పని చేయకపోతే పంపించేస్తా
పని చేయకపోతే పంపించేస్తా
Published Fri, Feb 26 2016 9:35 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కార్పొరేషన్ల ఈడీలపై కలెక్టర్ అసంతృప్తి
ఎంపీడీఓల పనితీరుపైనా ఆగ్రహం
ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక
శాఖల వారీగా అభివృద్ధి పనులపై సమీక్ష
కర్నూలు: కొందరు అధికారులు పని చేయకపోవడం వల్లే అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని.. ఇకపై అలాంటి అధికారులను గుర్తించి జిల్లా నుంచి పంపించేస్తానని కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. గురువారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇస్తున్న రుణాల మంజూరులో జాప్యం జరగకుండా అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీఓలదే కీలక పాత్ర అని, చాలా చోట్ల లబ్ధిదారుల జాబితాలు బ్యాంకులకు చేరవేయడంలో జాప్యం చేయడం ఇబ్బందులకు కారణమవుతోందన్నారు. కొన్ని బ్యాంకుల్లో లక్ష్యాలు తక్కువగా ఉన్నట్లు చూపుతున్నారని ఎల్‌డీఎం నరసింహారావు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రుణాలు ఇచ్చేందుకు సుముఖత చూపని బ్యాంకర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికిచర్యలు తీసుకుంటామన్నారు.
వేసవి దృష్ట్యా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చార్జిమెమోలతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో కాకుండా మండల, జిల్లా కేంద్రాల్లో ఉండి పనిచేస్తామంటే సహించేది లేదన్నారు. నెలలో 21 రోజులు మండలాధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఇకపై ఏ పత్రికలోనైనా తాగునీటి సమస్యపై కథనాలు వచ్చాయంటే ఆ ప్రాంత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ పి.భానువీరప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఈడీ రమణ, మైనార్టీ కార్పొరేషన్ ఈఓ కరీముల్లా, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, డీపీఓ శోభాస్వరూప రాణి, మెప్మా పీడీ రామాంజనేయులు, పీఆర్ ఎస్‌ఈ సురేంద్రనాథ్,
Advertisement