స్నాచర్ల చేతిలో గాయపడ్డ మహిళమహిళకు గాయాలు | Woman injured in the Snatchers hand | Sakshi
Sakshi News home page

స్నాచర్ల చేతిలో గాయపడ్డ మహిళమహిళకు గాయాలు

Published Wed, Jun 22 2016 6:20 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

Woman injured in the Snatchers hand

బైక్ పై వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లడానికి ప్రయత్నించడంతో.. అప్రమత్తమైన మహిళ స్నాచర్ చేయి గట్టిగా పట్టుకుంది. దింతో వాహనం పై నుంచి పడి తీవ్ర గాయాలపాలైంది. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.

 

జక్కాపూర్‌కు చెందిన పార్వతమ్మ భర్తతో కలిసి బైక్‌పై గుర్రాలగొంది వైపు వస్తున్న సమయంలో.. బైక్‌ను వెంబడిస్తున్న గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పార్వతమ్మ స్నాచర్ చేయి గట్టిగా పట్టుకోవడంతో.. బైక్ పై నుంచి కిందపడింది. ఇది గమనించిన స్నాచర్లు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించిన భర్త ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement