పాముల బెడదతో చేవెళ్ల పైర్‌స్టేషన్ సిబ్బంది భయపడిపోతున్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ క్వార్టర్స్‌లో ఉన్న పైర్‌స్టేషన్‌కు పాముల బెడద పట్టుకుంది. గత వారం రోజుల నుంచి ఫైర్ సిబ్బంది ఐదు పాములను చంపారు. స్వంత భవనంలో లేకపోవటంతో తాత్కాలికంగా ఎంపీడీఓ క్వార్టర్స్‌లో ఫైర్‌స్టేషన్ కొనసాగుతోంది. ఈ క్వార్టర్స్ శిధిల భవనాలతో నిండి ఉండటంతో నిత్యం పాములు స్టేషన్ పరిసరాల్లో తిరుగుతున్నాయి. స్వంత భవనం త్వరగా ఏర్పాటు చేస్తే ఈ ఇబ్బందులు తప్పుతాయని, లేదంటే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు.
ఫైర్ స్టేషన్‌కు పాముల బెడద
Published Mon, Sep 28 2015 7:57 PM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM
Advertisement
Advertisement