సైబర్ నేరస్తుల వల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సైబర్ సెక్యూరిటీ
సాక్షి, హైదరాబాద్: ‘మీరు పెన్షన్ పథకానికి అర్హులయ్యారు..మేం పంపిన లింక్‌పై వెంటనే క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి’.. అంటూ సైబర్ నేరగాళ్లు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరించారు. www.pm&yojana.org వెబ్‌సైట్ పేరిట మోసపూరిత ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నట్టు వారు తెలిపారు.
ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిని నమ్మవద్దని, అందులోని లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడంతో ఫోన్‌లు హ్యాక్ అవుతాయని, అనంతరం సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని మోసగించే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరించారు. ఇలాంటి ఎస్‌ఎంఎస్‌లు వస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930కు లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment