కల్తీ.. బాబు సృష్టే | YS Jagan fired on CM Chandrababu | Sakshi
Sakshi News home page

కల్తీ.. బాబు సృష్టే

Published Sat, Sep 28 2024 5:25 AM | Last Updated on Sat, Sep 28 2024 3:58 PM

YS Jagan fired on CM Chandrababu

నోరు తెరిస్తే అబద్ధాలే 

శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడనేలేదని టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పినా నీచ రాజకీయం చేస్తూనే ఉన్నావ్‌  

సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్‌ జగన్‌  

ఆ ట్యాంకర్లను రిజెక్ట్‌ చేశామని జూలై 23న, సెప్టెంబర్20న ఈవో రెండు సార్లు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు

అయినా నీ దుర్మార్గ రాజకీయం కోసం లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అపవిత్రం చేశావ్‌ 

రిజెక్ట్‌ చేసిన ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని అసలు వాడలేదని ప్రభుత్వానికిచ్చిన నివేదికలోనూ చాలా స్పష్టంగా ఉంది 

అన్నీ తెలిసినా.. జరగని విషయం జరిగినట్లుగా.. కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అబద్ధాలు చెబుతున్నావ్‌ 

తిరుమల పవిత్రతను, ప్రసాదాన్ని నీ రాజకీయం కోసం అపవిత్రం చేశావ్‌ 

నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని నోటీసులిస్తావ్‌.. మళ్లీ అదేమీలేదని బుకాయిస్తావ్‌ 

నా పర్యటనను అడ్డుకోవటానికి పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్లను రప్పిస్తావ్‌ 

మా పార్టీ నేతలకు అక్రమ నోటీసులు.. అరెస్టు చేస్తామని బెదిరిస్తావ్‌ 

ఇలాంటి రాక్షస రాజ్యాన్ని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ చూడలేదు 

తిరుమల లడ్డూ విషయంలో నీ పాపాలు బయటకు రావడంతో టాపిక్‌ డైవర్షన్‌ కోసం డిక్లరేషన్‌ అంటున్నావ్‌ 

నా మతం, కులం ఏమిటో ఈ రాష్ట్రానికి, దేశానికి తెలియదా? 

సీఎంలుగా నేను, మా నాన్న పదేళ్లు శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించాం 

నా పాదయాత్రకు ముందు, తరువాత కూడా స్వామివారిని దర్శించుకున్నా.. కాలి నడకన తిరుమలకు వెళ్లా 

టాపిక్‌ డైవర్ట్‌ కాకూడదనే నేను తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నా..

చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆయనను వేలెత్తి చూపించడం మొదలైంది. ఈ నేపథ్యంలో లడ్డూ టాపిక్‌పై చంద్రబాబు చేసిన తప్పును ప్రశి్నంచడం మొదలుపెట్టారు. వారికి వాస్తవాలు తెలియడంతో టాపిక్‌ డైవర్షన్‌ కోసం డిక్లరేషన్‌ అంటున్నాడు.  

నేను గుడికి వెళ్లలేకపోయినా ఫరవాలేదు. కానీ చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన పార్టీ తరపున మీ ఊళ్లలో పూజలు చేయండి. తప్పు చేసింది మేం కాదు.. చంద్రబాబు అని వేడుకోండి. ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబుపై చూపమని వేడుకోమని కోరుతున్నా. వైఎస్సార్‌సీపీ అభిమానులే కాదు.. రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించే ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.  – మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడనేలేదని టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పినా సీఎం చంద్ర­బాబు రాజకీయం చేస్తూనే ఉన్నారని.. ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. 

ఆ నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్‌ చేసి సరఫరాదారులకు షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చామని.. వాటిలో వనస్పతి ఆయిల్‌ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్‌ క్లియర్‌గా జూలై 23న, సెప్టెంబర్‌ 20న ఈవో రెండుసార్లు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పినా నీ నీచ రాజకీయం కోసం లడ్డూల తయారీలో జంతు­వుల కొవ్వు కలిసిందంటూ స్వామివారిని అపవిత్రం చేశావ్‌.. అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రిజెక్ట్‌ చేసిన ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని అసలు వాడలేదని ప్రభుత్వానికిచ్చిన నివేదికలోనూ చాలా స్పష్టంగా ఉందన్నారు. 

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సాక్ష్యాధారా­లతో కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...



తప్పు చేయలేని విధంగా రొబస్ట్‌ విధానం.. 
‘తిరుమలకు సరఫరా చేసే నెయ్యికి సంబంధించి రొబస్ట్‌ (పకడ్బందీ) విధానం ఉంటుంది. నెయ్యి సరఫరాదారులు ప్రతి ట్యాంకర్‌కు ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌) సర్టిఫై చేసిన క్వాలిటీ సర్టిఫికెట్‌ తేవాలి. అలా వచ్చిన నెయ్యిని కూడా ప్రతి ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్‌ అయితేనే ట్యాంకర్‌ను ముందుకు పంపుతారు. ఒక్క టెస్టు ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను తిరిగి వెనక్కి పంపిస్తారు.

 2014–19 మధ్యచంద్ర­బాబు హయాంలో 14 నుంచి 15 ట్యాంకర్లు అలా వెనక్కి వెళ్లాయి. మా ప్రభుత్వ హయాంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. అంటే ఎవరూ తప్పు చేయలేని విధంగా అక్కడ రొబస్ట్‌ విధానం ఉంది. ఏ సరుకులైనా సరే క్వాలిటీ టెస్టులో ఫెయిల్‌ అయితే వెనక్కు పంపిస్తారు’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

‘తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని ఎవరైతే అబద్ధాలతో అవమానించి అగౌరవపర్చాడో.. లడ్డూపై దుష్ప్రచారం చేశాడో.. ఆధారాలతో సహా కనిపి­స్తోంది. చంద్ర­బాబు చేసిన ఈ పాపం కడగబ­డాలి. అది రాష్ట్ర ప్రజల మీదకు రావొద్దు. పాపం చేసిన చంద్రబాబు మీదే కట్టడి కావాలి. దాని కోసమే టాపిక్‌ డైవర్ట్‌ కాకూడదన్న ఉద్దేశంతో వెంకటేశ్వర­స్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా నా పర్యటనను వాయిదా వేసుకున్నా’ అని పేర్కొన్నారు. 

వాడని నెయ్యి.. తయారుకాని లడ్డూ
టీటీడీ ట్రస్ట్‌ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్‌ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. జూన్‌ 12, జూన్‌ 21, జూన్‌ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్‌ అయి ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు. ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి టీటీడీ టెస్టుల్లో ఫెయిల్‌ కావడంతో వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. 

సాధారణంగా మరోసారి ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు పంపి­స్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌)కి పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్‌పై ఎన్‌డీడీబీ జూలై 23న రిపోర్ట్‌ పంపింది. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. 

అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చారు. మరి ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా.. ఆ నెయ్యిని వాడారని రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు? (చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నియ­మించిన టీటీడీ ఈవో నెయ్యి నాణ్యత గురించి జూలై 23న ఏమన్నారో వీడియోను ప్రదర్శించారు). ఆ నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్‌ చేశాం. 

షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్‌ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్‌ క్లియర్‌గా ఈవో చెప్పినా... రెండు నెలల తర్వాత చంద్రబాబు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారో చూడండి (ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు). అన్నీ తెలిసినా.. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని.. లడ్డూలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.

టీడీపీ ఆఫీస్‌లో కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌
చంద్రబాబు సెప్టెంబరు 18న ఆరోపణలు చేస్తే ఆ మర్నాడే.. అంటే సెప్టెంబరు 19న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేశారు. నిజానికి అది కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో రిలీజ్‌ చేశారు. ఆ వెంటనే మర్నాడు అంటే సెప్టెంబరు 20 టీటీడీ ఈవో మళ్లీ ఏం మాట్లాడారో చూద్దాం.. (ఆ వీడియోను ప్రదర్శించారు). 

ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. అంతే కాకుండా సెప్టెంబరు 22న ఈవో స్వయంగా సంతకం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు (అందులోని అంశాలు చదివి వినిపించారు). కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కు పంపాం.. ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చాం.. ఎన్‌డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. మరి దాన్ని అంతకు ముందే టీడీపీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్‌ చేశారు.

అది ఎలా అపవిత్రత కాదా?
మళ్లీ సెప్టెంబరు 22న మీడియాతో మాట్లాడిన చంద్ర­బాబు అవే పచ్చి అబద్ధాలు వల్లించారు. కల్తీ నెయ్యి వాడారని చెప్పారు. స్వామివారి ప్రసాదం విశి­ష్టతను, తిరుమల తిరుపతి ప్రతిష్టను, శ్రీ వెంకటే­శ్వరస్వామివారి ప్రసాదం పేరు ప్రఖ్యాతులను రాజ­కీయ లబ్ధి కోసం ఇలా అబద్ధాలతో తగ్గించడం, కుట్ర పూరితంగా వ్యవహరించడం అపవిత్రత కాదా?

ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ కచ్చితమైనది కాదు
పోనీ.. ఆ ఎన్‌డీడీబీ రిపోర్టు అయినా కచ్చితమైందా? అని చూస్తే ఆ రిపోర్టులో వాళ్లే డిస్‌క్లెయిమర్‌ రాశారు. ‘నెయ్యిలో ఉండాల్సిన స్టాండర్డ్‌ వాల్యూ కన్నా శాంపిల్స్‌లోని స్టాండర్డ్‌ వాల్యూస్‌లో డీవియేషన్స్‌ ఉన్నాయి. అయినా ఈ పరిస్థితుల్లో ఒక ఫాల్స్‌ పాజిటివ్‌ ఫలితం కూడా రావొచ్చు. (ఆ పరిస్థితులు ఏమిటంటే అని వివరిస్తూ పాల సేకరణ, ఆవులు, వాటికి అందించే దాణా గురించి ప్రస్తావించారు). అలాగే ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు, అవి సరిగ్గా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.



పచ్చి అబద్ధాలు... అపవిత్రం కాదా?
ఇవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని అబద్ధాలా­డుతున్నారు. ప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరిలో అనుమానపు బీజాలు రేకెత్తించడం దుర్మార్గం కాదా? నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర­స్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నావు చంద్రబాబూ! స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తున్నావ్‌. జరగనిది జరిగినట్లుగా.. జంతు­వుల కొవ్వుతో ప్రసాదం తయారు చేసినట్లుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నావు. ఇది ధర్మమేనా?

మీ హయాంలో ఎందుకు వాడలేదు?
నందిని బ్రాండ్‌ ఎందుకు వాడడం లేదని అంటున్నారు. మరి గతంలో చంద్రబాబు పాలన సమయంలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కేఎంఎఫ్‌కు చెందిన నందిని బ్రాండ్‌ నెయ్యి ఎందుకు లేదు? అప్పుడు కూడా టెండర్లు పిలిచారు కదా? 

అప్పుడు ఇంత కంటే తక్కువ ధరకే..
రూ.320కి కిలో నెయ్యి ఎలా వస్తుందని చంద్రబాబు అంటారు. మరి చంద్రబాబు  2014–19 మధ్య నెయ్యిని ఏ ధరకు సేకరించారు? ఇప్పుడు కూడా అదే క్వాలిటీ నెయ్యి కదా? దశాబ్దాలుగా అదే క్వాలిటీ. అదే నెయ్యి. చంద్రబాబు హయాంలో 2015లో కిలో నెయ్యి రూ.276కి కొన్నారు. అదే 2019 జనవరిలో కిలో ఆవు నెయ్యిని రూ.324కు కొన్నారు. మరి ఇక్కడ రూ.320కి కొంటే తప్పేం జరిగింది?

దశాబ్దాల ఆనవాయితీ..
తిరుమలలో లడ్డూల తయారీ కోసం నెయ్యి కొనుగోలు కార్యక్రమం దశాబ్దాలుగా జరుగుతోంది. ఆర్నెళ్లకు ఒకసారి ఈ–టెండర్‌ పిలుస్తారు. అర్హులు బిడ్‌ వేస్తారు. ఎల్‌–1 గా వచ్చిన వారికి టెండర్‌ ఖరారు చేస్తారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. ఎల్‌–1గా వచ్చిన వారికి కూడా పూర్తి టెండర్‌ ఖరారు చేయరు. 65 శాతం వారికిచ్చి మిగతా వారిని కూడా రేటు తగ్గించాలని సూచించి వారికి టెండర్‌ ఇస్తారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. 

తిరుపతి లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ టేస్ట్‌ మరెక్కడా ఉండదు. తాము సూచించిన ప్రముఖులను టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించాలని కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా రికమెండ్‌ చేస్తారు. అలాంటి ప్రముఖులతో బోర్డు ఏర్పాటవుతుంది. వారంతా దేవుడికి ఇంకా సేవ చేయాలని, భక్తులకు మంచి చేయాలని నిర్ణయాలు 
తీసుకుంటారు.

ఇది రాక్షస రాజ్యం కాదా?
» చంద్రబాబు చేసిన పాపం కడగబడాలి
»  అందుకే పూజలు చేయమని అందరినీ వేడుకుంటున్నా
‘రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది.. దేవుడిని దర్శించుకునే కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షస రాజ్యాన్ని రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా చూడలేదు’ అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. (తిరుమల వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఈ సందర్భంగా ఆయన చదివి వినిపించారు). ‘జగన్‌ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. 

ఆయన దేవుడిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్తుంటే.. మీకు పర్మిషన్‌ లేదు.. మీరు వెళ్తే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారు. దీనిపై అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి’ అని విజ్ఞప్తి చేశారు. ‘ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇది రాక్షస రాజ్యం కాదా? ఒకవైపు నన్ను వెళ్లనివ్వకుండా చేసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెళ్లకుండా నోటీసులు ఇస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారు. ఇది ఆ పార్టీ నాయకత్వానికి తెలుసో? లేదో? వేల మంది పోలీసులను మోహరించారు. టాపిక్‌ డైవర్షన్‌ కోసం ఎందుకింద ఆరాటం?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు. 



ప్రతి గుడిలో పూజలు చేయండి..
చంద్రబాబు చేసిన పాపం వల్ల వెంకటే­శ్వర­స్వామికి కోపం వచ్చి రాష్ట్రంపై చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి. ఎందుకంటే జరి­గింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలుచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలు
పంపిణీ చేసినట్లుగా పచ్చి అబద్ధాలాడుతూఇంత ఘోరం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరు­తున్నా. పూజలు చేయమని వేడుకుంటున్నా.

మీ హయాం అంతా అవే రేట్లకు కొన్నారు. మరి ఇప్పుడు కూడా అవే ధరలు. చంద్రబాబు తన హెరిటేజ్‌ డెయిరీ కోసం, పాలు కార్టల్‌ ఫామ్‌ చేసి, నెయ్యి రేట్లుపెంచేసి, ఆ కార్టల్‌లో చంద్రబాబు­నాయుడు, హెరిటేజ్‌ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో, కొత్తగా రేట్లు పెంచడం కోసం మాట్లాడుతు­న్నాడు. అదే క్వాలిటీ నెయ్యి. అవే స్పెసిఫికేషన్స్‌. అప్పుడు.. ఇప్పుడూ ఒకటే. తిరుపతి లడ్డూ చాలా టేస్టుగా ఉంటుందని గొప్పగా చెప్పుకుంటాం. ఆ లడ్డూ అప్పుడూ.. ఇప్పుడూ ఒకటే. – వైఎస్‌ జగన్‌

డైవర్షన్‌ పాలిటిక్స్‌..
తన 100 రోజుల పాలన గురించి ప్రజల దృష్టి మళ్లించేందుకు లడ్డూల టాపిక్‌ తెచ్చారు. గుడి పవిత్రత దెబ్బతీస్తూ అడ్డంగా దొరికి­పోయేసరికి లడ్డూల టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్‌ అంశాన్ని తెచ్చి రాజ­కీయం చేస్తున్నారు. తిరుమల పవిత్రత, స్వామివారి ప్రసాదం విశిష్టత, దేవస్థానం పేరు ప్రఖ్యాతులను రాజకీయ దుద్బుద్ధితో రచ్చకీడ్చి రాద్ధాంతం చేశారు. 

జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారైనట్టుగా.. ఒక జరగని విషయాన్ని జరిగినట్లుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా.. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అబద్ధాలాడుతూ, అసత్యాలు పలుకుతూ స్వామి వారి పేరు ప్రఖ్యాతులను, తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమాన్ని సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రే చేస్తుంటే ఇంత కంటే దారుణం, అధర్మం ఎక్కడైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు ఏ రకంగా అబద్ధాలు చెప్పి రెక్కలు కట్టాడ­నేది ఆధారాలతో చూపిస్తా. దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు.. దేశ ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

టాపిక్‌ డైవర్షన్‌ కోసమే డిక్లరేషన్‌
» వైఎస్సార్, జగన్‌ ఇవాళ ఏమైనా కొత్తా?
» స్వామివారికి పదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించాం
»  నా పాదయాత్ర తరువాత స్వామిని దర్శించుకున్నాకే ఇంటికి వెళ్లా
సీఎంగా వరసగా 5 ఏళ్లు స్వామివారికి భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించాను కదా? ఎన్నోసార్లు స్వామి వారిని దర్శించుకున్నా. తొలిసారి ఎవరైనా వెళ్తుంటే అడగొచ్చు. కానీ 10, 11 సార్లు వెళ్లిన తరువాత.. ఈరోజు నేను తిరుపతి వెళ్తానంటే అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటి?. డిక్లరేషన్‌ అడగడం ఏమిటి? మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు నోటీసులు పంపడం ఏమిటి?’’ అని వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఆయన్ను వేలెత్తి చూపుతుండటంతో టాపిక్‌ డైవర్షన్‌ కోసమే డిక్లరేషన్‌ అంటున్నాడు. జగన్‌ ఇవాళ ఏమైనా కొత్తనా? రాజశేఖర్‌రెడ్డిగారు కొత్తనా? ఆయన ఏమిటో తెలియదా? నా మతం ఏమిటో రాష్ట్రంలో, దేశంలో తెలియదా? నా కులం ఏమిటో తెలియదా? రాజశేఖర్‌రెడ్డిగారు సీఎంగా 5 ఏళ్లు వరుసగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 

నేనూ గతంలో చాలాసార్లు వెళ్లాను కదా! సీఎం కాక ముందు కూడా వెళ్లాను కదా! అంతెందుకు.. నా పాదయాత్ర మొదలుపెట్టే ముందు కూడా స్వామివారిని దర్శించుకున్నా. 3,648 కిలోమీటర్ల పాదయాత్రకు ముందు, ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా. తిరుపతి నుంచి కాలి నడ­కన కొండ ఎక్కా. స్వామివారిని దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లా. అప్పుడు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం.  – వైఎస్‌ జగన్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement