సాక్షి, గుంటూరు: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం అందింది. గురువారం సాయంత్రం పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు, కాణిపాకం వినాయక స్వామి ఆలయ అధికారులు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఆయన్ని కలిసి ఆహ్వానపత్రిక అందించారు.
స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌ను ఆహ్వానించారు స్థానిక ఎమ్మెల్యే, కాణిపాక దేవస్థానం ప్రతినిధులు. ఆహ్వనపత్రికతో పాటు వినాయక స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు సీఎం జగన్‌కు అందజేశారు. సీఎం జగన్‌ను ఆహ్వానించిన వారిలో ఆలయ దేవస్ధానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఈవో ఎ.వెంకటేశ్ ఉన్నారు.
చిత్తూరు జిల్లా కాణిపాకం పుణ్యక్షేత్రంలో ఈ నెల 18 నుంచి 21 రోజుల పాటు వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment