సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పైఫొటోలో రౌండప్ చేసిన వ్యక్తి పేరు కూనబిల్లి దామోదరరావు. ఈయన లావేరు మండలం కొత్త కుంకాం మాజీ సర్పంచ్. టీడీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆరు నెలల కిందట టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొత్త కుంకాంలో నిర్వహించిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో ఊరంతా తిరిగారు. టీడీపీ కరపత్రాలు కూడా గ్రామస్తులకు పంచిపెట్టారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేదికపైన కూర్చొన్నారు. ఆయన పక్కనే నిల్చొని కలిశెట్టి అప్పలనాయుడు ప్రసంగం కూడా చేశారు.
ఇప్పుడు అదే వ్యక్తికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు సోమవారం సాయంత్రం టీడీపీ కండువా వేసి ఆయనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరారని ప్రచారం చేశారు. ఆ ఫొటోను మీడియాకు, సామాజిక మాధ్యమాలకు వదిలారు. దీంతో చూసిన వారంతా అవాక్కయ్యారు. టీడీపీ నాయకుడు వైఎస్సార్‌సీపీ నుంచి చేరడమేంటని అంతా ఆశ్చర్యపోయారు. మిగతా రాజకీయ పక్షాలకు చెందిన వారిని పక్కన పెడితే సాక్షాత్తు టీడీపీకి చెందిన వారే తప్పు పడుతున్నారు. మన పార్టీ నాయకుడికి కండువా వేసి, మన పారీ్టలోకి చేరడమేంటని కళా వెంకటరావు తీరుపై పెదవి విరుస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు కండువాలు వేసి, వారంతా వైఎస్సార్‌సీపీ వారని చెప్పడం సిగ్గుగా లేదా అని ఆక్షేపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులున్న వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్‌లో ఓ రేంజ్‌లో కళాను కడిగేస్తున్నారు.
... ఇలా చేయడం కళా వెంకటరావుకు కొత్తేమీ కాదు. అధిష్టానం వద్ద తన బలం పెరిగిందని చెప్పుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఏప్రిల్‌లో లావేరు మండలం పట్నాయునిపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలను రణస్థలం మండలం వీఎన్‌పురానికి తీసుకొచ్చి టీడీపీ కండువాలు చేసి, వారంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారని ఫొటోలు తీసి మీడియాకు వదిలారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ కండువాలు వేసి చేరికలేమిటని సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లే నివ్వెరపోయారు.
సెప్టెంబర్‌లో కూడా ఇదే తరహా డ్రామా వేశా రు. పాలఖండ్యాం పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన 25 వైఎస్సార్‌సీపీ కుటుంబాలు టీడీపీలో చేరినట్టుగా, వారందరికీ కండువాలు వేసి ఫొటోకు ఫోజులిచ్చి మీడియాకు ఇచ్చారు. కానీ, వాస్తవానికి వారంతా మెట్టవలస గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరులు. వాస్తవం తెలుసుకున్న జనం ఛీకొట్టారు. ఇదే విషయమై వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి.. చేరారని చూపించిన వారిలో ఒక్కరైనా వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఉన్నారని నిరూపించాలంటూ సవాల్ విసిరారు. దానికి కళా వెంకటరావు తోక ముడిచి సైలెంట్ అయిపోయారు.
చీప్ పాలిట్రిక్స్..
కళా వెంకటరావు ఇలా వింత పోకడకు దిగుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తనకు బలం లేకపోయినప్పటికీ, ఉన్న కేడర్‌ను తనను పట్టించుకోన ప్పటికీ తనకు పట్టు ఉందని, తన వెంట కేడర్ ఉందని చెప్పుకోవడానికి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. కళా వైభవం పోయిందని, ఆయనకంత సీన్ లేదని కార్యకర్తలు సైతం తేలికగా తీసుకుని పట్టించుకోవడం మానేశారు.
ఆయనకు ప్రత్యామ్నాయమైన కలిశెట్టి అప్పలనాయుడును తమ నాయకుడిగా గుర్తిస్తున్నారే తప్ప కళా వెంకటరావును ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. పెళ్లి ఇతరత్రా శుభ కార్యక్రమాల ఆహా్వనం కోసం వచ్చిన వారితో ఫొటోలు తీసుకుని, వారు కూడా తన బలగమని చెప్పుకునే స్థాయికి కళా దిగజారిపోయారు. చావు పరామర్శకు వెళ్లి, అక్కడ టీడీపీ వాళ్లకే కండువాలు వేసి వైఎస్సార్‌సీపీ నుంచి చేరినట్టుగా చిత్రీకరించిన సందర్భం కూడా ఉంది. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్ అయింది కూడా.
చదవండి: భావనపాడు కలపై.. అచ్చెన్న కుయుక్తులు!
Comments
Please login to add a commentAdd a comment