మనుషులైనా జంతువులైనా సరే ఐకమత్యంతో ఉంటే కొన్ని సందర్భాల్లో ఆపదల నుంచి తప్పించుకోవచ్చు అని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తాజాగా కొన్ని చిలుకలు ఐకమత్యంతో ఉండి.. పాము తరమిమేసి తమ ప్రాణాలను నిలుపుకున్నాయి. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
అయితే, జిల్లాలోని పెనుగొండలో ఓ కొబ్బరిచెట్టుపై కొన్ని చిలుకలు గూడుకట్టుకున్నాయి. కాగా, చిలుకల గూడును ఎక్కడి నుంచి పసిగట్టిందో ఏమో ఓ పాము వాటిని చినేందుకు చెట్టుపైకి ఎగబాకింది. ఆ సమయంలో పాము రాకను గమనించిన చిలుకలు తమ ప్రాణాలను కాపాడుకునేందు సర్వశక్తులొడ్డాయి. ఐకమత్యంతో పోరాటం చేశాయి.
చెట్టుపై ఉన్న పాము బుసలుకొడుతూ చిలుకలను కాటువేసేందుకు ప్రయత్నించగా అక్కడున్న చిలుకలన్నీ ఐకమత్యంతో పామును ఎదుర్కొన్నాయి. పాముపై చిలుకలన్నీ కలిసి ముప్పెటదాడి చేశాయి. దీంతో, చేసేదేమీ లేక పాము తోకముడిచింది. కాగా, చిలుకల ఐకమత్యంపై నెటిజన్లు స్పందిస్తూ.. కలిసి పోరాడితే ఎంతటి కష్టానైనా జయించవచ్చని నిరూపించాయంటూ ప్రశంసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పెద్దగా బుసలు కొడుతూ.. బయటకు లాక్కొచ్చి మరీ కాటేసింది!
Comments
Please login to add a commentAdd a comment