Deepika Padukone charged a whopping amount for Project K with Prabhas - Sakshi
Sakshi News home page

Deepika Padukone: ప్రభాస్ చిత్రంలో దీపికా పదుకొణె.. రెమ్యూనరేషన్‌ ఎన్ని కోట్లంటే.!

Published Tue, Mar 7 2023 3:05 PM | Last Updated on Tue, Mar 7 2023 3:51 PM

Deepika Padukone charged Big amount for Prabhas starrer Project K - Sakshi

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరలవుతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణే భారీ రెమ్యూనరేషన్‌పై చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలో నటించేందుకు ఆమె రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. 

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్‌  పూర్తయిన ఈ సైన్స్‌ ఫిక్షన్ చిత్రంలో భారీగా ఎఫెక్ట్స్‌ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12, 2024న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.  

(ఇది చదవండి: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ లో కీలక మార్పులు.. మిక్కీ ఔట్‌!)

కాగా.. ప్రస్తుతం దీపికా నటించిన పఠాన్ బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆమె ఆస్కార్‌ ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమంలో ప్రెజెంటర్‌గా అరుదైన అవకాశం దక్కించుకుంది. ఈనెల 12న లాస్‌ఎంజిల్స్‌లో జరగనున్న కార్యక్రమంలో దీపికా పాల్గొననున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement