ముత్యాల సుబ్బయ్యకు సతీ వియోగం | Director Mutyala Subbayya's wife passes away | Sakshi
Sakshi News home page

ముత్యాల సుబ్బయ్యకు సతీ వియోగం

Published Sun, Jun 8 2014 10:37 PM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

Director Mutyala Subbayya's wife passes away

 ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సతీ వియోగానికి గురయ్యారు. ఆయన ధర్మపత్ని పార్వతమ్మ(60) ఆదివారం తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాలకు స్వర్గస్థురాలయ్యారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. ముత్యాల సుబ్బయ్య దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి సంతానం. పార్వతమ్మ మృతి ముత్యాల సుబ్బయ్య కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సానుభూతిని వెలిబుచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement