ch vijaya mohan
-
తెలంగాణను పొగుడుతావా?
దళితుడిపై కర్నూలు కలెక్టర్ సీరియస్ డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రస్తావనపై మండిపాటు కర్నూలు(అర్బన్): పక్క రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతుంటే మన రాష్ట్రంలో ఒక్క ఇల్లూ కట్టడంలేదన్న దళితుడిపై కలెక్టర్ విరుచుకు పడ్డారు. ‘‘మనకు అన్యాయం చేసిన తెలంగాణను పొగుడుతావా? తెలుగు గడ్డ మీద అక్కడి(తెలంగాణ) ప్రస్తావన తీసుకొస్తావా? ఆంధ్రా, రాయలసీమ రక్తం నాలో ఉంది. ఈ వేదిక మీద ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని కర్నూలు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. బుధవారం కర్నూలులో బాబూ జగ్జీవన్‌రామ్ 110వ జయంతి ఉత్సవాల్లో దళిత నేత సీహెచ్ మద్దయ్య మాట్లాడారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నారని, మన రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క ఇళ్లూ నిర్మించలేదని చెబుతుండగా, కలెక్టర్ జోక్యం చేసుకుని విరుచుకుపడ్డారు. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు దళిత నేతలు మద్దయ్యకు సంఘీభావం ప్రకటించారు. సభలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా కలెక్టర్ డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ఆయన పచ్చ చొక్కా వేసుకున్న నాయకుడిలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో కలెక్టర్ వెంటనే మైక్ కట్ చేయించారు. మైక్ ఇవ్వకపోవడంపై మారెప్ప ఫైర్ సభ ముగుస్తున్న సమయంలో మాట్లాడాల్సిన నేతల్లో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి మాత్రమే మిగిలారు. ఈ సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి కేఈకి కలెక్టర్ మైక్ ఇవ్వడం పట్ల మారెప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ.. సే సారీ ’ అంటూ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. సారీ చెప్పాల్సిన అవసరం లేదని కలెక్టర్ సమాధానం ఇవ్వడంతో కొంతసేపు మాటామాటా పెరిగింది. ‘నేను సమైక్యాంధ్రలో ఐదేళ్లు మంత్రిగా పనిచేశా. నాకు మైక్ ఇవ్వకపోవడం ఏమిటి’’ అని నిలదీశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. -
పని చేయకపోతే పంపించేస్తా
కార్పొరేషన్ల ఈడీలపై కలెక్టర్ అసంతృప్తి ఎంపీడీఓల పనితీరుపైనా ఆగ్రహం ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక శాఖల వారీగా అభివృద్ధి పనులపై సమీక్ష కర్నూలు: కొందరు అధికారులు పని చేయకపోవడం వల్లే అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని.. ఇకపై అలాంటి అధికారులను గుర్తించి జిల్లా నుంచి పంపించేస్తానని కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. గురువారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇస్తున్న రుణాల మంజూరులో జాప్యం జరగకుండా అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీఓలదే కీలక పాత్ర అని, చాలా చోట్ల లబ్ధిదారుల జాబితాలు బ్యాంకులకు చేరవేయడంలో జాప్యం చేయడం ఇబ్బందులకు కారణమవుతోందన్నారు. కొన్ని బ్యాంకుల్లో లక్ష్యాలు తక్కువగా ఉన్నట్లు చూపుతున్నారని ఎల్డీఎం నరసింహారావు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రుణాలు ఇచ్చేందుకు సుముఖత చూపని బ్యాంకర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికిచర్యలు తీసుకుంటామన్నారు. వేసవి దృష్ట్యా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చార్జిమెమోలతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో కాకుండా మండల, జిల్లా కేంద్రాల్లో ఉండి పనిచేస్తామంటే సహించేది లేదన్నారు. నెలలో 21 రోజులు మండలాధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఇకపై ఏ పత్రికలోనైనా తాగునీటి సమస్యపై కథనాలు వచ్చాయంటే ఆ ప్రాంత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పి.భానువీరప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఈడీ రమణ, మైనార్టీ కార్పొరేషన్ ఈఓ కరీముల్లా, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, డీపీఓ శోభాస్వరూప రాణి, మెప్మా పీడీ రామాంజనేయులు, పీఆర్ ఎస్ఈ సురేంద్రనాథ్,