మహిళలపై కర్కశంగా కంకర పోశారు.. | Nara Lokesh Plays Cheap Politics In Srikakulam | Sakshi
Sakshi News home page

మహిళలపై కర్కశంగా కంకర పోశారు..

Published Tue, Nov 8 2022 12:02 PM | Last Updated on Tue, Nov 8 2022 12:02 PM

Nara Lokesh Plays Cheap Politics In Srikakulam - Sakshi

శ్రీకాకుళం: మండలంలోని హరిపురంలో స్థల వివాదం ముదిరి సోమవారం ఇద్దరు మహిళలపై కంకర(గులకరాళ్లతో కూడిన మట్టి) పోసే వరకూ వెళ్లింది. రామారావు, ప్రకాశరావు, ఆనందరావులతో సమీప బంధువులైన కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలకు ఓ ఇంటి స్థలం విషయమై ఎప్పటి నుంచో వివాదం ఉంది. వీరి మధ్య ఊరి పెద్దలు కూడా రాజీ కుదర్చలేకపోయారు. హరిపురంలో స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో ఎవరికి వారే పట్టుదలకు పోయారు.

 ఈ తరుణంలో సోమవారం వివాదం మరింత ముదిరింది. రామారావు, ఆనందరావు, ప్రకాశరావులు ట్రాక్టర్లతో వివాద స్థలంలో కంకర వేస్తుండగా.. దాలమ్మ, సావిత్రి అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ల వెనుక ఉన్న వీరిద్దరిపై అమాంతం మట్టిని కుమ్మరించేశారు. నడుంలోతు వరకు కూరుకపోవడంతో వారు పెద్దగా రోదించారు. వీరి కేకలు విన్న చుట్టు పక్కల వారు పారలతో కంకరను తీసి మహిళలను బయటకు లాగారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్ట్‌ చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు.  

కుటుంబాల మధ్య గొడవను వైఎస్సార్‌సీపీకి అంటగట్టిన లోకేష్‌..
రెండు కుటుంబాల మధ్య నడుస్తున్న వివాదమిది. టీడీపీ హయాంలో కూడా ఇది కొనసాగింది. 2017, 2019లో ఆ ప్రభుత్వం హయాంలోనే బాధిత మహిళలు నిరాహార దీక్షలు చేశారు. అప్పుడు అధికారులు, గ్రామ పెద్దలు కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. అయినా గొడవలు ఆగలేదు. కోర్టు వరకు చేరింది. ప్రస్తుతం కోర్టులో ఈ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య కొనసాగుతున్న గొడవల్లో భాగంగా ఒక వర్గం వారు మరో వర్గంపై మట్టిపోశారు.

 కానీ దీనిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోంది. వ్యక్తుల మధ్య జరిగిన గొడవను వైఎస్సార్‌సీపీకి అంటగడుతోంది. ముఖ్యంగా పార్టీ నాయకుడు నారా లోకేష్‌ ట్వీట్లతో పార్టీల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ గొడవకు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం ఏమిటని స్థానికులు అనుకుంటున్నా.. లోకేష్‌ మాత్రం ముఖ్యమంత్రి జగన్‌కు లింకు పెట్టి ట్వీట్‌లతో రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎస్‌ఐ బందోబస్తు నిమిత్తం విశాఖలో ఉండడంతో కేసు తీవ్రత దృష్ట్యా, వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ మధు, కాశీబుగ్గ సీఐ శంకరావులు హుటాహుటీన అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు ఇంతలా స్పందించినా లోకేష్‌ తప్పుడు ట్వీట్లు చేయడం హాస్యాస్పందంగా ఉంది. ఎక్కడ వివాదం జరుగుతుందా.. ఎక్కడ గొడవ జరుగుతుందా.. దాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగడదామనే ఆరాటంతో లోకేష్‌ తాపత్రయ పడుతున్నారు. ప్రతీది రాజకీయం చేసి వైఎస్సార్‌సీపీపై నెట్టి పార్టీ పరంగా లబ్ధి పొందడానికి ప్రయతి్నస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్నీవదులుకోకూడదన్న లక్ష్యంతో లోకేష్‌ పనిచేస్తున్నట్టుగా తాజా ఘటనపై స్పందించిన తీరు స్పష్టం చేస్తుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement