మండల పరిధిలోని సంగాలపల్లె గ్రామానికి చెందిన ఎరమల పార్వతమ్మ(60) శుక్రవారం మృతిచెందింది. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజుకు సమాచారం అందచేశారు. వెంటనే సమితి అధ్యక్షుడు రాజు, స్నేహ సేవా సమితి అధ్యక్షుడు మధుసూదనరెడ్డిలు గ్రామానికి చేరుకొని ఆమె నేత్రాల నుంచి కార్నియాను తొలగించారు
సంగాలపల్లె (వీరపునాయునిపల్లె): మండల పరిధిలోని సంగాలపల్లె గ్రామానికి చెందిన ఎరమల పార్వతమ్మ(60) శుక్రవారం మృతిచెందింది. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజుకు సమాచారం అందచేశారు. వెంటనే సమితి అధ్యక్షుడు రాజు, స్నేహ సేవా సమితి అధ్యక్షుడు మధుసూదనరెడ్డిలు గ్రామానికి చేరుకొని ఆమె నేత్రాల నుంచి కార్నియాను తొలగించారు. వీటిని హైదరాబాద్‌లోని నేత్రాలయానికి తరలించన్నుట్లు వారు విలేకరులకు తెలిపారు. నేత్ర దానం చేసిన పార్వతమ్మ భర్త జయరామిరెడ్డి కుటుంబ సభ్యులను వారు అభినందించారు.