విజయం కోసం జపం!.
విజయం కోసం జపం!.
Published Mon, Mar 10 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
నిర్మాతగా ఎమ్మెస్ రాజుది ఓ చరిత్ర. సుమంత్ ఆర్ట్స్‌పై శత్రువు, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు తీశారాయన. అయితే దర్శకునిగా మాత్రం ఎమ్మెస్ రాజు విజయాన్ని అందుకోలేకపోయారు!. ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఆయన ‘జపం’ చేస్తున్నారు. ‘జపం’ అంటే ఇంకేదో అనుకునేరు. ఆయన దర్శకునిగా సెలైంట్‌గా ఓ సినిమా మొదలైంది. ఆ సినిమా టైటిల్ ‘జపం’. విజయ్ కార్తీక్ అనే కొత్తబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘ఇష్క్’ చిత్రానికి పనిచేసిన సామల రమేష్ దీనికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంతో చిత్రీకరణ జరుగుతోంది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నారు ఎమ్మెస్ రాజు.
Advertisement
Advertisement