సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం ఉదయం మలయప్ప స్వామి ఐదు శిరస్సుల చిన శేషవాహనంపై భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శేషునికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. పెద శేష వాహనంపై తొలిరోజు రాత్రి ఆది శేషుడు పెద శేషవాహనంలో ఉభయ దేవేరులతో దర్శనం ఇచ్చిన స్వామి, చిన శేష వాహనంపై మలయప్ప స్వామి ఏకాంతంగా దర్శనం ఇస్తున్నారు.
ఐదు శిరస్సుల చిన శేషుడుని వాసుకి భావిస్తారు. కోవిడ్ కారణంగా ఆలయంలోనే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. చిన శేషవాహనంపై మలయప్ప స్వామిని తనివితీరా దర్శించుకున్న భక్తులకు కుండలినీ యోగసిద్ది ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక రాత్రికి స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment