సాక్షి, అమరావతి: చంద్రబాబు నీచరాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. మాచర్లలో పాతకక్ష్యలతో జరిగిన ఓ హత్యను చంద్రబాబు అండ్ టీమ్ తమకు అనుకూలంగా మార్చుకునే పనిచేశారు. మాచర్లలో జరిగిన హత్యకు రాజకీయరంగు పులిమి రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అచ్చెంనాయుడు, ఆ పార్టీ సీనియర్ నేతలు జీవీ ఆంజనేయులు, బ్రహ్మానందరెడ్డి, యరపతినేనితో చంద్రబాబు చేసిన కుట్ర ఫోన్‌కాల్ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
ఈ మేరకు ఆ ఆడియోలో చంద్రబాబు హత్యను అడ్డుపెట్టుకుని జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లకు సూచనలు చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా బాబు నాయకులను ప్రోత్సహించడం గమనించవచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడటంపై పలువురు పెదవివిరుస్తున్నారు.
చదవండి: (బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది: తోపుదుర్తి)
మాచర్లలో జరిగిందిదీ..
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య (35) గురువారం హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో ప్రత్యర్థులు ఆయన్ని కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. హతుడు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు. బ్రహ్మారెడ్డి ఒకేరోజు జరిగిన 7 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో చంద్రయ్య గుడికి వెళ్ళి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆయన గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల కారణంగానే చంద్రయ్య హత్య జరిగిందని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: (రాజాం టీడీపీలో వర్గపోరు)
తోట చంద్రయ్య, చింతా శివరామయ్యలకు గతంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం విషయంలో ఘర్షణలు జరిగాయి. ఆ తరువాత చంద్రయ్య టీడీపీలో చురుగ్గా తిరుగుతుండటం, బ్రహ్మారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండటంతో అతడి వల్ల ప్రాణహాని ఉందనే అనుమానంతో ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డట్టు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మాచర్ల రూరల్ సీఐ సురేంద్రబాబు, వెల్దుర్తి ఇన్‌చార్జి ఎస్‌ఐ పాల్ రవీందర్‌లు సంఘటన ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment