Chakra snanam
-
వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం
-
తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం (ఫోటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరిరోజైన మంగళవారం పుష్కరిణిలో శ్రీవారికి చక్ర స్నానం వేడుకగా ముగిసింది. టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వర్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం చక్రత్తాళ్వరుకు అర్చకులు పుష్కరిణీలో పవిత్ర స్నానం ఆచరించారు. సుదర్శన చక్రతాళ్వార్ను పుష్కరిణిలో పవిత్ర స్నానం తర్వాత భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని,భక్తులు సంయమనంతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు. వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వైభవోపేతంగా నిర్వహించింది. సోమవారంతో వాహన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకరాల్లో మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయంలోని పలు ఆర్జిత ఏకాంతంగా నిర్వహించింది టీటీడీ. ప్రముఖుల సిఫార్సు లేఖల దర్శనంతో పాటు పలు ప్రత్యేక దర్శనాలను TTD రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే నెల(అక్టోబర్) 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్దం అవుతుంది. చక్రస్నానమంటే.. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక.. పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకొని పుష్కరిణిలో తీర్థమాడుటే చక్రస్నానం. దీనినే చక్రతీర్థం అని కూడా అంటారు. బ్రహ్మోత్సవము అంటే యజ్ఞం. యజ్ఞం పూర్తిగానే అవభృధ స్నానం చేయాలి. ‘భృధం’ అంటే బరువు, ‘అవ’ అంటే దించుకోవడం. ఇన్ని రోజులు యజ్ఞం నిర్వహించి అలిసిపోయినవాళ్లు ఆ అలసట బరువును స్నానంతో ముగించుకుంటారు. యజ్ఞంలో పాల్గొనని వారు కూడ ‘అవభృంధం’లో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం. చక్రస్నానం నాడు సుదర్శన స్వామి, మలయప్ప స్వామితో కలిసి స్నానం చేసే మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమలలో నిర్వహిస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ధ్వజావరోహణంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఆది వారం ఉదయం శ్రీవారికి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉ. 6 నుంచి 9 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని అయినమహల్ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అయినమహల్ ముఖమండపం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో ఉదయం 8.15 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి స్నానం చేయించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ‘షోడశదిన సుందరకాండ దీక్ష’ ఈ నెల 29 నుంచి అక్టోబర్ 14 వరకు తిరుమలలోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ దీక్ష జరగనుంది. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 14 వరకు తిరుమలలోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ దీక్ష జరగనుంది. ఇందుకుగాను సెప్టెంబర్ 28న రాత్రి 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ చేయనుంది. లోక కల్యాణార్థం 16 రోజుల పాటు నిష్ణాతులైన వేద పండితులతో టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఘనంగా రామానుజ జీయర్ తిరునక్షత్రోత్సవాలు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్దజీయర్ మఠం స్థాపించి 900 ఏళ్లు అయిన సందర్భంగా తిరువేంగడ రామానుజ జీయర్ తిరు నక్షత్రోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
చక్రస్నానం.. భక్తజన పునీతం
-
ఒంటిమిట్టలో ఘనంగా చక్రస్నానం
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయ కోనేరు వద్ద శనివారం ఉదయం అర్చకులు ఘనంగా చక్రస్నానం నిర్వహించారు. ఆలయం నుంచి సుదర్శన చక్రాన్ని కోనేరు వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే, స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అభిషేక కార్యక్రమం జరిగింది. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. -
వైభవంగా శ్రీవారి చక్రస్నాన మహోత్సవం
తిరుమల: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నాన కార్యక్రమం గురువారం ఉదయం వైభవంగా జరిగింది. అంతక ముందు వరాహ స్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామివారికి అభిషేక సేవ జరిపారు. చక్రస్నాన మహోత్సవం సందర్భంగా పుష్కరిణిని అరటి, మామిడి తోరణాలతో అలంకరించారు. ముఖ్యంగా చక్రత్తాళ్వరుకు విశేష పూజలు జరిపే ప్రాంతాన్నిఆధ్యాత్మిక చింతనతో తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టూ కంచెను నిర్మించారు. కాగా ఈ రోజు ధ్వజారోహణం నిర్వహించి ఉత్పవాలకు ముగింపు పలుకుతారు. తిరుమలలో తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్పవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలాచరించారు. ఈవో సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీవారికి చక్రస్నానం
-
తిరుమలలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం
-
తిరుమలలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం శ్రీవారి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. అంతక ముందు వరాహ స్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామివారికి అభిషేక సేవ జరిపారు. చక్రస్నాన మహోత్సవం సందర్భంగా పుష్కరిణిని అద్దంలా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టూ కంచెను నిర్మించారు. కాగా ఈ రోజు రాత్రి 7 గంటలకు ధ్వజారోహణం నిర్వహించి ఉత్పవాలకు ముగింపు పలుకుతారు. తిరుమలలో తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్పవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి , కాలినడకన వచ్చే భక్తులకు గంటలోపే శ్రీవారి దర్శనం కలుగుతోంది. బుధవారం ఏడుకొండలవాడిని 63,578 మంది భక్తులు దర్శించుకున్నారు. -
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
తిరుపతి: ద్వాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారి పుష్కరిణిలో శుక్రవారం చక్రస్నానం కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీవారి సుదర్శన చక్రత్తాశ్వారును ఆలయం నుంచి పుష్కరిణి చెంతకు పల్లకిలో వూరేగింపుగా తీసుకొచ్చారు. మంగళవాయిద్యాల నడుమ అర్చకులు చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం, పవిత్ర తులసి దళాలతో పూజలు నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్వారుకు పుష్కరిణి అభిషేకం చేశారు. భక్తులు చక్రస్నానంలో పాల్గొని పుణ్య స్నానాలాచరించారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్తీ కొనసాగుతుంది. ద్వాదశి సందర్భంగా సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చారు. అన్ని కంపార్ట్మెంట్లు నిండి కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఇవాళ అర్ధరాత్రి వరకు వైకుంఠదర్శనం కల్పిస్తామని తితిదే ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం నుంచి క్యూలైన్లలోకి అనుమతిస్తారు. -
వైభవంగా పంచమి తీర్థం
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు గురువారం పద్మసరోవరం(పుష్కరిణి)లో అత్యంత వైభవంగా పంచమీతీర్థం (చక్రస్నానం) నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు పవిత్రస్నానం చేసి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి పుట్టిన రోజున నిర్వహించే ముఖ్యమైన ఘట్టం చక్రస్నానం. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9.30గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి పుష్కరిణిలోని పంచమీతీర్థం మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. వేదపండితులు అమ్మవారికి, చక్రతాళ్వారుకు కన్నులపండువగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం 11.50గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానమాచరించారు. అమ్మవారికి శ్రీవారిసారె పంచమీతీర్థం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారికి తిరుమల ఆలయం నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి వారి సారె పంపారు. టీటీడీ ఈవో గిరిధ ర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆలయం నుంచి తీసుకొచ్చి తిరుమలలో ఊరేగింపు నిర్వహించారు. తిరుమల నుంచి పరిచారకులు నెత్తినపెట్టుకుని నడకదారిలో తిరుపతి అలిపిరి వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబారీలపై ఊరేగింపుగా తిరుచానూరు తీసుకొచ్చి తిరుపతి జేఈవో భాస్కర్కు అందజేశారు. ఆయన సారెను పంచమీతీర్థం మండపానికి తీసుకురాగా వేదపండితులు అమ్మవారికి అలంకరించారు. అదేవిధంగా శ్రీపద్మావతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శ్రీవారు తరపున తిరుమల దేవేరికి పచ్చరాయి పొదిగిన విలువైన హారాన్ని కానుకగా అందజేశారు. ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు ఈనెల 19న ధ్వజారోహణంతో ప్రారంభమైన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను గురువారం రాత్రి ఆలయంలో వేదపండితులు ధ్వజావరోహణం నిర్వహించి ముగించారు. నేడు పుష్పయాగం బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు అమ్మవారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. తెలిసోతెలియకో జరిగిన పొరపాట్లకు దోషనివారణగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం దాతలు సమకూర్చిన దాదాపు ఆరు టన్నుల 12రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పయాగం నిర్వహిస్తారు. -
సర్వరక్షాకరం...శ్రీవారి చక్రస్నానం
చక్రం పూర్ణత్వానికి ప్రతీక. ఈ విశ్వమంతా చక్రమండలమయమే. ఏడేడు పద్నాలుగు లోకాలు అన్నీ చక్రాలే. వాయు, వహ్ని, గగన, జలమండలాలన్నీ చక్రాలే! ఒక్కమాటలో చెప్పాలంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే. ఆ చక్రాన్ని ధ్యానించి, అభిషేకార్చనలతో సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవరోజు ఉదయం భూదేవీ సమేత మలయప్పస్వామివారిని సుదర్శన చక్రత్తాళ్వార్తో వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత శ్రీచక్రత్తాళ్వార్ను అంటే సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరిణిలో ముంచి, పవిత్రస్నానం చేయిస్తారు. అదే సమయంలో లక్షలమంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరఃస్నానం చేస్తారు. ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధశక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. అందుకే ఈ చక్రస్నానం సృష్టిచక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది. దీనికే అవభృథస్నానమని కూడా పేరు. శ్రీవారి దివ్యాయుధాలలో చక్రాయుధ ప్రశస్తి ఎంత మహత్తరమో గుర్తిస్తే- చక్రస్నాన మహత్యం భక్తులకు అంతగా స్వానుభవానికి వస్తుంది. శ్రీనివాసుని పంచాయుధాలలో మూర్తిమంతంగా, దేవతగా, ఆళ్వార్గా, యంత్రరూపంగా, యంత్రాధిష్ఠానదేవతగా, దుష్టశిక్షణలో ప్రముఖాయుధంగా కీర్తింపబడేది సుదర్శనమొక్కటే! భక్తై సుఖేన దృశ్యత ఇతి... అంటే దీనిని భక్తులు సుఖంగా చూడగలరన్నమాట. శ్రీవారి చక్రాయుధాన్ని కష్టాలు, దుష్టశక్తులు, శత్రువుల బారి నుండి రక్షించే మహాశక్త్యాయుధంగా విశ్వసించి, పూజించడం ఒక ప్రత్యేకత. దేవశిల్పి అయిన విశ్వకర్మ... సూర్యుణ్ణి సానబట్టేటప్పుడు రాలిన తేజస్సును పోగు చేసి, చక్రాకారమైన ఆయుధంగా రూపొందించి, మహావిష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడు. ఇది శ్రీహరి సంకల్పించినంతనే వచ్చి, కుడిచేతిని చేరుతుంది. ప్రయోగించగానే ఎంత బలవంతుణ్ణయినా తరిమి, సంహరించి, తిరిగి స్వస్థానానికి వస్తుంది. ఈ చక్రాయుధం వల్ల మృతినొందినవారు విష్ణుదేవుని దివ్యతేజంలో లీనమవుతారు. గజేంద్ర సంరక్షణకై శ్రీహరి తన చక్రాయుధాన్నే పంపాడు. భాగవతంలోని అంబరీషుని వృత్తాంతంలో... దుర్వాసునికి బుద్ధి చెప్పి, అంబరీషుని రక్షించేందుకై శ్రీహరి పంపిన చక్రం ఎంత మహత్తర ప్రభావంతో, విజ్ఞతతో ప్రవర్తించిందో గమనిస్తే, అది సాక్షాత్తూ నారాయణ రూపమే అని గోచరిస్తుంది. శివబ్రహ్మాదులైన ఏ దేవతలూ ఆ చక్రాన్ని నివారించలేకపోయారు. అప్పుడు అంబరీషుడు ఆ మునిని రక్షించేందుకు చేసిన చక్రాయుధ స్తోత్రం సుదర్శన సహస్రనామ స్తోత్రంలోని అన్ని నామాల సారాంశాన్నీ పుణికిపుచ్చుకుంది. దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే, భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనమిస్తుంది. సృష్టిక్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందనేది యోగుల విశ్వాసం. శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి, జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తుంది. అందుకే దీన్ని సుదర్శనం అంటారు. ధ్వజారోహణం నాడు గరుత్మంతునితోబాటు చక్రత్తాళ్వార్నీ ఆహ్వానిస్తారు. అప్పుడు చక్రగద్యంతో స్వాగతం పలుకుతారు. అనంతరం... ‘అఖిల జగదభివృద్ధిరస్తు’ అని మంగళవాచకం చెప్పి, తాళ లయాత్మకంగా ఆహ్వానించి, సుదర్శన దేవతకు ప్రీతికరంగా...‘చక్రస్య షట్పితా పుత్రతాళం స్వస్తిక నృత్తకమ్ శంకరాభరణ రాగం చక్రవాద్య సమన్వితమ్’ అని పఠిస్తారు. ఇందుకు తగినట్లే మంగళవాద్యకులు శంకరాభరణం, షట్పితా పుత్రతాళం, స్వస్తిక నృత్తం, చక్రవాద్యం కావిస్తారు. నైవేద్య నీరాజనాద్యుపచారాలతో చక్రదేవతను ఆరాధిస్తారు. ఇదే పద్ధతిని అనుసరించి, చక్రగద్యాదికం పఠించి, అర్చించి, ధ్వజావరోహణం నాడు చక్రదేవతకు వీడ్కోలు పలుకుతారు. బ్రహ్మోత్సవ సేవలలో తక్కినవన్నీ ఒక ఎత్తు... చక్రస్నానం ఒక ఎత్తు. శ్రీమన్నారాయణాభేదశక్తిని తనలో ఇముడ్చుకున్న చక్రస్పర్శచే పవిత్రమైన పుణ్యజలంలో చక్రంతోపాటు స్నానం చేయడం బ్రహ్మోత్సవాలలో ఒక అద్భుత సన్నివేశం. చక్రస్నానం వల్ల సర్వపాప విముక్తులై, విష్ణులోకాన్ని పొందుతారని ఆగమోక్తి! ఈ స్నాన మహిమ అవాఙ్మానస గోచరం. ఆత్మైక వేద్యం. (రేపు శ్రీవారికి చక్రస్నానం సందర్భంగా) - డాక్టర్ కంపల్లె రవిచంద్రన్ తిరుమల తిరుపతి దేవస్థానం