తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం శ్రీవారి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. అంతక ముందు వరాహ స్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామివారికి అభిషేక సేవ జరిపారు. చక్రస్నాన మహోత్సవం సందర్భంగా పుష్కరిణిని అద్దంలా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టూ కంచెను నిర్మించారు. కాగా ఈ రోజు రాత్రి 7 గంటలకు ధ్వజారోహణం నిర్వహించి ఉత్పవాలకు ముగింపు పలుకుతారు. తిరుమలలో తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్పవాలు అత్యంత వైభవంగా జరిగాయి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి , కాలినడకన వచ్చే భక్తులకు గంటలోపే శ్రీవారి దర్శనం కలుగుతోంది. బుధవారం ఏడుకొండలవాడిని 63,578 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమలలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం
Published Thu, Sep 24 2015 9:24 AM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM
Advertisement
Advertisement