
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేస్తున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, మంత్రి కొట్టు సత్యనారాయణ, ఈవో ధర్మారెడ్డి
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు.