laddu manufacturing
-
కల్తీ.. బాబు సృష్టే
చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆయనను వేలెత్తి చూపించడం మొదలైంది. ఈ నేపథ్యంలో లడ్డూ టాపిక్‌పై చంద్రబాబు చేసిన తప్పును ప్రశి్నంచడం మొదలుపెట్టారు. వారికి వాస్తవాలు తెలియడంతో టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నాడు. నేను గుడికి వెళ్లలేకపోయినా ఫరవాలేదు. కానీ చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన పార్టీ తరపున మీ ఊళ్లలో పూజలు చేయండి. తప్పు చేసింది మేం కాదు.. చంద్రబాబు అని వేడుకోండి. ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబుపై చూపమని వేడుకోమని కోరుతున్నా. వైఎస్సార్సీపీ అభిమానులే కాదు.. రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించే ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడనేలేదని టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పినా సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తూనే ఉన్నారని.. ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఆ నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి సరఫరాదారులకు షోకాజ్ నోటీస్ ఇచ్చామని.. వాటిలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్ క్లియర్‌గా జూలై 23న, సెప్టెంబర్ 20న ఈవో రెండుసార్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పినా నీ నీచ రాజకీయం కోసం లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ స్వామివారిని అపవిత్రం చేశావ్.. అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని అసలు వాడలేదని ప్రభుత్వానికిచ్చిన నివేదికలోనూ చాలా స్పష్టంగా ఉందన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సాక్ష్యాధారాలతో కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...తప్పు చేయలేని విధంగా రొబస్ట్ విధానం.. ‘తిరుమలకు సరఫరా చేసే నెయ్యికి సంబంధించి రొబస్ట్ (పకడ్బందీ) విధానం ఉంటుంది. నెయ్యి సరఫరాదారులు ప్రతి ట్యాంకర్‌కు ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబరేటరీస్) సర్టిఫై చేసిన క్వాలిటీ సర్టిఫికెట్ తేవాలి. అలా వచ్చిన నెయ్యిని కూడా ప్రతి ట్యాంకర్ నుంచి శాంపిల్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ట్యాంకర్‌ను ముందుకు పంపుతారు. ఒక్క టెస్టు ఫెయిల్ అయినా ట్యాంకర్‌ను తిరిగి వెనక్కి పంపిస్తారు. 2014–19 మధ్యచంద్రబాబు హయాంలో 14 నుంచి 15 ట్యాంకర్లు అలా వెనక్కి వెళ్లాయి. మా ప్రభుత్వ హయాంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. అంటే ఎవరూ తప్పు చేయలేని విధంగా అక్కడ రొబస్ట్ విధానం ఉంది. ఏ సరుకులైనా సరే క్వాలిటీ టెస్టులో ఫెయిల్ అయితే వెనక్కు పంపిస్తారు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని ఎవరైతే అబద్ధాలతో అవమానించి అగౌరవపర్చాడో.. లడ్డూపై దుష్ప్రచారం చేశాడో.. ఆధారాలతో సహా కనిపిస్తోంది. చంద్రబాబు చేసిన ఈ పాపం కడగబడాలి. అది రాష్ట్ర ప్రజల మీదకు రావొద్దు. పాపం చేసిన చంద్రబాబు మీదే కట్టడి కావాలి. దాని కోసమే టాపిక్ డైవర్ట్ కాకూడదన్న ఉద్దేశంతో వెంకటేశ్వరస్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా నా పర్యటనను వాయిదా వేసుకున్నా’ అని పేర్కొన్నారు. వాడని నెయ్యి.. తయారుకాని లడ్డూటీటీడీ ట్రస్ట్ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్ అయి ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు. ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి టీటీడీ టెస్టుల్లో ఫెయిల్ కావడంతో వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. సాధారణంగా మరోసారి ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు మైసూర్‌లోని సీఎఫ్టీఆర్ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)కు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్‌లోని ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్)కి పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్‌పై ఎన్డీడీబీ జూలై 23న రిపోర్ట్ పంపింది. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. మరి ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా.. ఆ నెయ్యిని వాడారని రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు? (చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నియమించిన టీటీడీ ఈవో నెయ్యి నాణ్యత గురించి జూలై 23న ఏమన్నారో వీడియోను ప్రదర్శించారు). ఆ నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం. షోకాజ్ నోటీస్ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఈవో చెప్పినా... రెండు నెలల తర్వాత చంద్రబాబు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారో చూడండి (ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు). అన్నీ తెలిసినా.. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని.. లడ్డూలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.టీడీపీ ఆఫీస్‌లో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్చంద్రబాబు సెప్టెంబరు 18న ఆరోపణలు చేస్తే ఆ మర్నాడే.. అంటే సెప్టెంబరు 19న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఎన్డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. నిజానికి అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో రిలీజ్ చేశారు. ఆ వెంటనే మర్నాడు అంటే సెప్టెంబరు 20 టీటీడీ ఈవో మళ్లీ ఏం మాట్లాడారో చూద్దాం.. (ఆ వీడియోను ప్రదర్శించారు). ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. అంతే కాకుండా సెప్టెంబరు 22న ఈవో స్వయంగా సంతకం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు (అందులోని అంశాలు చదివి వినిపించారు). కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కు పంపాం.. ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చాం.. ఎన్డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. మరి దాన్ని అంతకు ముందే టీడీపీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్ చేశారు.అది ఎలా అపవిత్రత కాదా?మళ్లీ సెప్టెంబరు 22న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు అవే పచ్చి అబద్ధాలు వల్లించారు. కల్తీ నెయ్యి వాడారని చెప్పారు. స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి ప్రతిష్టను, శ్రీ వెంకటేశ్వరస్వామివారి ప్రసాదం పేరు ప్రఖ్యాతులను రాజకీయ లబ్ధి కోసం ఇలా అబద్ధాలతో తగ్గించడం, కుట్ర పూరితంగా వ్యవహరించడం అపవిత్రత కాదా?ఎన్డీడీబీ రిపోర్ట్ కచ్చితమైనది కాదుపోనీ.. ఆ ఎన్డీడీబీ రిపోర్టు అయినా కచ్చితమైందా? అని చూస్తే ఆ రిపోర్టులో వాళ్లే డిస్‌క్లెయిమర్ రాశారు. ‘నెయ్యిలో ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా శాంపిల్స్‌లోని స్టాండర్డ్ వాల్యూస్‌లో డీవియేషన్స్ ఉన్నాయి. అయినా ఈ పరిస్థితుల్లో ఒక ఫాల్స్ పాజిటివ్ ఫలితం కూడా రావొచ్చు. (ఆ పరిస్థితులు ఏమిటంటే అని వివరిస్తూ పాల సేకరణ, ఆవులు, వాటికి అందించే దాణా గురించి ప్రస్తావించారు). అలాగే ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు, అవి సరిగ్గా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.పచ్చి అబద్ధాలు... అపవిత్రం కాదా?ఇవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని అబద్ధాలాడుతున్నారు. ప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరిలో అనుమానపు బీజాలు రేకెత్తించడం దుర్మార్గం కాదా? నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నావు చంద్రబాబూ! స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తున్నావ్. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వుతో ప్రసాదం తయారు చేసినట్లుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నావు. ఇది ధర్మమేనా?మీ హయాంలో ఎందుకు వాడలేదు?నందిని బ్రాండ్ ఎందుకు వాడడం లేదని అంటున్నారు. మరి గతంలో చంద్రబాబు పాలన సమయంలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కేఎంఎఫ్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి ఎందుకు లేదు? అప్పుడు కూడా టెండర్లు పిలిచారు కదా? అప్పుడు ఇంత కంటే తక్కువ ధరకే..రూ.320కి కిలో నెయ్యి ఎలా వస్తుందని చంద్రబాబు అంటారు. మరి చంద్రబాబు 2014–19 మధ్య నెయ్యిని ఏ ధరకు సేకరించారు? ఇప్పుడు కూడా అదే క్వాలిటీ నెయ్యి కదా? దశాబ్దాలుగా అదే క్వాలిటీ. అదే నెయ్యి. చంద్రబాబు హయాంలో 2015లో కిలో నెయ్యి రూ.276కి కొన్నారు. అదే 2019 జనవరిలో కిలో ఆవు నెయ్యిని రూ.324కు కొన్నారు. మరి ఇక్కడ రూ.320కి కొంటే తప్పేం జరిగింది?దశాబ్దాల ఆనవాయితీ..తిరుమలలో లడ్డూల తయారీ కోసం నెయ్యి కొనుగోలు కార్యక్రమం దశాబ్దాలుగా జరుగుతోంది. ఆర్నెళ్లకు ఒకసారి ఈ–టెండర్ పిలుస్తారు. అర్హులు బిడ్ వేస్తారు. ఎల్–1 గా వచ్చిన వారికి టెండర్ ఖరారు చేస్తారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. ఎల్–1గా వచ్చిన వారికి కూడా పూర్తి టెండర్ ఖరారు చేయరు. 65 శాతం వారికిచ్చి మిగతా వారిని కూడా రేటు తగ్గించాలని సూచించి వారికి టెండర్ ఇస్తారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. తిరుపతి లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ టేస్ట్ మరెక్కడా ఉండదు. తాము సూచించిన ప్రముఖులను టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించాలని కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా రికమెండ్ చేస్తారు. అలాంటి ప్రముఖులతో బోర్డు ఏర్పాటవుతుంది. వారంతా దేవుడికి ఇంకా సేవ చేయాలని, భక్తులకు మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు.ఇది రాక్షస రాజ్యం కాదా?» చంద్రబాబు చేసిన పాపం కడగబడాలి» అందుకే పూజలు చేయమని అందరినీ వేడుకుంటున్నా‘రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది.. దేవుడిని దర్శించుకునే కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షస రాజ్యాన్ని రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా చూడలేదు’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. (తిరుమల వెళ్లకుండా వైఎస్సార్సీపీ శ్రేణులకు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఈ సందర్భంగా ఆయన చదివి వినిపించారు). ‘జగన్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. ఆయన దేవుడిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్తుంటే.. మీకు పర్మిషన్ లేదు.. మీరు వెళ్తే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారు. దీనిపై అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి’ అని విజ్ఞప్తి చేశారు. ‘ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇది రాక్షస రాజ్యం కాదా? ఒకవైపు నన్ను వెళ్లనివ్వకుండా చేసి వైఎస్సార్సీపీ శ్రేణులు వెళ్లకుండా నోటీసులు ఇస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారు. ఇది ఆ పార్టీ నాయకత్వానికి తెలుసో? లేదో? వేల మంది పోలీసులను మోహరించారు. టాపిక్ డైవర్షన్ కోసం ఎందుకింద ఆరాటం?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు. ప్రతి గుడిలో పూజలు చేయండి..చంద్రబాబు చేసిన పాపం వల్ల వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రంపై చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి. ఎందుకంటే జరిగింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలుచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలుపంపిణీ చేసినట్లుగా పచ్చి అబద్ధాలాడుతూఇంత ఘోరం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరుతున్నా. పూజలు చేయమని వేడుకుంటున్నా.మీ హయాం అంతా అవే రేట్లకు కొన్నారు. మరి ఇప్పుడు కూడా అవే ధరలు. చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం, పాలు కార్టల్ ఫామ్ చేసి, నెయ్యి రేట్లుపెంచేసి, ఆ కార్టల్‌లో చంద్రబాబునాయుడు, హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో, కొత్తగా రేట్లు పెంచడం కోసం మాట్లాడుతున్నాడు. అదే క్వాలిటీ నెయ్యి. అవే స్పెసిఫికేషన్స్. అప్పుడు.. ఇప్పుడూ ఒకటే. తిరుపతి లడ్డూ చాలా టేస్టుగా ఉంటుందని గొప్పగా చెప్పుకుంటాం. ఆ లడ్డూ అప్పుడూ.. ఇప్పుడూ ఒకటే. – వైఎస్ జగన్డైవర్షన్ పాలిటిక్స్..తన 100 రోజుల పాలన గురించి ప్రజల దృష్టి మళ్లించేందుకు లడ్డూల టాపిక్ తెచ్చారు. గుడి పవిత్రత దెబ్బతీస్తూ అడ్డంగా దొరికిపోయేసరికి లడ్డూల టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్ అంశాన్ని తెచ్చి రాజకీయం చేస్తున్నారు. తిరుమల పవిత్రత, స్వామివారి ప్రసాదం విశిష్టత, దేవస్థానం పేరు ప్రఖ్యాతులను రాజకీయ దుద్బుద్ధితో రచ్చకీడ్చి రాద్ధాంతం చేశారు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారైనట్టుగా.. ఒక జరగని విషయాన్ని జరిగినట్లుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా.. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అబద్ధాలాడుతూ, అసత్యాలు పలుకుతూ స్వామి వారి పేరు ప్రఖ్యాతులను, తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమాన్ని సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రే చేస్తుంటే ఇంత కంటే దారుణం, అధర్మం ఎక్కడైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు ఏ రకంగా అబద్ధాలు చెప్పి రెక్కలు కట్టాడనేది ఆధారాలతో చూపిస్తా. దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు.. దేశ ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నా.టాపిక్ డైవర్షన్ కోసమే డిక్లరేషన్» వైఎస్సార్, జగన్ ఇవాళ ఏమైనా కొత్తా?» స్వామివారికి పదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించాం» నా పాదయాత్ర తరువాత స్వామిని దర్శించుకున్నాకే ఇంటికి వెళ్లాసీఎంగా వరసగా 5 ఏళ్లు స్వామివారికి భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించాను కదా? ఎన్నోసార్లు స్వామి వారిని దర్శించుకున్నా. తొలిసారి ఎవరైనా వెళ్తుంటే అడగొచ్చు. కానీ 10, 11 సార్లు వెళ్లిన తరువాత.. ఈరోజు నేను తిరుపతి వెళ్తానంటే అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటి?. డిక్లరేషన్ అడగడం ఏమిటి? మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు నోటీసులు పంపడం ఏమిటి?’’ అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఆయన్ను వేలెత్తి చూపుతుండటంతో టాపిక్ డైవర్షన్ కోసమే డిక్లరేషన్ అంటున్నాడు. జగన్ ఇవాళ ఏమైనా కొత్తనా? రాజశేఖర్‌రెడ్డిగారు కొత్తనా? ఆయన ఏమిటో తెలియదా? నా మతం ఏమిటో రాష్ట్రంలో, దేశంలో తెలియదా? నా కులం ఏమిటో తెలియదా? రాజశేఖర్‌రెడ్డిగారు సీఎంగా 5 ఏళ్లు వరుసగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నేనూ గతంలో చాలాసార్లు వెళ్లాను కదా! సీఎం కాక ముందు కూడా వెళ్లాను కదా! అంతెందుకు.. నా పాదయాత్ర మొదలుపెట్టే ముందు కూడా స్వామివారిని దర్శించుకున్నా. 3,648 కిలోమీటర్ల పాదయాత్రకు ముందు, ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా. తిరుపతి నుంచి కాలి నడకన కొండ ఎక్కా. స్వామివారిని దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లా. అప్పుడు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం. – వైఎస్ జగన్ -
టీడీపీ విష ప్రచారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బ తీయాలనే దురుద్దేశంతో తిరుమల శ్రీవారి పవిత్రతను మంటగలుపుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ.. పనిగట్టుకుని టీడీపీ విష ప్రచారం చేస్తోందని సోషల్ మీడియా సాక్షిగా బట్టబయలైంది. ‘సుమారు రెండు మూడేళ్ల నుంచి తిరుపతి లడ్డూ తిన్న ప్రతిసారి అమ్మ అనారోగ్యం పాలవుతోంది. ఎక్కువగా తిరుపతి లడ్డూ తినొద్దని మాకు చెబుతోంది. ప్రతి చోటా పరిశుభ్రంగా లేదంటూ వందల సార్లు ఆమె ఫిర్యాదులు చేస్తుండటంతో ఆమెకు మతి స్థిమితం బాగోలేదని మేం అనుకున్నాం. ఇప్పుడు లడ్డూపై వచ్చిన వివాదాన్ని బట్టి చూస్తే.. తిరుపతి లడ్డూ విషయంలో మా అమ్మ చెప్పింది నిజమే అన్పిస్తోంది’ అనే అర్థం వచ్చేలా ఇంగ్లిష్‌లో ఒకే రకమైన పోస్టును దేశవ్యాప్తంగా వందల మంది ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పక్కా ప్రణాళికతోనే జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూలు తయారుచేశారని ఆరోపించారా? వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీయడమే ఆ ప్రణాళిక లక్ష్యమా? రాజకీయ స్వార్థం కోసం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని అభాసుపాలు చేసి.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే దుస్సాహసానికి ఒడిగట్టారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు శ్రీవారి భక్తులు, టీటీడీ అధికార వర్గాలు, రాజకీయ విశ్లేషకులు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓ శ్యామలరావు శుక్రవారం మీడియాతో వెల్లడించిన వివరాలతో పాటు ఆయన మాట మార్చిన వైనంతో సీఎం చంద్రబాబు కుట్ర బట్టబయలైందని వారు స్పష్టంచేస్తున్నారు. టీటీడీ ఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ కుట్ర..టీటీడీ ఈఓగా శ్యామలరావును జూన్ 14న చంద్రబాబు నియమించారు. అదే రోజున సీఎంను తాను కలిసినట్లు తిరుమలలో శుక్రవారం ఈఓ మీడియాకు వెల్లడించారు. తిరుమలలో ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న ముడిసరుకుల్లో నాణ్యతలేదని.. జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని వాడుతున్నారని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక మూడో రోజే.. పైగా ల్యాబ్ రిపోర్టు రాకముందే భక్తుల మనోభావాలతో చెలగాటమాడి వైఎస్సార్సీపీని దెబ్బతీసే కుట్రకు చంద్రబాబు తెరతీసినట్లు స్పష్టమవుతోంది. తొలుత వెజిటబుల్ ఫ్యాట్స్ కలిశాయంటూ..నిజానికి.. నెయ్యి సరఫరాకు 2024, మార్చి 12న టీటీడీ టెండర్లు పిలిచింది. అదే ఏడాది మే 8న టెండరును టీటీడీ ఖరారు చేసి 15న టీటీడీ ఆర్డర్ ఇచ్చింది. నిబంధనల మేరకు సరఫరా సంస్థలు నెయ్యిని సరఫరా చేశాయి. ఇందులో జూలై 6న రెండు ట్యాంకర్లు.. జూలై 12న రెండు ట్యాంకర్ల నెయ్యి వచ్చింది. ఈ నెయ్యిని పరీక్షల కోసం ఎన్డీడీబీ (నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు) ల్యాబ్‌కు టీటీడీ పంపింది. వాటికి సంబంధించిన పరీక్షల నివేదికలను జూలై 23న టీటీడీకి ఎన్డీడీబీ అందజేసింది. అదేరోజున తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఈఓ.. ఒక సంస్థ సరఫరా చేసిన రెండు ట్యాంకర్ల నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని తేలిందని వెల్లడించారు. ఆ రెండు ట్యాంకర్లను సరఫరా సంస్థకు తిప్పి పంపి.. కల్తీ చేసిన నెయ్యి పంపినందుకు బ్లాక్‌లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు జారీచేశామని ఈఓ తెలిపారు.కుట్ర అమలుకు తెరతీసిన చంద్రబాబు..ఇదిలా ఉంటే.. కూటమి శాసనసభా పక్ష సమావేశం ఈనెల 18న మంగళగిరిలో సీఎం చంద్రబాబు నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ఆవు నెయ్యితో తయారుచేయాల్సిన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని ఉపయోగించారని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టించారంటూ జూన్ 14న రచించిన కుట్ర అమలుకు తెరతీశారు. దీనికి కౌంటర్‌గా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యినే తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించామని.. ఆలయ పవిత్రతను కాపాడామని.. చంద్రబాబు వేసిన నిందకు ఆయన కట్టుబడి ఉన్నట్లయితే శ్రీవారి పాదాల చెంత ప్రమాణానికి సిద్ధమా అంటూ టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి బుధ, గురువారం రెండ్రోజులూ సవాల్ విసిరి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని.. భక్తులకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టంచేశారు. దీంతో.. ఎన్డీడీబీ పరీక్ష నివేదికలు గురువారం టీడీపీ కార్యాలయంలో విడుదల చేయించారు. ఆ నివేదికలో కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనని వెల్లడవడంతో తాను తీసుకున్న గోతిలో చంద్రబాబు బొక్కబోర్లాపడినట్లయింది.ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి..మరోవైపు.. నిరాధారమైన ఆరోపణలతో తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసి.. తమ మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు, లోకేశ్‌లపై భక్తులు నిప్పులు చెరుగుతున్నారు. అలాగే, చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ హైకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమైంది. దీంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి నెయ్యి వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈఓ శ్యామలరావును ఆదేశించారు. ఈ క్రమంలోనే.. జూలై 23న వెల్లడించిన అంశాలకు భిన్నంగా శుక్రవారం తిరుమలలో ఈఓ మాట్లాడారు. వెజిటబుల్ ఫ్యాట్లతోపాటు జంతువుల కొవ్వు కూడా ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కలిసినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని చెప్పారు. ఆ నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపామన్నారు. అంటే.. గతంలోనే కాదు ఇప్పుడు కూడా కల్తీ నెయ్యిని శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించలేదని ఆయన చెప్పకనే చెప్పారు. -
తిరుమల లడ్డూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఒకవేళ సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే, విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. తద్వారా వాస్తవాల నిగ్గుతేల్చాలని కోరారు. ఈ అభ్యర్థనతో తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయనున్నా మని, దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి విషయంలోవాస్తవాలను తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని.. అందువల్ల నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. అందుకోసమే తాము ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారమే విచారిస్తామని, ఈలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.నాపై విజిలెన్స్ విచారణను కొట్టేయండి: వైవీటీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డానంటూ తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లను తనకు అందచేయకుండానే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వివరణలు కోరడాన్ని సవాలు చేస్తూ ఎంపీ, టీటీడీ పూర్వ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను కొట్టేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. టీటీడీ వ్యవహారాలపై విచారణ జరిపే పరిధి చట్ట ప్రకారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు లేదన్నారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, టీటీడీ ఈవోలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ విచారణ జరపనున్నారు. -
చంద్రబాబూ.. నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా?
చంద్రబాబుకు దేవుడి మీద భక్తి ఎప్పుడూ లేదు.. ఉండదు. నేను రాసి చెబుతున్నా. దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన, హీన మనసు కలిగిన వ్యక్తి చంద్రబాబు. టీటీడీకి ఏదైనా చెడు జరిగిందంటే అది చంద్రబాబు హయాంలోనే జరుగు తుంది. మిగతా ఎవరి హయాంలోనూ జరగదు. ఎందుకంటే చంద్రబాబుకు దేవుడంటే భక్తీ లేదు.. భయమూ లేదు. ‘రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ 5.. వీరంతా ఉన్మాదస్తులు.. ఉన్మాదంతో బాధపడుతున్నారు. రాజకీయంగా కొట్లాడాలనుకుంటే చెయ్.. బంగారంగా చెయ్.. మేమంతా ఆహ్వానిస్తాం. ప్రజలకు ఫలానా మంచి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చావ్. ఆ మంచి చేసి ప్రజల మన్ననలు పొందు. కానీ ఇవేం రాజకీయాలు..? ఒక అబద్ధాన్ని సృష్టించడం, దాన్ని అమ్మడం, ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద జల్లడం ఎంత వరకూ ధర్మం?– వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రతిష్టను దెబ్బ తీయడానికి తెగబడ్డారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఏ తప్పూ జరగకున్నా.. జరిగినట్లుగా అసత్య ప్రచారం చేస్తూ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ ఖ్యాతిని బజారుకీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలనే దుర్మార్గమైన మనస్తత్వం ప్రపంచంలో ఒక్క చంద్రబాబుకే ఉంటుందని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యిని వాడారంటూ దారుణమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడటం ధర్మమేనా? శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని నిలదీశారు. వంద రోజుల పాలన వైఫల్యాలపై.. సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేస్తున్న మోసాలపై ప్రజలు అడుగడుగునా నిలదీస్తారనే భయంతో దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు దుర్మార్గమైన కుట్ర చేశారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించడం (డైవర్షన్ పాలిటిక్స్)లో భాగంగానే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారంటూ దారుణమైన ఆరోపణ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. తిరుమల పవిత్రతను అపహాస్యం చేసే దుస్సాహసానికి పాల్పడిన వారిని శిక్షించే వరకూ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... నెయ్యి, ముడి సరుకుల సేకరణకు పక్కా వ్యవస్థ.. » తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాలు, లడ్డూ తయారీలో వినియోగించే నాణ్యమైన ఆవు నెయ్యి, ముడి సరుకులను సేకరించేందుకు టీటీడీలో గొప్ప వ్యవస్థ ఉంది. » టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కార్యక్రమం దశాబ్దాలుగా కొనసాగుతోంది. నెయ్యి సరఫరా కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తుంది. ఆ టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్టును టీటీడీ బోర్డు అప్పగిస్తుంది. ఇది టీటీడీలో సాధారణంగా జరిగే ప్రక్రియ. స్వామివారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి, ఇతర ముడిసరుకులను ఈ విధంగానే సేకరిస్తారు. » టీటీడీకి నెయ్యిని ట్యాంకర్లలో సరఫరా చేస్తారు. అలా సరఫరా చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యి టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు నాణ్యంగా ఉన్నట్లు సరఫరా సంస్థే ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ ల్యాబ్స్) ధ్రువీకరించిన సంస్థ నుంచి సర్టిఫికెట్ తేవాలి. ఆ సరి్టఫికెట్ ఆధారంగా ఆ ట్యాంకర్ నెయ్యిని టీటీడీ మార్కెటింగ్ అధికారి, సరఫరా సంస్థ ప్రతినిధి సమక్షంలో టీటీడీ మూడు శాంపిళ్లను తీసుకుని ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లతో వేర్వేరుగా పరీక్ష చేయిస్తుంది. ఆ మూడు పరీక్షల్లో ప్రమాణాల మేరకు నాణ్యంగా ఉన్నట్లు తేలితేనే ఆ నెయ్యి ట్యాంకర్‌ను ముందుకు అనుమతిస్తారు. ముడి సరుకుల సరఫరాలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. మూడు పరీక్షల్లో ఏ ఒక్క పరీక్షలోనైనా నెయ్యిగానీ ముడిసరుకుగానీ నాణ్యతగా లేదని తేలితే.. ఆ ట్యాంకర్ నెయ్యి, సరుకులు తెచ్చిన వాహనాన్ని సరఫరా సంస్థకే వెనక్కి పంపిస్తారు. » 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నాణ్యత లేకపోవడంతో 14–15 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారు. వైఎస్సార్సీపీ హయాంలో నాణ్యత లేకపోవడంతో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. రెండు నెలలుగా ఏం చేస్తున్నారు? ూ నెయ్యి నాణ్యతగా లేదని రిపోర్టు వచ్చిన శాంపిళ్లను జూలై 12న తీసుకున్నారు. అప్పుడు స్వయంగా చంద్రబాబే ముఖ్యమంత్రి. ఆయన సీఎంగా ఉండగా టీటీడీకి వచ్చిన నెయ్యి ట్యాంకర్ నుంచి శాంపిళ్లు తీసుకున్నారు. 3 పరీక్షలు అక్కడే చేశారు. అవి సరిగా రాలేదు కాబట్టే శాంపిళ్లను జూలై 17న ఎన్డీడీబీకి పంపించారు. జూలై 23న రిపోర్టు వచ్చింది. అందులో నాణ్యత లేదని వచ్చింది. ఆ రిపోర్టును టీటీడీ అధికారులు అప్పుడే ఎందుకు బయటపెట్టలేదు? రెండు నెలల నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారు? » చంద్రబాబు వంద రోజుల పరిపాలనపై ‘ఇది మంచి ప్రభుత్వం’ అంటూ ప్రకటనలు ఇస్తే.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏమైందంటూ ప్రజలు తిరగబడుతుండటంతో వారి దృష్టి మళ్లించేందుకు టాపిక్ డైవర్ట్ చేశారు. అందుకే జూలై 23న ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు తీసి దానికి వక్రభాష్యం చెబుతూ.. నోటికొచ్చినట్టు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. » నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) నుంచి 2 నెలల కిందట రిపోర్టు వస్తే దానిపై ఏ ఒక్క అధికారీ వివరణ ఇవ్వకపోగా ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో దానిని విడుదల చేయడం వెనుక కచ్చితంగా రాజకీయ దురుద్దేశం ఉంది. ఈ కుట్రపై ప్రధానమంత్రితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తాం. »ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులో ఏం కనిపిస్తోంది? స్టాండర్డ్ (ఎస్) వాల్యూ ఉండాలి. కానీ డీవియేషన్ ఉంది. అలా ఉంటే శాంపిల్ కంటెయిన్ ఫారిన్ ఫ్యాట్ (ఏమేం ఉండే వీలుందన్న అవకాశాలతో నివేదికలో పొందుపరిచిన వివరాలను ప్రస్తావించారు).హిందువుల ప్రతినిధులైతే చంద్రబాబుకు అక్షింతలు వేయండి..» బీజేపీ వాళ్లకు సగం తెలుసు. సగం తెలియదు. చంద్రబాబు పూర్తిగా అబద్ధాలు, మోసాల మనిíÙ. టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ, సీనియర్ మంత్రుల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ గురించి వారికి తెలియదా! తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. తప్పు చంద్రబాబు చేసి, దు్రష్పచారం చేశాడని తేలితే ఆయన మీద అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీకి ఉందా అని నేను అడుగుతున్నా. నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే హిందువుల ప్రతినిధులైతే.. శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేలా, భక్తుల మనోభావాలను కించపరిచేలా దుర్మార్గంగా మాట్లాడిన చంద్రబాబుకు చీవాట్లు పెట్టాలి. ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా? అంటూ చంద్రబాబుని బీజేపీ నేతలు గట్టిగా కడిగేయాలి. »వాస్తవాలు తెలియని వారిని తప్పుదోవ పట్టిస్తే ఎవరికైనా భావోద్వేగాలు పెరుగుతాయి. అలాంటివి చేయకూడని పనులు. చంద్రబాబు కావాలనే భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా ప్రక్రియ ఏమిటన్నది స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? » నేను చెప్పినవి.. మాట్లాడిన ప్రతి మాట నిజమా.. అబద్ధమా అన్నది మీరే (మీడియా) పరిశీలన చేయండి. నేను ప్రతి మాటా నిజమే మాట్లాడుతున్నా. మీ అందరికీ వారు చూపించింది, వినిపించింది.. ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తెచ్చిన దానికి తేడా గమనించండి. రాజకీయాలు ఇలా చేయడం ధర్మమా, న్యాయమా అని మీ మనస్సాక్షిని అడగండి. ఇది ధర్మం కాదు, న్యాయం కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే నేరుగా చేద్దాం.కేఎంఎఫ్‌కు వాళ్లెందుకు ఇవ్వలేదు..? కర్నాటక మిల్క్ ప్రొడ్యూసెస్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)కు ఉద్దేశ పూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. టీటీడీలో టెండర్లు పిలుస్తారు.. అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరు ఎల్–1గా నిలిస్తే వారికి నెయ్యి సరఫరా బాధ్యత అప్పగిస్తారు. ఇది పద్ధతి. ఇదే చంద్రబాబు హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు కేఎంఎఫ్ బ్రాండ్ ఎందుకు లేదని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు?టీటీడీ బోర్డుకు ఎంతో విశిష్టత..టీటీడీ బోర్డు చాలా విశిష్టమైనది. క్యాబినెట్ కూర్పు చేయడం సులభం. కానీ టీటీడీ బోర్డు కూర్పు చాలా కష్టం. టీటీడీ బోర్డులోకి సిఫారసు చేయాలని కేంద్ర మంత్రులు, చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నుంచి సైతం కోరతారు. ఆయా రాష్ట్రాల్లో విశిష్ట వ్యక్తులు, ప్రసిద్ధిచెందిన వారు బోర్డులో సభ్యులు అవుతారు. ఆ బోర్డు కూర్పు విశిష్టమైన వారితోనే ఉంటుంది. టీటీడీలో టెండర్ల ప్రక్రియను బోర్డు సభ్యులే రాటిఫై చేస్తారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జోక్యం ఉండదు. అటానమస్ బాడీగా (స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ) టీటీడీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ భగవంతుడికి మంచి చేయాలనే దృక్పథంతోనే బోర్డు మెంబర్లు పని చేస్తారు. అలాంటి బోర్డులో 45 సార్లు అయ్యప్పమాల ధరించి గురు స్వామి హోదా పొందిన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి లాంటి భక్తులను పెట్టాం. అబద్ధాలకు రెక్కలు కడుతూ.. టీటీడీకి నెయ్యిని సరఫరా చేసే ప్రతి ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్లు తీసుకుని వాటిలోని నాణ్యతను ల్యాబ్‌లో పరీక్షిస్తారు. పరీక్షల్లో నాణ్యత బాగుందని తేలితేనే లడ్డూ ప్రసాదంలో వినియోగించడానికి ఉపయోగిస్తారు. నాణ్యత లేదంటే సరఫరా సంస్థకే వెనక్కి పంపిస్తారు. ఇంత గొప్ప విధానం టీటీడీలో ఉన్నందుకు ప్రపంచానికి గొప్పగా చెప్పాల్సింది పోయి అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. అసలు వాస్తవంలో జరగని దానికి కట్టుకథలు అల్లి.. నాసిరకమైన పదార్థాలు, జంతు కొవ్వులతో తయారుచేసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని.. భక్తులకు పంపిణీ చేశారని.. వాటిని భక్తులు తినేశారని సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు చెప్పడం ధర్మమేనా?» ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయానికి అపవిత్రతను ఆపాదిస్తూ.. లడ్డూ తయారీ ప్రక్రియను అభాసుపాలు చేస్తుండటం దారుణం. మన గుడిని.. మన దేవుడిని మనమే తగ్గించుకోవడం అత్యంత దారుణం. ఇంతకంటే దారుణ పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. టీటీడీ ప్రతిష్టను పెంచింది మేమే..వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. స్వామివారి ప్రసాదాలు, లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యతను పెంచేందుకు అక్కడి ల్యాబ్స్‌ను పటిష్టపరిచాం. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన (సీఎఫ్టీఆర్ఐ) వారితో టీటీడీ అనుసంధానమైంది. అక్కడి నుంచి సీనియర్ ఉద్యోగులను నియమించి నాణ్యత, పారదర్శకతలో రాజీ లేకుండా వ్యవహరించాం. » వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీటీడీలో నవనీత సేవ ప్రారంభించాం. దీని కోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండపై ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశాం. » శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలను రెట్టింపు చేశాం. ప్రసాదాలు తయారు చేసే కార్మికులను క్రమబద్దికరించడంతో పాటు వారి జీతాలు పెంచాం. » చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే.. ఆలయాలను పునరుద్ధరించింది మేమే. అమరావతి, విశాఖపట్నం, భువనేశ్వర్, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, జమ్మూ కశ్మీర్, చెన్నైలో టీటీడీ ఆలయాలు నిర్మించింది మా హయాంలోనే. అమెరికాలోలోనూ ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. » భక్తులకు సేవలందిస్తున్న ఉద్యోగులకు తోడుగా నిలిచేందుకు 9 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చింది మేమే. టీటీడీలో పని చేస్తున్న వారికి సెంటు స్థలం ఇవ్వడానికి కూడా చంద్రబాబుకు ఏ పొద్దూ మనసు రాలేదు. » రాష్ట్రంలో మఠాధిపతులు అందరితో 3 సార్లు విద్వత్తు సదస్సులు జరగ్గా 2 సార్లు వైఎస్సార్ హయాంలో.. ఓ సారి మేం నిర్వహించాం. చంద్రబాబు హయాంలో మఠాధిపతులతో ఎప్పుడూ విద్వత్తు కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. -
లడ్డూ మాధుర్యానికి 75 ఏళ్లు
అమృత పదార్థంగా భక్తిరస మాధుర్యాన్ని పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డూ అమృతోత్సవాన్ని పూర్తి చేసుకుంది. మాధుర్యంలో సాటిలేని లడ్డూ నైవేద్యమంటే తిరుమలేశునికీ, ఆయన భక్తజనకోటికీ కూడా ప్రీతిపాత్రమైనది. 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించిన ట్టు చారిత్రక ఆధారం. అప్పటినుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారట. తొలుత పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలయ్యిందని చరిత్ర. అప్పట్లోనే శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆ రోజుల్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం(క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మరేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాదు. దాంతో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. 1940 నుంచే భక్తుల చేతికి లడ్డూ 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచారు. 1940 నుంచి బూందీని లడ్డూగా మార్చి భక్తులకు అందజేయటం ప్రారంభించారు. లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అనే పేరుతో పిలుస్తారు. 1950లో తొలిసారిగా టీటీడీ ధర్మకర్తల మండలి ఈ దిట్టం పరిమాణాలను ఖరారు చేసింది. ఆలయ అవసరాలతోపాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. ఒక లడ్డూ తయారీకి... భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీకి టీటీడీ రూ.30 దాకా ఖర్చుపెడుతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా 2015లో లెక్కలు వేశారు. ఇందులో భాగంగానే ఆలయ పోటులో దిట్టం ప్రకారం 5100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 803 కేజీల ముడి సరుకు వినియోగిస్తారు. ఇందులో ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు వినియోగిస్తారు. ఆలయంలో నిత్యం 900 కేజీల ఆవునెయ్యి లడ్డూల తయారీకే వాడతారు. టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు దక్కించుకోవటంలో 2009లో అప్పటి ఈవో కేవీ రమణాచారి కృషి చేశారు. రాయితీలడ్డూలపై రూ.60 కోట్లు భక్తుల కానుకలతో ధార్మిక సంస్థ మనుగడ సాగిస్తోంది. అదే భక్తులకు అందజేసే ఉచిత, రాయితీ ధరలతో ఇచ్చే లడ్డూల వల్ల ఏటా రూ.60 కోట్ల వ్యయాన్ని టీటీడీ భరిస్తోంది. నాలుగేళ్లకు ముందు సర్వదర్శనం, కాలినడకన వచ్చే దివ్యదర్శనం భక్తులు, అంగప్రదక్షిణం, వికలాంగులు, వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చే తల్లిదండ్రులు, శ్రీవారి సేవకులకు రూ.10 రాయితీ ధరతో రూ.20కి రెండు లడ్డూల చొప్పున అందిస్తున్నారు. ఇలా ఏటా సుమారుగా రూ.40 కోట్ల వరకు అదనంగా టీటీడీ ఖర్చు చేస్తోంది. ఇక సర్వదర్శనం, కాలిబాట దర్శనం కోసం వచ్చే భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందిస్తుండటం వల్ల మరో రూ.20 కోట్లు ఖర్చు చేస్తోంది. లడ్డూ తయారీకి రోజుకు 900 కిలోల ఆవునెయ్యి వాడతారు. ఆవునెయ్యిని ఆలయం వెలుపల ఉన్న ఎనిమిది భారీ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. పైపులైను ద్వారా నెయ్యిని ఈ ట్యాంకుల నుంచి పోటుకు సరఫరా చేస్తారు. ఇవి చాలకపోవడం వల్ల మరికొన్ని ట్యాంకులు సిద్ధం చేశారు.