
బస్సులో ప్రేమ కహానీ!
అతనో బస్ కండక్టర్. ఎస్. కోట నుంచి గవిటి వెళ్లే రూట్‌లో డ్యూటీ. బస్సు జర్నీలోనే ఓ బ్యూటీతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో తన లవ్‌ను కూడా రైట్..రైట్ అనిపించు కున్నాడు. ఈ ఇద్దరి ప్రేమ ప్రయాణంతో పాటు అంతు చిక్కని మిస్టరీ కూడా ఈ సినిమాలో ఉంటుందంటోంది ‘రైట్ రైట్’ సినిమా టీమ్. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ జంటగా మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాత, సుమంత్ అశ్విన్ తండ్రి ఎమ్మెస్ రాజు బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఈ చిత్రం మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ- ‘‘సుమంత్ అశ్విన్ కె రీర్లోనే చెప్పుకునే చిత్రమవుతుంది. మేకింగ్ వీడియో ప్రామిసింగ్‌గా ఉంది’’ అన్నారు. ‘‘నాన్న గారి బర్త్‌డేకి మేకింగ్ వీడియో విడుదల చేయడం హ్యాపీగా ఉంది’’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. ‘‘ఈ నెల 15న పాటలను రిలీజ్ చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రా నికి సంగీతం: జె.బి, కెమెరా: శేఖర్ వి. జోసఫ్, సహ నిర్మాత: జె.శ్రీనివాసరాజు, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు.