ఎంపీడీఓలకు బదిలీ
Published Wed, Feb 5 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
సాక్షి ప్రతినిధి, విజయనగరం: త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 25 మంది ఎంపీడీఓలకు బదిలీలు కానున్నా యి. జిల్లా పరిషత్ అధికారులు ఇప్పటికే సం బంధిత బదిలీ జాబితాను తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. వారి ఆమోదం రావడమే తరువాయి జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీఓలు రిలీవ్ కానున్నారు. జిల్లాలో మూడేళ్లు పైబడి పనిచేస్తున్న వారితో పాటు సొంత జిల్లాలో పనిచేస్తున్న వారిని కూడా బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మేరకు బదిలీకి అర్హులైన వారి జాబితాను రూపొందించారు. జాబితాలో ఉన్న వారందరికీ ఎక్కడికి బదిలీ కావాలో కోరుకోవాలంటూ మూడు జిల్లాల ఆప్షన్లు ఇచ్చారు. వారిచ్చిన ఆప్షన్లతో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు జాబితాను పంపించారు. ఎంపీడీఓలు ఇచ్చిన ఆప్షన్లలో ఏదో ఒక జిల్లాకు రెండు మూడు రోజుల్లో బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
ఉన్నతాధికారులకు పంపించిన జాబితాలో కె.విజయలక్ష్మి, జి.బాబూరావు, సీహెచ్.సుబ్బలక్ష్మి, ఎస్.రవీంద్ర, బి.సుధాకరరావు, పి.కిరణ్‌కుమార్, కె.రవికుమార్, పి.చంద్రమ్మ, కె.రామచంద్రరావు, పీవీ.రమణ, ఎంవీబీ .సుబ్రహ్మణ్యం, వై.పద్మజ, ఎస్.ఇందిరమ్మ, బి.ఉషారా ణి, ఎల్‌ఎన్‌వీ .శ్రీధర్‌రాజా, జి.అరుందతిదేవి, ఎం.మణి, ఎన్.ఆర్.కె.సూర్యం, వీవీవీఎస్.లక్ష్మణరావు, ఎస్.శారదాదేవి, కె.రమామణి, జీఎస్.నిర్మలాదేవి, జీవీ.రమణమ్మ, వి.విజయలక్ష్మి, డి.లక్ష్మి, ఎన్.ఆర్.కె.సూర్యం ఉన్నారు. వీరి స్థానంలో పక్క జిల్లాల ఎంపీడీఓలు రానున్నారు. ఇదే తరహాలో జిల్లాలో పనిచేస్తున్న 34మంది తహశీల్దార్ల కు బదిలీలు జరిగిపోయాయి. 29మందిని విశాఖ జిల్లాకు, ఐదుగురిని శ్రీకాకుళం జిల్లాకు కేటాయిస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి స్థానంలో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి తహశీల్దార్లు రానున్నారు. మొత్తానికి జిల్లానుంచి ఒకేసారి పెద్ద ఎత్తున తహశీల్దార్లు, ఎంపీడీఓలు బదిలీ అయ్యారు.
Advertisement