
సాక్షి, తిరుపతి: శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు వెంకన్నను దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీఐఐసీ కమిషనర్ సుబ్రమణ్యం, ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్ వెంకట్ మేడపాటి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి సోమవారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్ వెంకట్ మేడపాటి మాట్లాడుతూ.. ‘పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పోందడం ఆనందదాయకంగా ఉంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో బయట దేశాల్లో ఉన్న చాలా మంది ప్రవాస భారతీయులు ఇబ్బందులకు గురయ్యారు. గత ఐదు నెలల వ్యవధిలో 40 వేలకి పైగా మన వాళ్లని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇండియా తీసుకొచ్చాం. ప్రవాస భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏపీఎన్‌ఆర్‌టీకి కాల్ చేస్తే ఖచ్చితంగా వారికి మా పూర్తి సహకారం అందిస్తాం’ అని తెలిపారు. (చదవండి: ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు)