బిజినేపల్లి/హన్వాడ/వలిగొండ: పింఛన్ అందుకోకుండానే వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం ముగ్గురు మృ తి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన మ రాఠి పార్వతమ్మ (65) బుధవారం ఉదయం తోటి వృద్ధులతో కలసి జీపీ వద్ద కూర్చొని ఉండగా ఛాతిలో నొప్పి అంటూ కుప్పకూలి పోయింది. నాగర్‌కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లగా, చనిపోయింది. నల్లగొండ జిల్లా వలిగొం డ మండలం మాందాపురం గ్రామానికి చెం దిన కీర్తన (14) మానసిక వికలాంగురాలు, పోలియో కూడా సోకింది.
మంగళవారం ఆ స్పత్రిలో చూపించి తీసుకొచ్చారు. బుధవారం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం తర్వాత పింఛన్లు పంపిణీ చేయడానికి పేర్లు చదువుతుండగానే కీర్తన మృతి చెందిం ది. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండ లం వేపూర్ గ్రామానికి చెందిన కొత్త శంకరమ్మ(70) బుధవారం సాయంత్రం వరకు పిం ఛన్ కోసం పడిగాపులు కాసి, ఇంటిదారి పట్టింది. సాయంత్రం వరకు ఏం తినక పోవడంతో ఆకలితో కన్నుమూసింది.
పింఛన్ బెంగతో వృద్ధుడి మృతి
నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం జలాల్‌పూర్‌కు చెందిన గొర్రెకండ్ల రాములు (68) ఆసరా పథకంలో తన పేరు రాలేదని బెంగతో చనిపోయాడు. ఎనిమిదేళ్లుగా పింఛన్ పొం దుతున్న ఈ వృద్ధుడి పేరును ఇటీవలే తొలగించారు. తన తోటి మిత్రులు పింఛన్ పొందుతుండగా తానేమి పాపం చేశానని బుధవారం దిగులు చెందాడు. సాయంత్రం ఇంట్లో చింతచేస్తూ ప్రాణాలు వదిలాడు.
పింఛన్ అందుకోకుండానే ముగ్గురు మృతి
Published Thu, Dec 11 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement