చిరిగిన దుస్తులతో ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్
చిన్నచింతకుంట: ఒకరు మండల పరిపాలనను గాడిలో పెట్టే అధికారి..మరొకరు మండలం విద్యాధికారి. వీరి ఇద్దరి మధ్య ఏర్పడ్డ చిన్నపాటి మనస్పర్థలతో విమర్శలు చేసుకుంటూ ఎంపీపీ కార్యాలయంలోనే ఎంపీపీ సాక్షిగా ఒకరిపైనొకరు దాడులు చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల ఎంఈఓగా లక్ష్మణ్‌సింగ్ కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యనే కోయిల్‌కొండ విద్యాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్నచింతకుంట మండలంలో బాధ్యతలు విస్మరిస్తున్నారని ఎంపీపీ హర్షవర్ధన్‌కు ఎంపీ డీఓ పలుమార్లు విన్నవించారు. ఈక్రమంలోనే మండల కార్యాలయానికి వచ్చిన ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ మూమెంట్ రిజిçస్ట్టర్‌లో సంతకం చేశారు. ఈ విషయాన్ని ఎంపీడీఓ ఫయాజుద్దీన్ ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ హర్షవర్ధన్ ఎంపీడీఓ, ఎంఈఓలను తన చాంబర్‌లోకి పిలిపించారు. ఇరువురు అక్కడికి వెళ్లి ఆరోపణలు చేసుకుంటు ఘర్షణలకు పాల్పడ్డారు. తనను కులంపేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడని ఎంపీడీఓపై ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎంపీడీఓ వివరణ కోరగా
ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్ జూలై నెల మూమెంట్ రిజిçస్టర్‌లో ముందస్తుగా మూమెంట్ రాసుకున్నారని ఇది సరికాదని ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి పిలిపించి అడగారన్నారు. ఇబ్బందిగా ఫీలైన ఎంఈఓ తనపై దురుసుగా మాట్లాడారన్నారు. అంతేతప్ప ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదన్నారు. ఎంఈఓ దాడిపై టీఎస్ యూటీఎఫ్, తెలంగాణప్రాంత ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దాడిచేసిన అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment