
కుటుంబ సమస్యల కారణంగా తాను సిరికొండ వెళ్లలేనని, కొన్ని రోజుల వరకు డిప్యూటేషన్‌ను నిలిపివేయాలని ఆమె పలుమార్లు కోరారు.
సాక్షి, నిజామాబాద్: జక్రాన్ పల్లి ఎంపీడీఓ భారతి శుక్రవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. డిప్యూటేషన్ విషయంలో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యా యత్నం చేశారు. జక్రాన్ పల్లి మండలంలో ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారతిని అధికారులు కొద్దిరోజుల క్రితం డిప్యూటేషన్ మీద సిరికొండ ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా తాను సిరికొండ వెళ్లలేనని, కొన్ని రోజుల వరకు డిప్యూటేషన్‌ను నిలిపివేయాలని ఆమె పలుమార్లు కోరారు. ఇందుకు అధికారులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం నిద్రమాత్రలు మింగారు. అది గమనించిన కుటుంబసభ్యులు మొదట ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.
(శిష్యురాలికి ట్రైనింగ్.. ఆ వ్యక్తి చనిపోయాడని..)