Parvathamma
-
లేడీ సింగం పార్వతమ్మ..!
సాక్షి, బెంగళూరు: అతనో కరుడుకట్టిన నేరగాడు, హత్య, హత్యాయత్నం కేసుల్లో నిందితుడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఈ క్రమంలో నిందితుడు బెంగళూరులో ఉంటున్నట్లు సమాచారం అందుకున్న తుమకూరు సీఐ పద్మావతి రంగంలోకి దిగారు. బెంగళూరు పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాలు... హత్య, హత్యాయత్నం తదితర 14 కేసుల్లో నిందితుడైన తుమకూరుకు చెందిన రౌడీషీటర్ స్టీఫెన్ ఫెర్నాండిస్ అలియాస్ గూండా బెంగళూరు బాగలకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లసంద్ర, సోలదేవనహళ్లిలో తలదాచుకున్నట్లు తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రౌడీ స్టీఫెన్ దీంతో తుమకూరు తిలక్ పార్కు సీఐ పార్వతమ్మ తన సిబ్బందితో కలిసి బెంగళూరులోని బాగలకుంట సీఐ శివస్వామితో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులతో కలిసి శుక్రవారం పొద్దుపోయాక మల్లసంద్రకు చేరుకున్నారు. నిందితుడు ఉన్న ప్రాంతానికి వచ్చారు. పోలీసుల రాకను గుర్తించిన స్టీఫెన్ పరారవుతుండగా కానిస్టేబుల్ శ్రీనివాస్ పట్టుకోవడానికి యత్నించాడు. దీంతో స్టీఫెన్ కానిస్టేబుల్‌పై మారణాయుధాలతో దాడికి దిగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అక్కడే ఉన్న సీఐ పార్వతమ్మ హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో ఆత్మరక్షణార్థం అతని కాలిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు కుప్పకూలిపోయాడు. హుటాహుటిన పోలీసులు నిందితుడిని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 2017లో తుమకూరుకు చెందిన మంజ హత్యకేసులో స్టీఫెన్ ప్రధాన నిందితుడు. అనేకసార్లు జైలుకు వెళ్లివచ్చాడు. పలు కేసుల్లో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతూ పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. బెంగళూరులోనే కొందరు రౌడీలతో కలిసి ఉంటున్నాడు. అతని అరెస్ట్‌తో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
కొడుకు స్కూల్‌కు వెళ్లడం లేదని..
సాక్షి, హైదరాబాద్ : ఓ పిల్లాడు స్కూల్‌కు వెళ్లకపోవడంతో ఆ తల్లి ఏం చేయాలో తోచలేదు. ఎలాగైనా తన కొడుకు స్కూల్‌కు వెళ్లి చదువుకుని ప్రయోజకుడు కావాలనుకుంది. హెచ్చరించింది.. బుజ్జగించింది.. నానా రకాలుగా ప్రయత్నించింది. అయినా ఆ పిల్లాడు వినలేదు. దీంతో ఆ తల్లి పోలీసులకు ఫోన్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. యదాద్రి భువనగిరికి చెందిన మంజుల భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో కొడుకు లోకేశ్‌ను ఎలాగైనా ప్రయోజకుడిగా మార్చాలని కష్టపడి చదివిస్తోంది. అయితే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న లోకేశ్ వారం రోజుల క్రితం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. తాను తిరిగి స్కూల్‌కు వెళ్లనని చెప్పాడు. తల్లి ఎంత బతిమాలినా లోకేశ్ వినలేదు. దీంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు కూడా ఆ పిల్లాడికి నచ్చజెప్పారు. అయినా వినకపోవడంతో లోకేశ్‌ను, అతని తల్లికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కాగా, తెలంగాణలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. -
అత్తమ్మ
ప్రమీల ఇంటికొచ్చింది ఆమె తల్లి పార్వతమ్మ. తల్లిని చూసి ఎంతో సంబరపడింది ప్రమీల.తల్లికి ఇష్టమైనవి వండి పెడుతూ, తను కొనుక్కున్న నగలు, చీరలను చూపెడుతూ, ఊళ్ళో ఉన్న తన అత్తగారు, ఆడబిడ్డలని ఆడిపోసుకోవడంతోనే నాలుగు రోజులు గడిచిపోయాయి.అలా అని కూతురు చెప్పిందానికల్లా తల ఊపేసి భుజంతట్టే రకం కాదు పార్వతమ్మ.తన కూతురైనా సరే అకారణంగా ఇతరులను ద్వేషించడం ఆమెకు నచ్చేది కాదు.‘‘అలా తిట్టొద్దు తల్లీ’’ అని ఎన్నోసార్లు చెప్పి చూసినా వినేది కాదు ప్రమీల.పైగా...‘‘అమ్మా, వాళ్ల గురించి నీకు తెలియదు’’ అని దబాయించేది.కూతురి మొండి వైఖరి తెలిసిన పార్వతమ్మ దీనికి బుద్ధెప్పుడు వస్తుందో అని అనుకునేది. ప్రమీల భర్త ప్రసాదరావు చాలా మంచివాడు. భార్య తన తల్లికి, చెల్లెళ్ళకు మర్యాద ఇవ్వకపోయినా వాళ్ళు రావటం ఆమెకు ఇష్టం లేకపోయినా, వాళ్ళు వచ్చినప్పుడు ఆమె పెద్దగా నోరు పారేసుకున్నా సహించి ఊరుకొనేవాడు తప్పితే తిరిగి ఆమెను ఏమనేవాడు కాదు.భార్య నోటికి జడిసి సంపాదించే యంత్రంలా మారి ఆమెను సుఖపెడుతున్నాడే గానీ ఊళ్ళో ఒంటరిగా ఉన్న తన తల్లిని తన దగ్గరికి తెచ్చిపెట్టుకోవటానికి ఏ మాత్రం సాహసించలేదు. ఎప్పుడైనా తల్లి కొడుకు ఇంటికి నాల్గురోజులుండి పోదామని వస్తే రెండో రోజే వెళ్ళిపోయేదావిడ ప్రమీల ఈసడింపు మాటలను భరించలేక.అందుకని ఊళ్ళోనే ఉంటూ అప్పుడప్పుడు కొడుకునే వచ్చి చూసిపోమనేది. ఇంటి చుట్టు పక్కల దగ్గర బంధువులుండటం వలన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మనసులోనే బాధ పడేవాడు ప్రసాదరావు.పొద్దున పదిగంటలకు ఆఫీసుకెళ్ళబోతున్న అల్లుడితో...‘‘అల్లుడు గారు, నేనొచ్చి అప్పుడే వారం రోజులైంది. ఈ రోజు సాయంత్రం అమ్మాయి బసెక్కిస్తుంది నన్ను’’ అని చెప్పింది పార్వతమ్మ. ‘‘ఇంకో నాల్రోజులుండి వెళ్ళొచ్చుగా అత్తయగారూ...’’ అన్నాడు ప్రసాదరావు ఆప్యాయంగా. అతనికి పెద్దలంటే గౌరవం. తన తల్లిని భార్య నిర్లక్ష్యం చేసినా తను మాత్రం ఆమె తల్లిని గౌరవిస్తూ ఏలోటూ రానీయకుండా చూసేవాడు. తన తల్లి వస్తే ప్రమీల చాలా సంతోషంగా ఉంటుంది..మరి తనతల్లి వస్తే ఎందుకు మొహం చిట్లించుకుంటుందో అని అతని బాధ.‘‘లేదయ్యా...ప్రమీల నాన్నగారు రమ్మనమని ఫోన్ చేశారు...అందుకే ..’’ అన్నది పార్వతమ్మ.‘‘సరే మీ ఇష్టం.. జాగ్రత్తండీ’’ అని ఆఫీసుకెళ్ళి పోయాడు ప్రసాదరావు.పన్నెండున్నరకి చెమటలు కక్కుతూ ఆదరాబాదరాగా ఇంటికొచ్చిన ప్రసాదరావుని చూసి ఆశ్చర్యపోయారు తల్లీ కూతుళ్ళిద్దరూ. కాసిని మంచినీళ్ళు తాగి ‘‘నేను అర్జెంటుగా ఊరెళుతున్నాను. అమ్మకి సుస్తీగా ఉంది. రెండు రోజుల్లో వస్తాను. నే వచ్చేవరకు మీరు ప్రమీలకి తోడుగా ఉండండి’’ అని చెప్పి మరోమాట లేకుండా వెళ్ళిపోయాడు.రెండు రోజుల తరువాత నీరసంగా ఉన్న తల్లిని నడిపించుకుంటూ తీసుకొస్తున్న భర్తని చూడగానే మొహం మాడ్చుకుంది ప్రమీల. కనీసం పలకరించలేదు. ఆమెను చూడగానే గబగబా ఎదురెళ్ళి ‘‘ఆరోగ్యం ఎలా ఉంది?’’ అని అడిగి తాను చెయ్యి పట్టుకొని మంచం మీద పడుకోబెట్టింది పార్వతమ్మ.వేడి వేడి కాఫీ కలిపి అల్లుడికిచ్చి ఆమె చేత మెల్లగా తాగించింది. కొంచెం స్థిమిత పడ్డాక ఏమైందని అల్లుడిని అడిగింది.‘‘అమ్మకు గత కొంత కాలంగా గుండెల్లో నొప్పి వస్తోంది. మొన్న ఊళ్ళో హాస్పిటల్లో చూపెడితేసిటీకి వెళ్ళి వైద్యం చేయించుకోండి అని చెప్పారు. బంధువులు నాకు ఫోను చేసి చెబితే అమ్మను తీసుకొచ్చాను..’’ చెప్పాడు ప్రసాదరావు.విసుక్కుంటూనే అందరికి వంట చేయడం మొదలుపెట్టింది ప్రమీల. ఆమర్నాడు తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించాడు ప్రసాదరావు. ‘‘వీలైనంత తొందర్లో బైపాస్ సర్జెరీ చేస్తే మంచిది’’ అని డాక్టర్ చెప్పాడు. ‘‘ఎన్ని రోజుల్లో చేయించాలి?’’ అడిగాడు ప్రసాదరావు.‘‘నాలుగైదు రోజుల్లో చేయిస్తే మంచిది. కొన్ని మెడిసిన్స్ ఇస్తాం...ఏం ఫరవాలేదు ఈ లోపల మీరు డబ్బు రెడీ చేసుకోండి’’ అని చెప్పాడు డాక్టర్.ఇంటికొచ్చిన ప్రసాదరావు తనకు కావలసిన డబ్బు డ్రా చేసుకొచ్చాడు.‘‘నేను ఆఫీసుకు సెలవు పెట్టాను. రేపో, ఎల్లుండో అమ్మకు ఆపరేషన్ జరగొచ్చు’’ అని భార్యకు అత్తగారికి చెప్పాడు.తలనొప్పిగా ఉండటంతో ప్రమీలని కాస్త కాఫీ చేసిమ్మన్నాడు..కళ్ళు మూసుకోని సోఫాలో కూర్చున్నాడు.ఇంతలో కెవ్వున కేక వినబడింది. అటు వంటింట్లోంచి ప్రమీల, ఇటు ప్రసాదరావు గాబరాగా పరుగెత్తుకెళ్ళారు.మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళిన పార్వతమ్మ బట్టలు తీసుకుని వస్తూ పై మెట్టు నుండీ జారి దొర్లుకుంటూ కింద పడి ఉంది. తలకు దెబ్బతగిలిందేమో విపరీతమైన రక్తస్రావం. నుదుటి మీదకి కారుతోంది. తల్లిని అలాంటి స్థితిలో చూసిన ప్రమీల భోరున ఏడ్చేస్తోంది. ప్రసాదరావు ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని హాల్లోకి తెచ్చి అంబులెన్స్‌కు ఫోన్ చేసి కారిన రక్తాన్ని తుడిచి తలకు కట్టుకట్టాడు. పార్వతమ్మ అపస్మారక స్థితిలోనే ఉంది. అంబులెన్స్ రాగానే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.డాక్టర్లు ఆమెను చూసి వెంటనే ఐసీయూలో జాయిన్ చేశారు. కాసేపటికి డాక్టర్ వచ్చి–‘‘తలకు బలమైన దెబ్బ తగిలింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాటయ్యింది. వెంటనే ఆపరేషన్ చేయాలి. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఛాన్సెస్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ’’ అని చెప్పాడు. ప్రమీల బావురుమంది. అన్నయకు ఫోను చేయమంది. ప్రసాదరావు ఏ మాత్రం ఆలోచించకుండా ‘‘ఓకే డాక్టర్ మీరు ఆపరేషన్ చేయండి. ఎంత డబ్బైనా పరవాలేదు..’’ అన్నాడు.ప్రసాదరావు డబ్బులు కట్టడంతో వెంటనే ఆపరేషన్ చేసి ‘‘నో ప్రాబ్లమ్. షి విల్ బి ఆల్ రైట్’’ అని చెప్పాడు డాక్టర్.తల్లికి గండం తప్పినందుకు సంతోషించిన ప్రమీలకి జ్ఞానోదయమైంది. తన తల్లి ప్రాణాప్రాయ స్థితిలో ఉంటే మానవత్వంతో డబ్బులన్నీ ఖర్చుచేసి ఆమె ప్రాణం నిలవాలని తపించాడు తన భర్త. తన తల్లికి ఆపరేషన్ కోసం పెట్టుకున్న డబ్బుని ఏ మాత్రం ముందూ వెనుకా ఆలోచించకుండా తన తల్లి ఆపరేషన్ కి ఇచ్చేశాడు.‘ ‘నా భర్త దేవుడు. నేను మాత్రం అతని తల్లిని ఈసడించుకుంచు, ఆడిపోసుకుంటూ ఎంతో బాధ పెట్టాను. నా ప్రవర్తనతో ఆయన మనసెంత క్షోభించిందో’’ పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ప్రమీల.కన్నీళ్ళతో తన పాదాలను పట్టుకుని క్షమించమని అడుగుతున్న ప్రమీలని రెండుచేతులతో లేవనెత్తి కళ్ళు తుడిచాడు ప్రసాదరావు. అత్తగారి ఆపరేషన్‌కై తన నగలమ్మి డబ్బు తెమ్మన్న భార్యని చూసి ఆశ్చర్యపోయాడు. తన తల్లితో పాటు అత్తగారిని కూడా కంటి రెప్పలా చూసుకుంటూ సేవలు చేసింది ప్రమీల. ‘‘మీ మనసు నొప్పించినందుకు క్షమించండి’’ అని అత్తగారి దగ్గర భోరుమని విలపించింది. ఇక అత్తగారు ఉళ్ళో ఉండవలసిన అవసరం లేదని తమ దగ్గరే ఉండమని వేడుకుంది. అత్తను కూడా అమ్మలా ప్రేమగా చూసుకుంటున్న ప్రమీలను చూసి మనసారా ఆనందించాడు ప్రసాదరావు. -
కన్నీటి ఎడారి
గల్ఫ్ వెళ్లాక పార్వతమ్మ ఏడ్వని రోజు లేదు. మూడేళ్లు ఆమె కన్నీటితో ఎడారి తడిసింది!భర్త పోయాడు. తెలియనివ్వలేదు. తండ్రి పోయాడు. తెలియనివ్వలేదు.అత్తమ్మ పోయింది. తెలియనివ్వలేదు.కనీసం..‘నేనిక్కడ క్షేమం కాదు’ అని చెప్పేందుకు..‘అమ్మా ఎలా ఉన్నావు’ అని అడిగేందుకు.. దారే లేని దుర్భర జీవితం!!చదవండి. ఎడారి గుండెనే పిండేసే కన్నీటి వ్యథ ఇది. కుటుంబాన్ని పోషించడానికి పెద్ద దిక్కుగా మారి విదేశంలో అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా నరకమే ఎదురైంది. మూడు నెలలపాటు తిండి లేదు.. నిద్ర లేదు.. ఇంటిమీద బెంగతో ఓ ప్రక్క అల్లాడిపోతూనే మరో పక్క సే పెడుతున్న చిత్రహింసలను భరించింది. రాత్రి 12 గంటలకు పడుకుంటే మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేపుతారు. కేవలం నాలుగైదు గంటల నిద్రతోనే కాలం వెళ్లదీసింది. చివరికి జీతం కూడా ఆమెకు సక్రమంగా ఇవ్వలేదు. రెండేళ్లపాటు ఆమెను కుటుంబీకులతో కూడా మాట్లాడించలేదు. భర్త చనిపోయాడన్న వార్తను ఆమెకు తెలియనీయలేదు. తెలిసిన తర్వాత ఊరికి పంపించాలని బ్రతిమాలినా సే పట్టించుకోలేదు. పంపకపోతే చనిపోతానని ఏడ్చినా వినలేదు. భర్త పోయాక తాళిబొట్టు ఎందుకంటూ మెడలోని నల్లపూసల దండను సేలాగి పడేశాడు. చనిపోవాలనుకుంటే చనిపో. పార్సిల్ చేసి ఇంటికి పంపుతానని బెదిరించాడు. ఆమె సౌదీ వెళ్లిన కొద్దిరోజులకే భర్త, నాన్న, అత్తమ్మలు తనువు చాలించారని తెలిసినా ఏమీ చేయలేని స్థితిలో నలుగురు బిడ్డలను తలుచుకుంటూనే అనుక్షణం ఒకమూల కూర్చొని ప్రతిరోజు ఒక యుగంలా గడిపింది పార్వతమ్మ. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు పరిధిలోని రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మ సరిగ్గా మూడేళ్ల క్రితం కుటుంబ పోషణ నిమిత్తమై సౌదీ అరేబియాకు పయనమైంది. భర్త నాగేంద్రనాయుడిని, పిల్లలను ఇక్కడ వదలి వెళ్లడం కష్టమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో పరాయిదేశానికి పయనమైంది. 2016 ఫిబ్రవరి 13వ తేదిన సౌదీకి వెళ్లిన పార్వతమ్మకు పరిస్థితులు భిన్నంగా కనిపించాయి. ఇక్కడ ఏజెంట్లు చెప్పిందొకటి.... అక్కడ చెయాల్సివచ్చింది మరొకటి. అక్కడ సే (రాజ్సే) తన బిడ్డను చూసుకునే పని అప్పజెప్పాడు. ఆయనకు ముగ్గురు పిల్లలైతే చివరి బిడ్డను పార్వతమ్మే చూసుకునేది. మూడేళ్లు జైలులో ఉన్నట్లే! పార్వతమ్మ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత నేరుగా వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. ఆరు నెలల వయస్సుగల బిడ్డను పార్వతమ్మ చేతిలో పెట్టారు. ఒక పాల బాటిల్ ఇచ్చి, బిడ్డ ఏడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్వతమ్మపై పెట్టారు. అంతేకాకుండా ఇంట్లో పనులు కూడా చేయించేవారు. బయటికి వెళ్లకుండా గేటుకు తాళం వేయడంతో ఎక్కడికీ వెళ్లడానికి ఆస్కారం లేదు. పారిపోవాలనిపించినా కాల్చి చంపుతారన్న భయంతో సే‡ ఇంటి ఆవరణలోని ఒక రూములో తలదాచుకుంటూ జీవనం సాగించింది. మూడేళ్లపాటు జైలు జీవితం కంటే అధ్వాన్నమైన పరిస్థితుల మధ్య కాలం వెళ్లదీసింది. అనుక్షణం కన్నీరే సమయానికి తిండి లేదు. కంటినిండా నిద్ర లేదు. ఎటూ వెళ్లలేక, అక్కడ ఉండలేక ఆమె అనుక్షణం రోదిస్తూనే ఉండేది. ఒక పక్క సే బిడ్డను ఏడ్వకుండా చూసుకుంటూనే మరోప్రక్క తన కన్నీళ్లను దిగమింగుకునేది. కష్టం చెప్పుకుంటే సేకొట్టడానికి వచ్చేవాడు. పైగా భాష సమస్య ఉండడంతో మూగ సైగలతోనే ఆమె మూడేళ్లు గడపాల్సి వచ్చింది.కుటుంబాన్నీ కోల్పోయిందిపార్వతమ్మ సౌదీ వెళ్లిన సంవత్సరంలోపే.. భర్త నాగేంద్రనాయుడు తనువు చాలించాడు. భార్య సౌదీ వెళ్లిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ రాకపోవడం.. క్షేమ సమాచారం తెలియకపోవడంతో మనోవేదనతోనే చనిపోయాడు. తర్వాత పార్వతమ్మ తండ్రి తాతిరెడ్డినాయుడు కూడా అనారోగ్యంతో మృత్యువాతపడ్డాడు. అత్తమ్మ రామసుబ్బమ్మ 2018 జూన్‌లో మృతి చెందింది. అయితే భర్త చనిపోయినపుడు కూడా పార్వతమ్మకు కుటుంబీకులు చెప్పడానికి ఫోన్ నెంబరు తెలియని పరిస్థితి. దీంతో స్థానికంగా ఉన్న ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని భర్త చనిపోయిన మూడు నెలలకు పార్వతమ్మ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పార్వతమ్మ స్వదేశం వెళ్లాలని పట్టుబట్టినా సే నిరాకరించారు. చివరికి ఈ ఒక్కసారైనా కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడించాలని కాళ్లా వేళ్లా పడినా కనికరించలేదు.కుటుంబం కోసం గల్ఫ్ వెళ్లిన మూడేళ్లలోనే ముగ్గురిని కోల్పోవడంతో పార్వతమ్మ వేదనకు అంతే లేకుండా పోయింది. రెండేళ్లపాటు ఒక్క ఫోన్ కాల్ లేదు గల్ఫ్ వెళ్లిన తర్వాత పార్వతమ్మకు సంబంధించిన సమాచారం కుటుంబీకులకు లేదు. ఏమైందో తెలియదు. ఎక్కడుందో తెలియదు. అసలు ఉందా, లేదా సమాచారం కూడా తెలిపే దిక్కులేదు. కారణం అక్కడికి వెళ్లిన తర్వాత కనీసం ఇక్కడికి ఫోన్ చేసుకోవడానికి ఒక్కసారి కూడా పార్వతమ్మకు అవకాశం రాకపోవడం. 2017 సంవత్సరం చివరన పార్వతమ్మ అత్త రామసుబ్బమ్మ కడప కలెక్టరేట్‌కు వచ్చి జిల్లా అధికారులను కలిసింది. అంతకుముందు కూడా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభ్యర్థించి ఉండడంతో చలనం మొదలైంది. రెండేళ్ల తర్వాత మొదటి ఫోన్ కాల్ కుటుంబ సభ్యులకు వచ్చిందంటే ఎంతటి విపత్కర పరిస్థితిని పార్వతమ్మ అక్కడ అనుభవించిందో చెప్పకనే తెలిసిపోతోంది. ‘కనీసం నా బిడ్డలతో ఒక్కసారైనా మాట్లాడించండి.. మీ బిడ్డను ఇంత బాగా చూసుకుంటున్నా... కనికరించండి’ అని మొత్తుకున్నా సేuŠ‡ పట్టించుకోలేదని పార్వతమ్మ బోరున విలపించింది. ఇక్కడ ఆమె నలుగురు పిల్లలు వనజ, రెడ్డి నాగ శంకర్ నాయుడు, శైలజ, సునీల్‌కుమార్, మామ అనుక్షణం ఆమె క్షేమ సమాచారం కోసం పరితపిస్తూనే ఉన్నారు. ఏం చేయాలో పాలుపోక కనిపించిన ప్రతి అధికారిని కలిసి వేడుకోవడం మొదలు పెట్టారు. స్థానిక ఎస్ఐ మంజునాథ్ లోకల్‌గా ఉండి పార్వతమ్మను గల్ఫ్‌కు పంపిన ఏజెంట్లను పిలిపించి.. ‘పార్వతమ్మ అత్త చనిపోయింది, 45 రోజుల్లోపు రప్పించాల్సిందే’నని గట్టిగా మందలించడం.. సాక్షి టాబ్లాయిడ్లో వరుసగా కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో చివరికి సెప్టెంబరులో పార్వతమ్మకు విముక్తి లభించింది. అక్కడి నుంచి స్వదేశానికి పంపించారు. మూడేళ్లు గడిచినా జీతం లేదు ఏజెంట్లు ఏం మాట్లాడుకున్నారో ఏమో.. సే మాత్రం ఈ మూడేళ్లలో ఒక్క నెల కూడా జీతం ఇవ్వలేదని పార్వతమ్మ ‘సాక్షి’తో తన గోడు వెళ్లబోసుకుంది. ‘పిల్లలు ఉన్నారు, కుటుంబం ఇబ్బంది పడుతోంది.. జీతం ఇవ్వండి’ అని ఎన్నిమార్లు అడిగినా పలకనే పలకలేదని వాపోయింది. చివరకు ఊరికి వచ్చేటపుడు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, సౌదీ నుంచి దుబాయ్ వచ్చి అక్కడి నుంచి నేరుగా స్వదేశానికి వచ్చానని పార్వతమ్మ తెలిపింది. – బీవీ నాగిరెడ్డి, సాక్షి, వైఎస్సార్ జిల్లా మా కోడలు మాకు దక్కుతుందని అనుకోలేదు మా కోడలు పార్వతమ్మ మాకు దక్కుతుందని అసలు ఊహించలేదు. సౌదీ అరేబియా వెళ్లిన నాటి నుంచి రెండేళ్ల వరకు జాడ తెలియక మేము పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసుస్టేషన్ మొదలుకొని రాజకీయ నాయకులు, జిల్లా పోలీసు అధికారులు, కలెక్టర్, ఏజెంట్లు, ఇలా అందరినీ అడిగాను. కానీ ఎవరిని అడిగినా కోడలి అడ్రస్ దొరకలేదు. నేను నా భార్య, మనవళ్లు, మనవరాళ్లతో అన్నిచోట్లకు తిరిగి అమ్మతో మాట్లాడించాలని కోరాం. ఏజెంట్లను బ్రతిమాలాము. సాక్షి పత్రిక వారు మా బాధను అర్థం చేసుకుని ఆరేడుసార్లు పేపరులో రాశారు. మాకైతే ఒకరకంగా ఆమెపై ఆశే లేదు. ఎందుకంటే వెళ్లినప్పటి నుంచి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అసలు ఉందో, లేదో తెలియదు. భాష రాని చోట ఏమైందో అన్న బెంగతోనే భయపడుతూ రెండేళ్లు గడిపాం. చివరకు కొడుకును, వియ్యంకుడిని, భార్యను పోగొట్టుకున్న సందర్బంలోనూ కోడలికి తెలియజేసే ప్రయత్నం ఏజెంట్ల ద్వారా చేసినా తెలిసిందో, తెలియదోనన్న బెంగ వెంటాడింది. కుటుంబీకులు చనిపోయినపుడే పార్వతమ్మను స్వదేశానికి పంపని సేuŠ‡లు ఆ తర్వాత ఏం పంపిస్తారని అనుకున్నాం. దేవుని దయవల్ల పోలీసులు, సాక్షి పేపరోళ్ల పుణ్యమా అని మా కోడలు ఇంటికి రావడంతో పిల్లలు అనాథలు కాకుండా మిగిలారు! – వెంకట రమణ నాయుడు, పార్వతమ్మ మామ -
అమ్మ వచ్చింది!
సాక్షి కడప : అమ్మకోసం ఎదురుచూపులు.. కళ్లు కాయలు కాస్తున్నా కనిపించడం లేదు..అమ్మ రాక..నాన్న లేక..అనుక్షణం పిల్లలు తల్లిదండ్రులను తలుచుకుంటూ పడిన వేదన వర్ణణాతీతం. ‘సాక్షి’లో వరుసగా కథనాలు రావడం... స్పందించిన అధికారులు కదలడం... దేవుడి ఆశీర్వాదంతో ఎట్టకేలకు ఆ తల్లి సొంత ఊరుకి చేరుకున్నారు. చిన్నారులు తన్మయత్వంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మురిసిపోయారు. చెప్పడానికి... పంచుకోవడానికి కూడా మాటలు రాని ఆనందంలో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబం కోసం సౌదీలో ఎన్నో కష్టాలు పడిన తల్లి పార్వతమ్మ స్వగ్రామంలో కుటుంబ సభ్యులను చూడగానే పడిన ఆనందం అంతా ఇంతా కాదు.గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మ సరిగ్గా మూడేళ్ల క్రితం కుటుంబ జీవనం కోసం కువైట్‌కు వెళ్లింది. రెండేళ్ల వరకు ఒక్క ఫోన్‌కాల్ లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. పార్వతమ్మ ఎలా ఉందో తెలియని పరిస్థితి. కుటుంబ సభ్యులు తల్లడిల్లుతూనే ఆమె ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. పార్వతమ్మ కువైట్‌కు వెళ్లినప్పటి నుంచి చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న రామసుబ్బమ్మ 2017 జూన్ ప్రాంతంలో కడపకు వచ్చి కలెక్టర్, ఎస్పీలను కలిసింది. ఈ ఏడాది జూన్ మాసంలో ఆమె పాముకాటుతో మృతి చెందింది. అంతకుముందు పార్వతమ్మ భర్త నాగేంద్రనాయుడు కూడా తనువు చాలించారు. అప్పటినుంచి ఐదుగురు పిల్లలను వెంకట రమణనాయుడు చూసుకుంటూ వస్తున్నారు. నడవడం కష్టంగా ఉన్నా చిన్నారులను మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటూవచ్చారు. ఈ క్రమంలో 2018లో వెంకట రమణనాయుడు మనవళ్లు మనవరాళ్లతో కలిసి కడపలోని డీఆర్డీఏ అధికారులు,ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఎస్పీ బాబూజీ అట్టాడ బంధం యాప్ ద్వారా ప్రత్యేకంగా రప్పించేందుకు తమవంతుగా ప్రయత్నం చేశారు. అలాగే గాలివీడు ఎస్ఐ రఘునాథ్ కూడా స్థానిక ఏజెంటును పిలిపించి గట్టిగా మందలించడం, రెండు నెలల్లోపు పార్వతమ్మను పిలిపించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఎట్టకేలకు పార్వతమ్మను సొంతూరికి పిలిపించారు. ఎమ్మెల్యే గడికోట చొరవ పార్వతమ్మ కువైట్‌కు వెళ్లి మూడేళ్లయినా ఆచూకీ లేని నేపథ్యంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విషయం తెలుసుకుని చొరవ చూపారు. కువైట్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్‌తోపాటు మరికొందరితో మాట్లాడారు. పలుమార్లు కువైట్‌లో ఉన్న తెలుగు వారితో చర్చిస్తూ పార్వతమ్మను రప్పించడంలో తనవంతు పాత్ర పోషించారు. కదిలించిన ‘సాక్షి’కథనాలు కువైట్‌కు వెళ్లిన పార్వతమ్మ ఆచూకీ దొరకని విషయాన్ని తెలుసుకున్న సాక్షి వరుస కథనాలతో కదలిక తెచ్చింది. అంతేకాకుండా ‘సాక్షి’ప్రతినిధి మానవీయ కోణంలో ఆలోచనచేస్తూ సంబంధిత డీఆర్డీఏ అధికారులతో మాట్లాడటంతోపాటు జిల్లా పోలీసు అధికారులకు ప్రతిసారి గుర్తుచేస్తూ వచ్చారు. 2017 నుంచి ‘అమ్మకోసం, ఏదీ పార్వతమ్మ, అమ్మలేదు–అవ్వరాదు, అమ్మ కావాలి, ఎదురుచూపులు’శీర్షికలతో సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. పోలీసులు కూడా స్పందించి ఏజెంట్ల ద్వారా చర్చించారు. పార్వతమ్మ సొంతూరికి రావడంలో సాక్షి ఎనలేని కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
-
వీడని మిస్టరీ!!
∙ రెండేళ్లుగా కనిపించని పార్వతమ్మ ∙ ఆచూకీ లేక వేదనతో తనువు చాలించిన భర్త...తండ్రి ∙ పోలీసులకు పలుమార్లు విన్నవించినా ఫలితం శూన్యం ∙ అసలు ఉందా...లేక మృతి చెందిందా అన్నది తెలియని వైనం ∙ కలెక్టర్, ఎస్పీ స్పందిస్తేనే... పార్వతమ్మ జాడ తెలిసే అవకాశం కడప: కుటుంబ కష్టాలు తీరుస్తానని.. ఇంటికి ఆసరాగా నిలుస్తానని చెప్పి కువైట్‌కు వెళ్లిన పార్వతమ్మ ఆచూకీ లభించక రెండేళ్లు గడిచింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. తిరగని చోటు లేదు. అసలు పార్వతమ్మ ఉందా? లేక సేట్లు ఏమైనా చేశారా అంటూ ఆమె కుటుంబ సభ్యులు మనోవేదనతో తల్లడిల్లిపోతున్నారు. ఇటీవల పార్వతమ్మ పిల్లలు నలుగురితోపాటు వారి నానమ్మ రామసుబ్బమ్మ కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. పార్వతమ్మ....ఎక్కడున్నావమ్మా....! గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మ రెండేళ్ల క్రితం కుటుంబ పోషణ నిమిత్తం కువైట్‌కు వెళ్లింది. అప్పటినుంచి ఇప్పటివరకు జాడ లేకపోవడంతో ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది. పార్వతమ్మకు నలుగురు పిల్లలు. అందులో వనజ (10), రెడ్డి నాగశంకర్‌నాయుడు (9), శైలజ (6), సునీల్‌కుమార్‌నాయుడు (3)లు అందరూ చిన్న పిల్లలే. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరి ఆలన, పాలన నానమ్మ రామసుబ్బమ్మ చూస్తోంది. పార్వతమ్మ కనిపించలేదని వేదనతో ఇద్దరు మృతి పార్వతమ్మ ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఆచూకీ లేదు. ఆమె ఏమైందో తెలియక తీవ్ర వేదనకు గురైన పార్వతమ్మ భర్త నాగేంద్ర రెండునెలల క్రితం మృత్యువాతపడ్డాడు. 15 రోజుల క్రితం రాయచోటి మండలం మాధవరం పంచాయతీలోని పాలెవారిపల్లెకు చెందిన పార్వతమ్మ తండ్రి తాతినాయుడు కూడా మృతి చెందారు. సరైన సమాచారం ఇవ్వని ఏజెంట్ పార్వతమ్మ ఆచూకీ కోసం కుటుంబం తల్లడిల్లిపోతున్నా ఆమెను కువైట్‌కు పంపిన ఏజెంటు మాత్రం నోరు విప్ప డం లేదు. రామసుబ్బమ్మ పలుమార్లు వెళ్లి ఏజెంటును కలిసి ప్రశ్నించినా ఏమో తెలియదు.. పంపించాము మా పని అయిపోయిందన్నట్లు చెబుతున్నారని వారు వాపోతున్నారు. కలెక్టర్, ఎస్పీ స్పందిస్తేనే... పార్వతమ్మ ఇంటి నుంచి వెళ్లి రెండేళ్లు దాటుతున్న నేపథ్యంలో ఒక కుటుంబం పడుతున్న వేదనను గుర్తించి కలెక్టర్ బాబూరావునాయుడు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణలు స్పందిస్తేనే ఏదైనా సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రామసుబ్బమ్మతోపాటు పిల్లలు వచ్చి కలెక్టర్‌ను కలిసి వెళ్లారు. స్థానికంగా ఉన్న పోలీసుస్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందిస్తేనే న్యాయం జరగుతుందని రామసుబ్బమ్మ కుటుంబం ఆశతో ఎదురు చూస్తోంది. -
తల్లిని చంపి.. గదికి తాళం వేసి..
ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన కూతురు నాలుగు రోజులుగా ఇంట్లోనే మృతదేహం దుర్వాసన రావడంతో ఆలస్యంగా వెలుగులోకి.. నవాబుపేట: తల్లిని ఓ కూతురు దారుణంగా హత్య చేసింది. 4 రోజులపాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. నవా బుపేట మండలం ఇప్పటూర్‌కు చెందిన నర్సమ్మ(79), జంగయ్య భార్యాభర్తలు. వారికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కూతురు పార్వతమ్మను భర్త వదిలేయడంతో కొన్నేళ్లుగా తల్లి వద్దే ఉంటోంది. తరచూ తల్లితో గొడవ పడేది. ఈ క్రమంలో 4 రోజుల క్రితం కూడా గొడవ పడింది. కర్రతో తలపై బాదడంతో తల్లి రక్తస్రావమై పడిపోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి వృద్ధురా లిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. మృతదేహంతో నాలుగు రోజులు తల్లిని హత్య చేసిన పార్వతమ్మ భయాందోళనకు గురై మృతదేహంతో నాలుగు రోజులు గడిపింది. తల్లి ఉన్న గదికి తాళం వేసి వేరేగదిలో ఉంది. మృతదేహం కుళ్లిపోయి ఇం ట్లో నుంచి దుర్వాసన రావటంతో గురువారం ఇరుగు పొరుగువారు నిలదీశారు. దీంతో అమ్మ ఆత్మహత్య చేసు కుందని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమెపై అనుమానం వచ్చి వారు ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడి ఆనవాళ్లను బట్టి కూతురే హత్య చేసినట్లు అనుమానించారు. వెంటనే పోలీ సులకు సమాచారమివ్వడంతో వారొచ్చి విచారణ చేప ట్టారు. చేసేదిలేక చేసిన నేరం ఒప్పుకుంది. కోపంలో 4 రోజుల క్రితమే చంపానని ఒప్పుకుంది. చేరదీసినా చంపేసింది.. పన్నెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పార్వతమ్మకు పెళ్లి చేసింది. కొంతకాలానికే కూతురు వ్యవ హార శైలి నచ్చక భర్త వదిలేశాడు. దీంతో తల్లి చేరదీసి తనతోపాటే ఇంట్లో పెట్టుకుంది. కూలీనాలీ చేసుకుంటూ తల్లీకూతుళ్లు కాలం వెళ్లదీసేవారు. తల్లి వయసు మీద పడినప్పటి నుంచి ఆమెతో తగువు పడటం మొదలుపెట్టింది. డీఎస్పీ విచారణ విషయం తెలుసుకున్న డీఎస్పీ భాస్కర్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఇరుగు పొరుగు వారితో సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. నాడు కొడుకు చేతిలో తండ్రి ఐదేళ్ల క్రితం నర్సమ్మ భర్త జంగయ్యను కన్నకొడుకే హత్య చేశాడు. పెద్ద కుమారుడు నారాయణ తాగిన మైకంలో ఇంట్లోనే కర్రతో మోది దారుణంగా చంపేశాడు. అతనిపై కేసు నమోదవగా ప్రస్తుతం ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తల్లికి ఆసరాగా ఉంటుందనుకున్న కూతురు కూడా అదేబాటలో నడవడంతో గ్రామస్తులు ఆమెపై శాపనార్థాలు పెట్టారు. -
వృద్ధురాలి నేత్ర దానం
సంగాలపల్లె (వీరపునాయునిపల్లె): మండల పరిధిలోని సంగాలపల్లె గ్రామానికి చెందిన ఎరమల పార్వతమ్మ(60) శుక్రవారం మృతిచెందింది. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజుకు సమాచారం అందచేశారు. వెంటనే సమితి అధ్యక్షుడు రాజు, స్నేహ సేవా సమితి అధ్యక్షుడు మధుసూదనరెడ్డిలు గ్రామానికి చేరుకొని ఆమె నేత్రాల నుంచి కార్నియాను తొలగించారు. వీటిని హైదరాబాద్‌లోని నేత్రాలయానికి తరలించన్నుట్లు వారు విలేకరులకు తెలిపారు. నేత్ర దానం చేసిన పార్వతమ్మ భర్త జయరామిరెడ్డి కుటుంబ సభ్యులను వారు అభినందించారు. -
వృద్ధురాలి నేత్ర దానం
సంగాలపల్లె (వీరపునాయునిపల్లె): మండల పరిధిలోని సంగాలపల్లె గ్రామానికి చెందిన ఎరమల పార్వతమ్మ(60) శుక్రవారం మృతిచెందింది. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజుకు సమాచారం అందచేశారు. వెంటనే సమితి అధ్యక్షుడు రాజు, స్నేహ సేవా సమితి అధ్యక్షుడు మధుసూదనరెడ్డిలు గ్రామానికి చేరుకొని ఆమె నేత్రాల నుంచి కార్నియాను తొలగించారు. వీటిని హైదరాబాద్‌లోని నేత్రాలయానికి తరలించన్నుట్లు వారు విలేకరులకు తెలిపారు. నేత్ర దానం చేసిన పార్వతమ్మ భర్త జయరామిరెడ్డి కుటుంబ సభ్యులను వారు అభినందించారు. -
స్నాచర్ల చేతిలో గాయపడ్డ మహిళమహిళకు గాయాలు
బైక్ పై వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లడానికి ప్రయత్నించడంతో.. అప్రమత్తమైన మహిళ స్నాచర్ చేయి గట్టిగా పట్టుకుంది. దింతో వాహనం పై నుంచి పడి తీవ్ర గాయాలపాలైంది. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. జక్కాపూర్‌కు చెందిన పార్వతమ్మ భర్తతో కలిసి బైక్‌పై గుర్రాలగొంది వైపు వస్తున్న సమయంలో.. బైక్‌ను వెంబడిస్తున్న గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పార్వతమ్మ స్నాచర్ చేయి గట్టిగా పట్టుకోవడంతో.. బైక్ పై నుంచి కిందపడింది. ఇది గమనించిన స్నాచర్లు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించిన భర్త ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఎంపీడీవో తీరుపై ఎమ్మెల్యే ధర్నా
చిత్తూరు: మండల సర్వసభ్య సమావేశంలోకి అనర్హులకు ప్రవేశం కల్పించి కాలాన్ని వృధా చేస్తున్నారంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నాకు దిగారు. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 12.00 గంటలైనా ఎందుకు ప్రారంభించలేదని ఎంపీడీవో పార్వతమ్మపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగిల్ విండో చైర్మన్లు తదితరులను సమావేశానికి ఎలా రానిస్తారని ఎంపీడీవోను ఆయన ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు సమావేశం జరుపుతామని ఎమ్మెల్యేకు ఎంపీడీవో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అక్కడే ధర్నాకు దిగారు. కోరం లేకున్నా ఎంపీడీవో పార్వతమ్మ మాత్రం ఈ సమావేశాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. -
పంతంగి పంతం
చిత్రహింసకు విచిత్ర సమాధి గ్రామీణ మహిళకు అవమానం అంటే ఏంటో తెలియదు! తాము అవమానానికి గురువుతున్నారన్నది గ్రహించలేని వ్యవస్థలో కూరుకుపోయారేమో అనిపిస్తుంది. అత్తమామల సేవలు, పిల్లల పెంపకం, భర్తకు ఊడిగం, ఇంటి పని, కూలి పని... ఇంత చేస్తున్నా... గుర్తింపు మాట దేవుడెరుగు... అవమానం మాత్రం రోజూ మింగాల్సిన ముద్దే. ఇది కాకుండా అప్పుడప్పుడూ... చీత్కారాలు, చిత్రహింసలు! ఇంకొన్నిసార్లు చావు దెబ్బలే! పంతంగి పంతం పట్టింది. భార్యను చంపిన భర్త ఇంటి ముందే ఆవిడ సమాధి కట్టింది. కట్టింది... ఈ దుర్మార్గపు వ్యవస్థను కూల్చడానికే. చిత్రహింసకు ఇంతకంటే విచిత్రమైన సమాధి మనం ఎప్పుడూ చూసి ఉండం. హైదరాబాద్‌కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గ్రామం. పేరు పంతంగి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉండే ఈ గ్రామంలో నాలుగు నెలల క్రితం ఓ దారుణ హత్య జరిగింది. మిర్యాల శ్రీశైలం అనే అతను తన భార్య పార్వతమ్మను తలపై రోకలిబండతో బాది చంపాడు. ఊరు ఊరంతా ఈ సంఘటనతో అదిరిపోయింది. పంచనామా తర్వాత అందరిలాగే పార్వతమ్మ మృతదేహాన్ని కూడా శ్మశానంలో ఖననం చేసేవారే! కానీ, ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని, మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, నిందితుడి ఇంటి ఎదుటే మృతదేహంతో ఆందోళనకు దిగారు ఆ గ్రామ మహిళలు. అయితే శ్రీశైలం కుటుంబ సభ్యుల నుంచి స్పందన కరువైంది. దీంతో నిందితుని ఇంటి ఎదుటే గుంతను తవ్వి శవాన్ని పూడ్చిపెట్టారు. దానిపై సమాధిని నిర్మించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారంతో నిందితుని ఇంటి పక్కనే ఉన్న రెండెకరాల స్థలంలో పార్వతమ్మ మృతికి స్మారకంగా స్థూపాన్ని నిర్మించారు. అక్కడే సంతాపసభ నిర్వహించారు. స్త్రీలపై జరిగే ఇలాంటి కిరాతక చర్యలకు పూనుకునేవారికి ఈ సంఘటన ఓ గుణపాఠం కావాలని నినదించారు. అసలు ఏం జరిగిందంటే... పార్వతమ్మ వయసు 24, శ్రీశైలం వయసు 28. ఇద్దరిదీ ఒకే గ్రామం. నాలుగేళ్ల క్రితం వీరికి వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి శ్రీశైలం నిత్యం పార్వతమ్మను వేధింపులకు గురి చేసేవాడు. అతనికి అతని కుటుంబసభ్యులూ మద్దతుగా ఉండేవారు. ఈ వేధింపులు తాళలేక పార్వతమ్మ ఆర్నెల్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. శ్రీశైలం అప్పుడప్పుడు పార్వతమ్మ దగ్గరికి వెళ్లి, ఇంటికి రమ్మని పిలిచేవాడు. పార్వతమ్మ ససేమిరా అనేది. రెండు నెలల క్రితం మళ్లీ పార్వతమ్మ దగ్గరికి వెళ్లిన శ్రీశైలం ‘ఇంటికి రమ్మని, లేదంటే కత్తిపీటతో కోసుకుంటా’నని బెదిరించాడు. ఆమె భయపడి కత్తిపీటను లాక్కుంది. శ్రీశైలమే చాకుతో చేయి కోసుకున్నాడు. ఇంటికి రమ్మని పిలిచినందుకు పార్వతమ్మే తనను కత్తితో కోసిందని ఊర్లో అందరికీ చెప్పాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య సమస్య మరింత జటిలమైంది. నెల రోజుల తర్వాత శ్రీశైలం మళ్లీ పార్వతమ్మ వద్దకు వెళ్లాడు. ఇంటికి రమ్మని అడిగాడు. ‘కత్తితో చేయి కోసిందెవరో తేలాలి, ఈ విషయం ఊళ్లో అందరికీ తెలియాలి. అప్పుడే వస్తాన’ని చెప్పింది. అందుకు శ్రీశైలం పెద్ద మనుషుల సమక్షంలో తప్పు ఒప్పుకుంటానని చెప్పాడు. తప్పు ఒప్పుకున్ననాడే వస్తానని చెప్పి, తన పనిలోకి వెళ్లిపోయింది పార్వతమ్మ. తనను భార్య ఏ మాత్రం లెక్కచేయడం లేదని కోపంతో ఉడికిపోయాడు శ్రీశైలం. అక్కడే ఉన్న రోకలిబండను అందుకుని, పార్వతమ్మ కోసం వెదుక్కుంటూ వెళ్లాడు. నీళ్ల సంపు వద్ద బట్టలు ఉతుకుతున్న పార్వతమ్మ కనిపించింది. ఆమె తలపై రోకలిబండతో మోదాడు. దాంతో పార్వతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీశైలం, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. శ్రీశైలం జైలులోనే ఉన్నాడు. అతని కుటుంబసభ్యులు మాత్రం విడుదలయ్యారు. ఊర్లోకి వచ్చిన వారు ఇంటి ముందు సమాధి, స్మారకస్తూపాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. - కనకల లింగస్వామి సాక్షి, చౌటుప్పల్, నల్లగొండ జిల్లా కరెక్టు కావచ్చు కానీ... పార్వతమ్మను క్రూరంగా హత్య చేసిన భర్త, అత్తమామలను రెండు రోజుల్లోనే రిమాండ్ చేశాం. పకడ్బందీ సాక్ష్యాలతో చార్జిషీటు వేశాం. ఇక అతని ఇంటి ముందే పార్వతమ్మ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం సామాజిక న్యాయపరంగా ప్రజలకు సమర్థనీయమైన చర్యగా అనిపించినా, చట్టపరంగా ఇది సరికాదు. - భూపతి గట్టుమల్లు పోలీస్ ఇన్స్పెక్టర్, చౌటుప్పల్ మరణ శిక్ష విధించినా తక్కువే అన్యాయంగా నాబిడ్డను పొట్టన పెట్టుకుండు, నా ఇంటికే వచ్చి, ఇక్కడున్న నాబిడ్డను కొట్టిచంపిండు. వాడికి మరణశిక్ష విధించినా తక్కువే. జీవితాంతం జైలులోనే ఉంచాలి. ఇంటి ముందు శవాన్ని పూడ్చిపెడితే, వాళ్ల ఇంటిని ధ్వంసం చేశామని, ఇంట్లోని విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లామని మాపైనే, 18మందిపై పోలీసు కేసు పెట్టిండ్రు. కోర్టు చుట్టు తిరుగుతున్నం. - కడగంచి బీరప్ప పార్వతమ్మ తండ్రి మరో మహిళకు జరగకూడదు పార్వతమ్మ తల్లిదండ్రులకు ఇద్దరే కూతుళ్లు. పెద్ద కూతురే పార్వతమ్మ. పెళ్లి అయిన నాటి నుంచే పార్వతమ్మను నానా రకాలుగా వేధింపులకు గురి చేసేవాడు శ్రీశైలం. ఏ పనీచేసేవాడు కాదు. కుటుంబ సభ్యులు కూడా అతనికి వంతపాడారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటిలో తలదాచుకుంటున్న పార్వతమ్మను ఆమె బతుకేదో ఆమెను బతకనీయకుండా దారుణంగా చంపాడు. మరో మహిళకు ఇలా జరగకూడదు. - బోయ కవిత, గ్రామస్థురాలు పార్వతమ్మ మరణాన్ని అంతా తలుచుకోవాలి భార్యలను వేధించే వారు పార్వతమ్మ మరణాన్ని తలుచుకోవాలి. ఆ కుటుంబంలో అలుముకున్న చీకట్లు తమ జీవితంలోనూ పొడసూపవచ్చని గుర్తించాలి. నేరస్థుడి కుటుంబ సభ్యులు పార్వతమ్మ సమాధిని, స్థూపాన్ని చూసి నిత్యం పశ్చాత్తాపపడాలి. అందుకే వారి ఇంటి ఎదుటే సమాధిని కట్టించాం. - కడగంచి ధనమ్మ గ్రామస్థురాలు -
ఓ అమ్మకథ..!
*ఆత్మస్థైర్యం ముందు ఓడిన పేదరికం *కూలి పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్న పార్వతమ్మ * తల్లి కష్టాన్ని వమ్ము చేయకుండా ముందుకుసాగుతున్న తనయులు లావేరు: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని అదపాక గ్రామానికి చెందిన మీసాల సత్యం, పార్వతమ్మలది నిరుపేద కుటుంబం. ఉండడానికి సెంటు భూమి లేదు. ఇల్లు లేదు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ఆలుమగలు ఇద్దరూ కష్టపడుతూ వచ్చిన కూలి డబ్బులతో తమ ముగ్గురు పిల్లలు (ఇద్దరు కుమారులు, కుమార్తె)కు ఏ లోటూ లేకుండా పెంచుకుంటూ వస్తున్నారు. ఇంతలో ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. పక్షవాతం రూపంలో ఇంటి యజమానిని మృత్యువు కాటేసింది. అంతే... కుటుంబం రోడ్డున పడింది. కళ్లు తెరచి చూస్తే పార్వతమ్మకు అంతా అంధకారమే కనిపించింది. ఓ వైపు చిరుప్రాయంలో ఉన్న పిల్లలు.. మరో వైపు జీవన భారం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియని పరిస్థితి. ఆత్మస్థైర్యం కోల్పోతే పిల్లలు రోడ్డున పడిపోతారని భావించింది. గుండె దిటవు చేసుకుంది. రాత్రీపగలు శ్రమించి అరుునా పిల్లలను సాకాలని, వారి భవిష్యత్‌కు బాటలు వేయాలని, పేదరికం నుంచి వారిని గట్టెక్కించాలని నిర్ణయిచుకుంది. గతంలో కంటే మరింత ఎక్కువగా కష్టపడడం ఆరంభించింది. వచ్చిన కూలి డబ్బులతోనే పిల్లలను బడికి పంపిస్తూ.. పుస్తకాలు కొనుగోలు చేస్తూ వారికి ఏ లోటూ రాకుండా పెంచింది. ఇంతలోనే ఉన్న పూరిల్లు కూలిపోరుుంది. దీంతో కుటుంబం మొత్తం మళ్లీ రోడ్డున పడింది. ఇంటిని తిరిగి నిలబెట్టేందుకు ఒక్కసారి పెట్టుబడి పెట్టలేని స్థితిలో నెలకు రూ.500 చెల్లించి గ్రామంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం ఆరంభించింది. తల్లి పడుతున్న కష్టాన్ని కుమారులు మీసాల లక్ష్మునాయుడు, సురేష్‌లు గుర్తించారు. చదువుతోనే బతుకులు బాగు చేసుకోవాలనుకున్నారు. క్రమశిక్షణతో గురువుల సహకారంతో చదువు బాట పట్టారు. పెద్దకుమారుడు లక్ష్మునాయుడు పదోతరగతిలో 521 మార్కులతో అదపాక హైస్కూల్‌కే ప్రథముడిగా నిలిచాడు. దీంతో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉచితంగా సీటు లభించింది. ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తయింది. ఉద్యోగ వేటను ఆరంభించాడు. చిన్నకుమాడు సురేష్ కూడా పదోతరగతిలో 9.2 పాయింట్లు సాధించి హైస్కూల్ టాపర్‌గా నిలిచాడు. జిల్లా రూరల్ డెవల్మెంట్ ఏజెన్సీ ద్వారా విశాఖపట్నంలోని ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అప్పూసప్పూ చేసి కుమార్తెకు వివాహం చేసింది. గ్రామంలోనే ఉంటూ వచ్చిన కూలి డబ్బులను కుమారుల చదువుకు నెలనెల పంపిస్తోంది. అమ్మగా పిల్లలకు అండగా నిలుస్తూ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తోంది. ఆదర్శంగా నిలుస్తోంది. పిల్లలు ప్రయోజకులైతే చాలు భర్త మృతిచెందినప్పుడు పరిస్థితి అంధకారంగా ఉండేది. పిల్లలను చదివించగలనోలేదో అన్న భయం వేసేది. నిద్రపట్టని రోజులు ఎన్నోగడిపాను. నేను ధైర్యం కోల్పోతే పిల్లలు అనాథలవుతారని గుండె దిటవు చేసుకున్నాను. పిల్లలు బాగా చదువుతున్నారు. పెద్దోడు చదువు పూర్తరుుంది. వారు ప్రయోజకులైతే అదే పదివేలు. నా కష్టమంతా మరచిపోతానంటూ పాతజ్ఞాపకాలను గుర్తుచేసుకుంటా గలగలా కన్నీరు కార్చింది. - పార్వతమ్మ, అదపాక అమ్మ ఎన్నో కష్టాలు పడింది.. నేను ఆరేళ్ల వయసులో ఉండగా నాన్న పక్షవాతంతో చనిపోయారు. అప్పటికి మాకు తెలిసీతెలియని వయసు. ఎటువంటి ఆస్తులూ లేవు. సొంత ఇల్లు కూడా లేదు. అమ్మ మా కోసం కూలి పనులకు వెళ్లి ఎన్నో కష్టాలు పడి మా ఇద్దరు అన్నదమ్ములును చదివించింది. అమ్మకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. అయినా మాకోసం నిత్యం కష్టపడుతోంది. ఎక్కడ ఉన్నా అమ్మకష్టమే గుర్తుకొస్తుంది. మంచి మార్కులతో బీటెక్ పూర్తి చేశాను. నేడోరేపో ఉద్యోగం వస్తుంది. అమ్మను కూలిపనులు మాన్పించి బాగా చూసుకుంటాను. - మీసాల లక్ష్మునాయుడు, పెద్ద కుమారుడు అమ్మ రుణం తీర్చుకోలేం మేము ఉన్నత చదువులు చదవడానికి అమ్మే కారణం. నాన్న చనిపోయూడన్న లోటు లేకుండా పెంచింది. బాగా చదివించింది. అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా కూలి పనులు చేసి మమ్మలును పెంచింది. అమ్మ రుణం తీర్చలేంది. ఉద్యోగం వచ్చిన వెంటనే చక్కగా చూసుకుంటాం. - మీసాల సురేష్, చిన్న కుమారుడు -
భర్త ఇంటి ఎదుటే భార్య అంత్యక్రియలు
చౌటుప్పల్: భార్యను అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు భర్త. అతడి ఇంటిముందే మృతదేహంతో ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా అత్తింటి వారి కనికరం కరువైంది. మృతురాలి తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతం.చివరకు ఇంటి ముందే గుంతను తవ్వి శవాన్ని పూడ్చారు. నిందితుడికి చెందిన రెండెకరాల పొలంలో భార్య మృతికి సార్మక చిహ్నంగా స్థూపాన్ని నిర్మించాలని, ఆ భూమిని పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చౌటుప్పల్ మండలం పంతంగిలో మిర్యాల శ్రీశైలం(28) తన భార్య పార్వతమ్మ(24)ను గత ఆదివా రం రోకలిబండతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పార్వతమ్మ మృతదేహాన్ని నిందితుడి ఇంటి ఎదు ట ఉంచి నాలుగు రోజులుగా బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. నిందితుడి వాటాకు 6ఎకరాల భూమి ఉంది. ఇరువర్గాల పెద్ద మనుషులు కూర్చొని 2.10ఎకరాల భూమి మృతురాలి కుటుంబానికి ఇచ్చే లా ఒప్పందం చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడి తండ్రి పోలీ సుల రక్షణలో ఉన్నారు. తల్లి యశోధ పరారీలో ఉంది. ఈ భూమి యశోధ పేరున ఉండడంతో, ఒప్పందం ముం దుకు సాగలేదు. దీంతో పార్వతమ్మ చనిపోయి 5రోజులు గడిచినా అంత్యక్రియలు చేయకుండా ఆందోళన సాగించారు. అసలు పార్వతమ్మను చంపింది ఎందుకంటే.. పార్వతమ్మ, శ్రీశైలంలది ఒకే గ్రామం. నాలుగేళ్ల కిందట వివాహమైంది. శ్రీశైలం ఓ రకమైన సైకో మనస్తత్వం. నిత్యం పార్వతమ్మను వేధింపులకు గురి చేసేవాడు. ఇతని వేధింపులకు తాళలేక పార్వతమ్మ దసరా పండుగ నుంచి తల్లి గారి ఇంటి వద్దే ఉంటోంది. శ్రీశైలం అప్పుడప్పుడు పార్వతమ్మ వద్దకు వెళ్లి వస్తున్నాడు. 2నెలల క్రితం ఓ సారి వెళ్లి ఇంటికి రమ్మని, లేదంటే కత్తిపీటతో కోసుకుంటానని బెదిరించాడు. ఆమె భయపడి కత్తిపీటను లాక్కుంది. శ్రీశైలమే చాకు తో చేయి కోసుకుని, భార్యపై నింద మోపాడు. అప్పటి నుంచి భార్యభర్త మధ్య సమస్య మరింత జఠిలమైంది. గత ఆదివారం మళ్లీ పార్వతమ్మ వద్దకు వెళ్లాడు. ఇంటికి రమ్మని అడిగాడు. అందుకు ఆమె చాకుతో చేయి కోసిందెవరో, తేలాకే వస్తానని తెగేసి చెప్పింది. అందు కు శ్రీైశైలం పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకుంటానని చెప్పాడు. దీంతో పార్వతమ్మ అప్పుడే వస్తానని చెప్పింది. అప్పటి దాకా నేనెక్కడ ఉండాలని శ్రీశైలం ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీం తో శ్రీశైలం రోకలిబండతో నీళ్ల సంపు వద్ద బట్టలు ఉతుకుతున్న పార్వతమ్మ తలపై మోదాడు. తల పగిలి, మెదడు చిట్లి బయటికొచ్చింది. కుటుంబ సభ్యులు గుర్తించి హైదరాబాద్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం.. కడగంచిబీరప్ప,యశోద దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె పార్వతమ్మ, రెండో కుమార్తె శ్వేత ఐదో తరగతి చదువుతోంది. కొడుకులు లేరు. పెద్దకుమార్తె తమ కళ్ల ముందే ఉంటుందనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన అబ్బాయితో పెళ్లి చేశారు. వివాహమై నాలుగేళ్లయినా సంతానం లేదు. కూతురు చనిపోయి, ఐదు రోజులుగా శవం కళ్లముందే ఉండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదన అరణ్య రోదనగానే మారింది. తండ్రి బీరప్ప బుధవారం స్పృహ తప్పడంతో ఆస్పత్రిలో చేర్చారు. తల్లి యశోద ముందు నడిచి అంత్యక్రియలు నిర్వహించింది. పార్వతమ్మ మృతికి చిహ్నంగా స్థూపం.. పార్వతమ్మ పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న కానుకలు, నిందితుడికి చెందిన 2.10ఎకరాల భూమిని మృతురాలి కుటుంబానికి ఇచ్చేలా ఒప్పందం చేశారు. నిందితుడి తల్లి పరారీలో ఉండడం, భూమి ఆమె పేరున ఉండడం తో, ఒప్పందం ముందుకు సాగలేదు. చివరకు మృతురాలి బంధువులు గురువారం అంత్యక్రియలు చేశారు. శ్రీశైలం ఇంటి ఎదుటే గుంతను తవ్వి శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ 2.10ఎకరాల భూమిలోనే ఈ ఇల్లు ఉంది. శవాన్ని పూడ్చిన చోటే పార్వతమ్మ మృతికి స్మారక చిహ్నంగా స్థూపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ రెండెకరాల భూమిని పార్కుగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు. -
పింఛన్ అందుకోకుండానే ముగ్గురు మృతి
బిజినేపల్లి/హన్వాడ/వలిగొండ: పింఛన్ అందుకోకుండానే వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం ముగ్గురు మృ తి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన మ రాఠి పార్వతమ్మ (65) బుధవారం ఉదయం తోటి వృద్ధులతో కలసి జీపీ వద్ద కూర్చొని ఉండగా ఛాతిలో నొప్పి అంటూ కుప్పకూలి పోయింది. నాగర్‌కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లగా, చనిపోయింది. నల్లగొండ జిల్లా వలిగొం డ మండలం మాందాపురం గ్రామానికి చెం దిన కీర్తన (14) మానసిక వికలాంగురాలు, పోలియో కూడా సోకింది. మంగళవారం ఆ స్పత్రిలో చూపించి తీసుకొచ్చారు. బుధవారం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం తర్వాత పింఛన్లు పంపిణీ చేయడానికి పేర్లు చదువుతుండగానే కీర్తన మృతి చెందిం ది. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండ లం వేపూర్ గ్రామానికి చెందిన కొత్త శంకరమ్మ(70) బుధవారం సాయంత్రం వరకు పిం ఛన్ కోసం పడిగాపులు కాసి, ఇంటిదారి పట్టింది. సాయంత్రం వరకు ఏం తినక పోవడంతో ఆకలితో కన్నుమూసింది. పింఛన్ బెంగతో వృద్ధుడి మృతి నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం జలాల్‌పూర్‌కు చెందిన గొర్రెకండ్ల రాములు (68) ఆసరా పథకంలో తన పేరు రాలేదని బెంగతో చనిపోయాడు. ఎనిమిదేళ్లుగా పింఛన్ పొం దుతున్న ఈ వృద్ధుడి పేరును ఇటీవలే తొలగించారు. తన తోటి మిత్రులు పింఛన్ పొందుతుండగా తానేమి పాపం చేశానని బుధవారం దిగులు చెందాడు. సాయంత్రం ఇంట్లో చింతచేస్తూ ప్రాణాలు వదిలాడు. -
ముత్యాల సుబ్బయ్యకు సతీ వియోగం
ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సతీ వియోగానికి గురయ్యారు. ఆయన ధర్మపత్ని పార్వతమ్మ(60) ఆదివారం తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాలకు స్వర్గస్థురాలయ్యారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. ముత్యాల సుబ్బయ్య దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి సంతానం. పార్వతమ్మ మృతి ముత్యాల సుబ్బయ్య కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సానుభూతిని వెలిబుచ్చింది.