జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం(ఫైల్)
గుంటూరు ఎడ్యుకేషన్: మూడున్నర దశాబ్దాలుగా ఒకే కేడర్‌లో పనిచేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓల) కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం ఉద్యోగోన్నతులు కల్పించడమనేది పరిపాలనలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎంపీడీఓల విషయంలో ఇది అమలుకు నోచుకోలేదు. గత ప్రభుత్వాలు అవలంబించిన నిర్లక్ష్య వైఖరి వల్ల ఉద్యోగోన్నతి లేక తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య ఎంపీడీఓలు విధులు నిర్వర్తించేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో వారిలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 మంది ఎంపీడీఓలు జెడ్పీ డెప్యూటీ సీఈవో, డీఎల్‌డీవో, డ్వామా ఏపీడీలుగా ఉద్యోగోన్నతి పొందారు. మొత్తం 21 మందికి ప్రమోషన్ కల్పించగా, నలుగురు పదోన్నతిని వదులుకున్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారిలో కొందరు ఇప్పటికే కొత్త స్థానాల్లో సంతోషంగా విధుల్లో చేరారు. (క్లిక్: బాలయ్యా... గుర్తున్నామా!)
35 ఏళ్ల తరువాత ఉద్యోగోన్నతులు
ఎంపీడీఓలకు ఉద్యోగంలో చేరిన 35 ఏళ్ల తరువాత ఉద్యోగోన్నతులు లభించాయి. ప్రమోషన్లు పొందిన ఎంపీడీఓలందరూ కొత్త స్థానాల్లో విధుల్లో చేరి, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి.
– డాక్టర్ జి.శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment