Prabhas Sent Special Marriage Gift To Sumanth Ashwin And Deepika - Sakshi
Sakshi News home page

సుమంత్‌కు ప్రత్యేక బహుమతి పంపిన ప్రభాస్‌

Published Thu, Feb 18 2021 10:59 AM | Last Updated on Thu, Feb 18 2021 2:04 PM

Prabhas Sent Marriage Gift To Kerintha Actor Sumanth Ashwin - Sakshi

'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'' వంటి హిట్‌ చిత్రాల నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు ఏకైక కుమారుడు, టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న అత్యంత దగ్గరి బంధువుల సమక్షంలో దీపిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను ఇల్లాలిని చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు. అయితే నెట్టింట మాత్రం విషెస్‌ తెలిపారు.

ఈ క్రమంలో తాజాగా బాహుబలి ప్రభాస్‌.. సుమంత్‌కు పెళ్లి శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేక బహుమతి పంపాడు. ఇందులో ఓ పుష్పగుచ్ఛంతో పాటు పట్టు వస్త్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. "కొత్త జీవితాన్ని ఆరంభించిన నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభాస్‌ బొకేతో పాటు కానుకలు పంపాడు" అని చెప్తూ ఎమ్‌ఎస్‌ రాజు ఈ గిఫ్ట్‌ ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

కాగా నిర్మాతగా ఎమ్‌ఎస్‌ రాజు వర్షం సినిమాతో ప్రభాస్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌నిచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పౌర్ణమి సినిమాను కూడా ఎమ్‌ఎస్‌ రాజే నిర్మించాడు. ఈ రెండు సినిమాలు ప్రభాస్‌ సినీ కెరీర్‌లోనే ప్రత్యేకమైనవి కావడం విశేషం.

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement