‘ప్రాణమున్నంత వరకు జగన్‌ వెంటే’ | ysrcp mla Suneel Kumar Condemns Party Defection Rumors | Sakshi
Sakshi News home page

‘ప్రాణమున్నంత వరకు జగన్‌ వెంటే’

Published Wed, Aug 30 2017 9:28 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

‘ప్రాణమున్నంత వరకు జగన్‌ వెంటే’ - Sakshi

‘ప్రాణమున్నంత వరకు జగన్‌ వెంటే’

 కొన్ని చానెళ్లలో నాపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు
 పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ ఆగ్రహం


సాక్షి, పలమనేరు: తన ప్రాణమున్నంత వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంటే నడుస్తానని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతానంటూ కొన్ని టీవీ చానెళ్లలో వస్తున్న తప్పుడు కథనాలను మంగళవారం రాత్రి ఆయన పలమనేరులోని తన నివాసంలో తీవ్రంగా ఖండించారు. వారేదో ప్రత్యక్ష్యంగా చూసినట్టు తాను నియోజకవర్గ నాయకులతో సంప్రదిస్తున్నానని నిరాధారమైన విషయాలను టీవీలో చూపెట్టడం సమంజసం కాదన్నారు. త్వరలో నవరత్నాలతో తమ అధినేత ప్రజల్లోకి వస్తున్నారని, దీన్ని చూసి భయపడే అధికారపార్టీ ఇలాంటి నీచమైన మైండ్‌గేమ్‌లకు పాల్పడుతోందని విమర్శించారు.

దానికి తోడు పచ్చటీవీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయపెట్టి, అధికారాన్ని ఉపయోగించి, కోట్లాదిరూపాయల డబ్బులు కుమ్మరించి నంద్యాలలో గెలిచినంత మాత్రాన అధికారపార్టీ వాపును చూసి బలుపుగా అనుకుంటుందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ పాలన కావాలని జనం వేచిచూస్తున్నారని, ఇది జరిగి తీరుతుందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement