స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు విశ్వరూపం బయటపడుతుండటంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. దీంతో టీడీపీ చేస్తున్న ప్రయత్నాలతో ఆ పార్టీకి కనీస సానుభూతి కూడా రావడంలేదు. అయినా ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలను ఏమార్చడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్ శృతిమించింది. తిరుమల పవిత్రతను మంటగలిపేలా టీడీపీ శ్రేణులు ప్రవర్తించారు. ఉనికి కోసం టీడీపీ చావు తెలివితేటలు ప్రదర్శిస్తోంది.
పచ్చ పార్టీ నాయకులు ఎందుకు తిరుమలను లక్ష్యంగా చేసుకొని గత పది రోజులుగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనే పేరుతో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం జెండాలతో ఫోటోలు తీసి రాజకీయం చేయాలని చూస్తున్నారు?. చివరికి స్టీలు గ్లాసులతో తెలుగుదేశం పార్టీ మోత మోగించు అనే నిరసన కార్యక్రమాన్ని కూడా తిరుమలలో చేయాలని చూడడం ఏవగింపు కలిగిస్తుంది. ఈ విషయంపై హైందవులు, తిరుమల శ్రీవారి భక్తులు తెలుగుదేశం పార్టీ వైఖరిని చీదరించుకుంటున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయిన చంద్రబాబుకి మద్దతుగా గత పది రోజులుగా ఏదో ఒక విధంగా తెలుగుదేశం జెండాను చూపిస్తూ ఫోటోలు దిగి సామాజిక ఉద్యమాల్లో సర్కులేట్ చేయడం ద్వారానో లేక తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న నిరసనలతో తిరుమలలో వివాదాస్పదం చేసి, అధికార పక్షాన్ని ఇరకాటంలోకి పెట్టాలని శతవిధాల తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారు.
తెలుగు తమ్ముళ్లు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహాన్ని హైందవ సంఘాలు, తిరుమల శ్రీవారి భక్తులు తిప్పి కొట్టడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. చివరికి టీడీపీ నిర్వహిస్తున్న మోతు మోగిద్దాం నిరసన కార్యక్రమానికి మద్దతుగా సీహెచ్ భగవాన్, రామ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఏకంగా విజయవాడ నుంచి తిరుమలకు వచ్చి స్టీల్ గ్లాసులతో చప్పుడు చేస్తూ మొబైల్ ద్వారా వీడియో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుకున్నారు. టీడీపీ ఎంత నీచానికి ఒడిగట్టిందో ఈ విషయంతోనే అర్థమవుతుంది. ఇదే విధంగా 2009 ఎన్నికల సమయంలో కూడా తెలుగు తమ్ముళ్లు ఇదే అత్యుత్సాహం ప్రదర్శించి చతికిల పడిన విషయం మర్చిపోతున్నారు.
చదవండి: నోటీసుల్లో లోకేష్‌కు సీఐడీ ఏం చెప్పిందంటే..?
Comments
Please login to add a commentAdd a comment