బ్రహ్మోత్సవం అంటే భక్తజన సందోహం. వైకుంఠనాథుడి వైభవం చూసి తరించే సందర్భం. గోవిందనామస్మరణతో సప్తగిరులు పులకించే వైభోగం. ఏడుకొండల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే దేదీప్యం. వాహన సేవల ముందు సాంస్కృతిక నీరాజనం. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కరోనా కాలంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఆలయ ఆవరణలోనే ఏకాంతంగా దేవదేవుడి బ్రహ్మోత్సవాన్ని పరిపూర్ణం చేయాలని నిర్ణయించింది. మానవసేవే.. మాధవ సేవగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దేవదేవుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూసేవారు. కలియుగ వైకుంఠంలో శ్రీవారి ఉత్సవాలను కనులారా తిలకించేందుకు వడివడిగా తిరుమల గిరులు చేరుకునేవారు. ఉత్సవాల్లో రోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ఎప్పుడు బ్రహ్మోత్సవాలు నిర్వహించినా అలాంటి పరిస్థితే తెరపైకి వచ్చేది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జనరద్దీని కట్టడి చేసేందుకు తిరుమల–తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే నిర్వహించాలని తలపెట్టింది. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది.
జిల్లాలో కరోనా విజృంభణ
జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బ్రహ్మోత్సవాల రద్దీ నేపథ్యంలో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని టీటీడీ ధర్మకర్తల మండలి భావించింది. ప్రజల జీవన స్థితిగతులు, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయించింది. ఈ సారి బ్రహ్మోత్సవాలను కోవిడ్–19 నిబంధనలకనుగుణంగా నిర్వహించాలని భావించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి ఏకాంతంగా నిర్వహించాలని సంకలి్పంచింది. జీయ్యర్ స్వాములు, ఆగమ సలహాదారులు, ప్ర«ధాన అర్చకులతో చర్చించి సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం ఎస్వీబీసీ చానల్‌లో తిలకించేందుకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
ముఖ్యమంత్రికి ఆహ్వానం
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరుఫున ముఖ్యమంత్రి పట్టువ్రస్తాలను శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ బృందం ఆహ్వానం మేరకు ఈనెల 23న గరుడసేవ సందర్భంగా ముఖ్యమంత్రి తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టు వ ్రస్తాలు సమరి్పంచనున్నారు.
చరిత్రలో తొలిసారి..
దేవదేవుడి బ్రహ్మోత్సవాలు అంత్యంత వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ. దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రంలో ఈ సారి ఏకాంతగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. టీటీడీ బోర్డు చరిత్రలో ఇలా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే మొదటి సారి అని చరిత్రకారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment