నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన 'మళ్లీపెళ్లి' ఇప్పటికే విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో నరేశ్, పవిత్ర పలు వివాదాలతో మరింత పాపులర్ అయ్యారు. సినిమా విడుదలను ఆపేయాలంటూ గతంలో నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టుకు వెళ్లింది. కానీ ఇదీ సినిమా మాత్రమే అని మేకర్స్ తెలపడంతో మూవీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
(ఇదీ చదవండి: బాలీవుడ్‌ను భయపెడుతున్న ప్రభాస్.. కారణాలు ఇవే)
తాజాగా ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా (నేడు జూన్ 24) విడుదలైంది. దీంతో సినిమా స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ ఆహాతో పాటు అమెజాన్‌కు రమ్య నోటీసులు జారీ చేశారు. సృజనాత్మక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారని నోటీసులో తెలిపారు. రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ పరువు తీయడానికే మేకర్స్ సినిమాను నిర్మించారని పేర్కొన్నారు. ఇలాంటి పనుల కోసం చలనచిత్రం వంటి కళారూపాన్ని ఉపయోగించుకోవడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని తెలిపారు.
(ఇదీ చదవండి: యూత్‌ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి)
ఇప్పుడున్న పరిస్థితుల్లో OTT ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అధిక సంఖ్యలో కంటెంట్‌ను రీచ్ చేస్తున్నాయి. కాబట్టి చిత్రంలో రమ్యరఘుపతి పాత్ర వల్ల తను మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని రమ్య తరుపున న్యాయవాది తెలిపారు. ఈ నోటీసుల వల్ల ఆమెజాన్ ప్రైమ్‌లో 'మళ్లీపెళ్లి' సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపేశారు.. కానీ 'ఆహా' వారు మాత్రం ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి అందుబాటులో ఉంచారు. తర్వాత ఆహా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment