మెహర్, సుమంత్, క్రితిక, రోహన్
‘డర్టీ హరి’ చిత్రం తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, క్రితికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఎంఎస్ రాజు మాట్లాడుతూ– ‘‘ఆకట్టుకునే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్‌తో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’అన్నారు.
‘‘అందరికీ నచ్చే యూత్‌ఫుల్ సినిమా ఇది’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సహ నిర్మాతల్లో ఒకరైన జె. శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, కెమెరా: నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత, కో–డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము.
Comments
Please login to add a commentAdd a comment