ఏ ప్రేమ గొప్పది? | ms raju 'janam' movie audio released | Sakshi
Sakshi News home page

ఏ ప్రేమ గొప్పది?

Published Sun, Sep 21 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

ms raju 'janam' movie audio released

 తల్లిప్రేమ, ప్రియురాలి ప్రేమ ఈ రెంటినీ ఏకకాలంలో చవిచూస్తున్న ఓ కుర్రాడి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల సమాహారమే ప్రధానాంశంగా నూతన నిర్మాత ఎం.ఎస్.రాజు నిర్మించిన చిత్రం ‘జననం’. భువన్‌తేజ్, రాజ్ ప్రియాంత్, గీతాభగత్, శ్రావణి ఇందులో ప్రధాన పాత్రధారులు. ఎస్.ఎల్.మణిగంజి దర్శకుడు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ప్రేమ, కామెడీ, సెంటిమెంట్ మేళవించిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement