
ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీవేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి మంగళవారం కలిశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు.
ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీవేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.