kanipakam vara Siddhi Vinayaka temple
-
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, గుంటూరు: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం అందింది. గురువారం సాయంత్రం పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు, కాణిపాకం వినాయక స్వామి ఆలయ అధికారులు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఆయన్ని కలిసి ఆహ్వానపత్రిక అందించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌ను ఆహ్వానించారు స్థానిక ఎమ్మెల్యే, కాణిపాక దేవస్థానం ప్రతినిధులు. ఆహ్వనపత్రికతో పాటు వినాయక స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు సీఎం జగన్‌కు అందజేశారు. సీఎం జగన్‌ను ఆహ్వానించిన వారిలో ఆలయ దేవస్ధానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఈవో ఎ.వెంకటేశ్ ఉన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం పుణ్యక్షేత్రంలో ఈ నెల 18 నుంచి 21 రోజుల పాటు వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. -
వరసిద్ధుని దర్శనానికి వేళాయె
యాదమరి: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐదు నెలల తర్వాత స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం ఈ నెల 21 నుంచి లభించనుంది. రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 27 నుంచి గర్భాలయ మూలమూర్తి స్వయంభు దర్శనం నిలిపివేశారు. నవగ్రహ మండపం వెనుక భాగంలో బాలాలయం నిర్మించారు. అత్తికొయ్యతో వినాయక స్వామి ప్రతిమను సిద్ధం చేశారు. ఆ రోజు నుంచి శనివారం వరకు దాదాపుగా ఐదునెలల పాటు భక్తులకు బాలాలయంలోనే స్వామి దర్శనం లభించింది. ఇక కుంభాభిషేకం క్రతువు ముగిసిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కొత్త ఆలయంలోని స్వయంభు మూలవిరాట్టు దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు తెలిపారు. ఈ నెల 31 నుంచి కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. మొత్తం 21 రోజుల పాటు వివిధ వాహన సేవల్లో స్వామివారు ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్ఎస్ బాబు కాణిపాకం దేవస్ధానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో సురేష్ బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి (కాణిపాకం, చిత్తూరు జిల్లా) బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు. కాగా ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో పాటు ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వానపత్రికను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. ఆహ్వానపత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో కే. విద్యాసాగర్ రెడ్డి, ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, వి. మార్కండేయ శర్మ, ఎం. శ్రీనివాస శర్మ పాల్గొన్నారు. చదవండి: 'జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఈయనేమో టీడీపీని చూస్తాడు' -
గణపయ్యకు తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు
కాణిపాకం/యాదమరి(చిత్తూరు)/వేలూరు(తమిళనాడు): చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామికి తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శనివారం సమర్పించారు. ఉదయం తిరుమల నుంచి స్వామివారి పట్టువస్త్రాలను వైవీ సుబ్బారెడ్డి తీసుకురాగా ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కాణిపాక ఆలయ ఈవో వెంకటేశు స్వాగతం పలికారు. స్వామివారి పట్టు వస్త్రాలను గణపయ్య చెంత ఉంచి పూజలు చేశారు. వైవీ దంపతులకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం గణపయ్యకు టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తోన్న స్వర్ణ రథాన్ని వైవీ సుబ్బారెడ్డి, నారాయణ స్వామి, ఎంఎస్ బాబు పరిశీలించారు. త్వరలో శ్రీకాళహస్తి, కాణిపాకం ట్రస్ట్ బోర్డుల నియామకం చేపడతామని వీరు కాణిపాకంలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బంగారు గుడిని సందర్శించిన వైవీ తమిళనాడులోని వేలూరు జిల్లా శ్రీపురంలోని బంగారు గుడిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు శనివారం సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయాధికారులు ఘన స్వాగతం పలికారు. పీఠంలోని స్వర్ణలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం పీఠాధిపతి శక్తి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ నవనీత పథకానికి పీఠాధిపతి శక్తి అమ్మ గిర్ ఆవుదూడను కానుకగా సమర్పించారు. -
వినాయకుడికి పట్టు వస్త్రాలు
కాణిపాకం (యాదమరి) (చిత్తూరు జిల్లా): కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మంత్రి పెద్దిరెడ్డి, ఆయనతో పాటు ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, జంగాలపల్లె శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలసి ఊరేగింపుగా పట్టువస్త్రాలు తీసుకెళ్లారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం అలంకార మండపంలో వేదపండితులచే ఆశీర్వాదాలు చేయించి, తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందించారు. అంతకుముందు ఆలయంలో కొత్త హుండీని మంత్రి ప్రారంభించారు. -
వినాయకునికి ఎన్ఆర్ఐ రూ.7 కోట్ల విరాళం
సాక్షి, కాణిపాకం (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్లు విరాళంగా అందించినట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రవాస భారతీయుడైన ఓ అజ్ఞాత భక్తుడు రూ.7 కోట్ల చెక్‌ను అందించారని చెప్పారు. ఆలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు విరాళంగా భక్తుడు అందించడం ఇదే తొలిసారి అని తెలిపారు. -
టీటీడీకి రూ. 5 కోట్ల డిపాజిట్
సాక్షి, తిరుపతి: వినాయక స్వర్ణరథం తయారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాకి గురువారం కాణిపాకం వినాయక దేవస్థానం రూ. 5 కోట్లను డిపాజిట్ చేసింది. ఈ మేరకు కాణిపాకం దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఆ మొత్తాన్ని వినాయక స్వర్ణరథం తయారీ కోసము డిపాజిట్ చేసినట్టు పేర్కొంది. గతంలో వినాయక బంగారు రథం తయారీ కోసం టీటీడీకి రూ. కోటి డిపాజిట్ చేసినట్టు కాణిపాకం దేవస్థానం వెల్లడించింది. అయతే తాజాగా కాణిపాకం వినాయక స్వర్ణరథం తయారీకి అంచనాలు పెరిగాయి. దీంతో రథం తయారికి రూ. 6.5 కోట్ల ఖర్చు అవుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. కాగా వచ్చే ఏప్రిల్ నాటికి వినాయక స్వర్ణరథం సిద్ధం చేసేందుకు టీటీడీ టెండర్లు పిలువనుంది. -
కాణిపాకంలో మాజీ మంత్రి ప్రమాణం
సాక్షి, చిత్తూరు : పదవిలో ఉండగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ మేరకు ప్రమాణాల దేవుడుగా పేరుగాంచిన కాణిపాకం వరసిద్ది వినాయకుడి వద్ద ఆయన ప్రమాణం చేశారు. గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన కామినేని.. నేడు కాణిపాకం వర సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లారు. ‘పదవిలో ఉండగా నాపై అవినీతి ఆరోపణలు వినిపించాయి. కానీ, అప్పుడు ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు. అందుకే రాజీనామా చేశాక ప్రమాణం చేస్తున్నా. నేను కానీ, నా కుటుంబంలోని వ్యక్తులు కానీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు’ అని ఆయన మీడియాకు తెలిపారు. కాగా, గతంలో 10 వతరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని విమర్శలు వెల్లువెత్తడంతో అప్పటి విద్యాశాఖ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు కాణిపాకంలో ప్రమాణం చేసి వార్తల్లో నిలిచారు. -
కాణిపాకం పాలకమండలి ఖరారు !
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ పాలకమండలిని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు మంగళవారం జారీ చేసినట్లు సమాచారం. కాణిపాకం పాలకమండలి ఖరారు! కాణిపాకం, న్యూస్‌లైన్: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ పాలకమండలిని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు మంగళవారం జారీ చేసినట్లు సమాచారం. ఆలయానికి ఐదేళ్లుగా పాలక మండలి లేదు. ప్రభుత్వం రెండు సార్లు నియమించినా ఆలయ ఉభయదారులు కోర్టును ఆశ్రయించడంతో సమస్య ఏర్పడింది. దీంతో ఐదేళ్లుగా పాలక మండలి లేకుండానే ఆలయ పాలన సాగింది. ఎట్టకేలకు పాలక మండలిని ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సభ్యులుగా సుబ్రమణ్యంరెడ్డి (మైనగుండ్లపల్లె), చక్రవర్తి (కాణిపాకం), వేణుగోపాల్ (ఉప్పోళ్లూరు), ప్రభాకర్ (దివిటివారిపల్లె), లత (కాణిపాకం), కె.టి.రామరాజ్ (బెంగళూరు), ఈశ్వరయ్య (కడప), పుష్పాహఫ్ (రాయచోటి), సత్యనారాయణ శెట్టి (కలికిరి), సోమశేఖర్ గురుకుల్ (శివాలయం ప్రధాన అర్చకులు) ఎన్నికైనట్లు సమాచారం. వీరు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. తర్వాత సుబ్రమణ్యంరెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే తమకు అవకాశం కల్పించలేదని ఆలయ ఉభయదారులు పాలకమండలి నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న జగన్
కాణిపాకం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ....జగన్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పట్టువస్త్రంతో సత్కరించారు. కాగా జగన్‌తో పాటు స్వామిని దర్శించున్నవారిలో పార్టీ నేతలు మిధున్‌రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు జగన్‌తో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. కాగా సమైక్య శంఖారావం యాత్రను ఆయన ఈరోజు ఉదయం కాణిపాకం నుంచి ప్రారంభించారు.