సీనియర్ నేతలు జీవీ ఆంజనేయులు, బ్రహ్మానందరెడ్డి, యరపతినేనితో చంద్రబాబు చేసిన కుట్ర ఫోన్‌కాల్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఈ మేరకు ఆ ఆడియోలో చంద్రబాబు హత్యను అడ్డుపెట్టుకుని జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లకు సూచనలు చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా బాబు నాయకులను ప్రోత్సహించడం గమనించవచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడటంపై పలువురు పెదవివిరుస్తున్నారు. చదవండి: (బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది: తోపుదుర్తి) మాచర్లలో జరిగిందిదీ.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య (35) గురువారం హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో ప్రత్యర్థులు ఆయన్ని కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. హతుడు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు. బ్రహ్మారెడ్డి ఒకేరోజు జరిగిన 7 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో చంద్రయ్య గుడికి వెళ్ళి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆయన గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల కారణంగానే చంద్రయ్య హత్య జరిగిందని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. చదవండి: (రాజాం టీడీపీలో వర్గపోరు) తోట చంద్రయ్య, చింతా శివరామయ్యలకు గతంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం విషయంలో ఘర్షణలు జరిగాయి. ఆ తరువాత చంద్రయ్య టీడీపీలో చురుగ్గా తిరుగుతుండటం, బ్రహ్మారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండటంతో అతడి వల్ల ప్రాణహాని ఉందనే అనుమానంతో ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డట్టు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మాచర్ల రూరల్ సీఐ సురేంద్రబాబు, వెల్దుర్తి ఇన్చార్జి ఎస్ఐ పాల్ రవీందర్‌లు సంఘటన ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. -
చంద్రబాబు బురద రాజకీయంపై అసెంబ్లీలో సీఎం జగన్ ఆవేదన
నేను గాల్లోనే వచ్చి, గాల్లోనే పోతా నని.. ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని, తనను వ్యతిరేకించిన వైఎస్సార్ కాల గర్భంలో కలిసిపోయారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారు? ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి? నిజంగా ఆయన సంస్కారానికి నా నమస్కారాలు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ‘కష్టకాలంలో బాధితులకు సాయం త్వరగా అందడం చాలా ముఖ్యం. రాయలసీమలో ప్రత్యేకించి వైఎస్సార్ జిల్లాలో వరద ముంచెత్తిన తరుణంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాము. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అక్కడ మామూలు పరిస్థితులు నెలకొనేలా అడుగులు ముందుకు వేశాం. ఈ సహాయ కార్యక్రమాలకు అడ్డు కాకూడదనే నేను ఆ ప్రాంతాల్లో పర్యటించలేదు. వైఎస్సార్ కడప నా సొంత జిల్లా. సహాయక చర్యలు పూర్తయ్యాక, పరిస్థితి కుదుట పడ్డాక తప్పకుండా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళతాను. అయితే చంద్రబాబు ఈ వాస్తవాలను వక్రీకరించి, రాజకీయం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతుండటం దారుణం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాలిలో వస్తాడు.. గాలిలోనే పోతాడు’ అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితి, దెబ్బతిన్న జిల్లాల్లో చేపట్టిన సహాయక చర్యలపై శుక్రవారం సీఎం శాసనసభలో మాట్లాడారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కనీవినీ ఎరుగని రీతిలో వరద చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నవంబర్ 16, 17న వర్షాలు పడ్డాయి. నవంబరు 19 తెల్లవారుజామున రెండు చిన్న రిజర్వాయర్లు పింఛ, అన్నమయ్య కట్టలు తెగిపోయాయి. వరదల వల్ల కలిగిన ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎక్కడా దాచిపెట్టే పని చేయలేదు. శుక్రవారం తెల్లవారుజామున 3.20 లక్షల క్యూసెక్కుల నీరు 2, 3 గంటల్లోనే చెయ్యేరు నుంచి అన్నమయ్య ప్రాజెక్టులోకి వచ్చిందని టీడీపీ అధికార పత్రిక ఈనాడులోనే రాశారు. జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న 1,250 కుటుంబాలను అప్రమత్తం చేశారు. లోతట్టులో ఉన్న 400 కుటుంబాలను ఎత్తు ప్రాంతాలకు తరలించారు. 900 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. ఏది ముఖ్యం? సాయమా.. నా పర్యటనా? శుక్రవారం మధ్యాహ్నానికే హెలికాప్టర్లను అక్కడకు చేర్చగలిగాం. ముంపు గ్రామాలకు తాగునీరు, ఆహారం అందించగలిగాం. ఆరోజే జరిగిన నష్టాన్ని నేను సమీక్షించి సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చాను. శనివారం ఏరియల్ సర్వే ద్వారా ఆ ప్రాంతాలకు వెళ్లి చూశాను. ప్రతిరోజు కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌లు, సమీక్షల ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ, సహాయక చర్యలను పురమాయిస్తూ, ముమ్మరంగా ఫాలో అప్ చేశాం. ప్రత్యేక అధికారులు, ఆ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించాం. ‘నేను వెళ్లాలి కదా.. రాజకీయాల్లో ఉన్నాం.. చంద్రబాబు బురద జల్లుతాడు, బండలు వేస్తాడు’ అని చర్చించా. అలా చేస్తే సీఎం చుట్టూ యంత్రాంగం, మీడియా, హడావుడి తప్ప పనులు జరగవని అధికారులు చెప్పారు. ఇంత చేసినా దుర్మార్గంగా రాజకీయం చేస్తున్నం దుకు చంద్రబాబు సంస్కారానికి నమస్కారం. డబ్బు కొరత లేకుండా చూశాం నాలుగు జిల్లాల్లో వరద వల్ల 44 మంది మరణించగా, 16 మంది గల్లంతయ్యారు. 1,169 ఇళ్లు పూర్తిగా, 5,434 ఇళ్లు పాక్షికంగా, 604 గుడిసెలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. 319 తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేసి 79,590 మందికి ఆశ్రయం ఇచ్చాం. డబ్బు కొరత లేకుండా రూ.84 కోట్లను ఆయా జిల్లాలకు విడుదల చేశాం. కరెంటు సరఫరాను నిన్నటికే (గురువారం) నూటికి నూరు శాతం పునరుద్ధరించాం. ప్రతి బాధిత కుటుంబానికి బియ్యం, నూనె, ఇతర రేషన్ ఇవ్వడంతో పాటు వారు ఇంటికి వెళ్లినప్పుడు చేతిలో రూ.2 వేలు ఇచ్చి చిరునవ్వుతో పంపించే కార్యక్రమం చేశాం. బాబు ఇలా మానవత్వం చూపారా? చంద్రబాబు తన హయాంలో ఒక్కసారైనా ఇంత మానవత్వం చూపారా? 25 కేజీల బియ్యం ఇస్తే పెద్ద గొప్ప అని భావించే రకం ఆయన. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు శరవేగంగా అందించాం. గల్లంతైన వారి ఎఫ్ఐఆర్, స్థానిక విచారణ వేగంగా జరిపించి రూ.5 లక్షల పరిహారం అందించాం. గతంలో దీనికి కనీసం నెల పట్టేది. అంటువ్యాధులు ప్రబలకుండా 653 మెడికల్ క్యాంపులు నిర్వహించాం. 5,286 పశువులు చనిపోతే వాటికి ఈరోజు (శుక్రవారం) సాయంత్రానికి పరిహారం ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. గతంలో ఇందుకు 6 నెలలు పట్టేది. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,200, పక్కా ఇళ్లకు రూ.5,200, పూర్తిగా దెబ్బతింటే రూ.95,100 నష్ట పరిహారం పూర్తిగా చెల్లించాం. పూర్తిగా ఇళ్లు దెబ్బ తిన్న వారికి నష్ట పరిహారంతోపాటు రూ.1.80 లక్షలతో కొత్త ఇల్లు మంజూరు పత్రాలను చేతిలో పెట్టాం. పంట నష్ట పరిహారం, రోడ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించాం. చెరువు గట్లకు 882 చోట్ల గండ్లు పడితే 267 గండ్లు పూడ్చివేయించాం. రిజర్వాయర్లలో ఆన్లైన్లో ఆటోమేటిక్‌గా రియల్‌టైంలో నీళ్లు, ప్రవాహాన్ని మానిటర్ చేసేలా చూస్తున్నాం. ఈఎన్సీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించాం. చిన్నా, పెద్ద రిజర్వాయర్లపై అధ్యయనం చేసి, ప్రతి రిజర్వాయర్‌కు కాంక్రీట్ మెజర్స్ తీసుకునే దిశగా సీఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. అన్నమయ్య రిజర్వాయర్ డిశ్చార్జ్ కెపాసిటీని పెంచాలని 2017లో నివేదికలు ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది వక్రీకరణ కాదా? చంద్రబాబునాయుడి కరపత్రం ఈనాడు తొలి పేజీలో ఒక ఫొటో వేశారు. చంద్రబాబుకు తన ఇంట్లో పరిస్థితి వివరిస్తున్న నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామం మహిళ అని రాశారు. ఇంటి ముందున్న పాకలో నిలబడి చంద్రబాబు ఫొటో దిగాడు. ఆ ఇంటికి చెందిన పాత్ర మన్నెమ్మది ఇందుకూరు పేట మండలం గంగపట్నం గ్రామం. ఈ నెల 24న ఆమెకు రూ.2 వేలు డబ్బు, 25న నిత్యావసరాలు, 26న పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.5,200 డబ్బు ఇచ్చాం. పక్కా ఇల్లు ఇప్పటికే ఉంది కాబట్టి ఆమె దానికి అర్హురాలు కాదు. ఆమెకు రావాల్సిన ప్రతిదీ ఏ సిఫార్సు లేకుండా ఇచ్చాం. ఆమె గురించి ఎవరూ చెప్పిందీ లేదు. చంద్రబాబు ఇంతకు ముందు ఆవిడ దగ్గరకు పోయిందీ లేదు. ఆమె ఏ పార్టీ అని అడగలేదు. ప్రభుత్వం వలంటీర్లను పెట్టి ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తున్నామన్నదానికి ఇదే నిదర్శనం. ఇవన్నీ ఆమెకు అందాయని ఈనాడులో ఎక్కడా రాయరు. ప్రభుత్వాన్ని ఎలా డ్యామేజ్ చేయాలి.. అని మాత్రమే ఆలోచించి పతాక శీర్షికల్లో చంద్రబాబు ఫొటో పెట్టి రాస్తారు. -
చిల్లర రాజకీయాలు